Suryaa.co.in

Andhra Pradesh

ఈ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు పదవులు..పెత్తనమంతా జగన్ వర్గానిదే

-బీసీలను రాజకీయాల్లో అగ్రస్థానంలో నిలిపిందే తెలుగుదేశంపార్టీ
• బీసీ, ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు ఈ రెండున్నరేళ్లలో ఏంచేశాడో ముఖ్యమంత్రి చెప్పగలడా?
• ఆయావర్గాల్లోని ఒక్క యువకుడికైనా ఆర్థికభరోసా, స్వయంఉపాధి కల్పించారా?
• 140కు పైగా బీసీకులాలుంటే, ఈ ముఖ్యమంత్రి తనరాజకీయఅవసరాలకోసం తూతూమంత్రంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశాడు.
-టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా
జనగణనపై అసెంబ్లీలో తీర్మానంచేస్తూ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎంతో చేసినట్లు మాట్లాడటం, ఆయావర్గాలకు ఏదోచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అగ్రస్థానంలో నిలిపిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గార్లకే దక్కుతుంది. ఈ వాస్తవం ఉభయతెలుగురాష్ట్రాల్లోని బీసీసమాజానికి బాగాతెలుసు. స్వర్గీయ ఎన్టీ ఆర్ బీసీలకు స్థానికసంస్థల్లో 27శాతం రిజర్వేషన్లుకల్పిస్తే, దాన్ని చంద్రబాబునాయుడు గారు 34శాతానికిపెంచారు. కానీ బీసీలను ఉద్ధరించానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్లను తిరిగి 27శాతానికి కుదించి, బీసీలకు స్థానికసంస్థల్లో పదవులు దక్కకుండా చేశాడు. 16,800 పదవులను బీసీలకు దక్కకుండా ఈ ముఖ్యమంత్రి నిర్దాక్షణ్యంగా ప్రవర్తించాడు. అలాంటి వ్యక్తి బీసీలకు ఏదోచేసినట్టు చెప్పుకోవడం వారిని మోసగించడానికే.
బీసీజనగణనపై ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు గొప్పలు చెబుతు న్నాడు. 06-09-2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, బీసీలకు చట్టసభల్లో33శాతం రిజర్వేషన్లు ఉండాలని చెప్పారు. కేంద్రప్రభుత్వంలో బీసీలకోసం ప్రత్యేకంగా ఒకశాఖను ఏర్పాటుచేయాలని, బీసీలకు 25శాతం నిధులుకేటాయించాలని, వెనుకబడినవర్గాలకుచెందిన జాతీయకమిషన్ కురాజ్యాంగప్రతిప త్తి కల్పించాలని, కేంద్రప్రభుత్వఉద్యోగాల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వే షన్లు అమలుచేయాలని 2014లోనే అసెంబ్లీలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం తీర్మానంచేసింది. చంద్రబాబునా యుడుఎప్పుడో చేయాల్సింది చేస్తే, ఈ జగన్ రెడ్డి ఇప్పుడు బీసీల గణన అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు.
బీసీల జపంచేస్తూ, ఆయావర్గాలనుమోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి నిజంగా బీసీలపై ప్రేమేఉంటే, కేంద్రప్రభుత్వం తీసు కొచ్చిన ఎన్ఆర్సీ బిల్లుకి పార్లమెంట్ లో తనపార్టీఎంపీలతో ఎందుకు మద్ధతుప్రకటించాడు? పార్లమెంట్ లో వైసీపీఎంపీలు కేంద్రం చెప్పినదానికి తలాడిస్తే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాత్రం తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకమంటూ వక్రభాష్యాలు పలికా డు. 22మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్మోహ న్ రెడ్డి, చేతిలో 28 మందిఎంపీలను ఉంచుకొని కేంద్రం ముందు ఇప్పుడు మెడలువంచింది నిజంకాదా? దేశవ్యాప్తంగా బడుగు బలహీనవర్గాలు, అన్నిరాష్ట్రాలు బీసీజనగణన కావాలని ఇప్పుడు కోరుతున్న నేపథ్యంలోనే జగన్ కు బీసీగణన గుర్తుకొచ్చింది. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీలను మభ్యపెట్టడానికి తాత్కాలికంగా అసెంబ్లీలో జనగణనకుఅనుకూలంగా బిల్లుపెట్టినా, రేపు కేంద్రం నిలదీస్తే, తాముచేయలేదని తప్పించుకుంటాడు.
మత్స్యకారుల పొట్టకొట్టేలా ఈముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వం జీవోనెం 217 తీసుకొచ్చింది. దానిప్రకారం మత్స్యకారులకు ఉపాధికల్పించే కాలువలు, చెరువులు, నదుల్లోని మత్స్యసంపదను ఇతరులకు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. బీసీల్లో దాదాపు 140కు పైగా కులాలుంటే, అన్నింటినీ పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి కేవలం 56 కార్పొరేషన్లు మాత్రమే వేసి, వాటికి నిధులు, విధులు లేకుండా చేశాడు. గొల్లపూడిలో ఒకకాలేజీని ఖాళీచేయించి, అక్కడే బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు ఉండేలా చేశాడు ఈ ము ఖ్యమంత్రి. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశామంటూ డబ్బాలుకొట్టు కుంటున్న ముఖ్యమంత్రి ఒక్కదానికి కూడా రూపాయినిధులివ్వ లేదు. బలహీనవర్గాలకు స్వయంఉపాధి పొందడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడాల్సిన కార్పొరేషన్లను ఈ ముఖ్యమంత్రి పూర్తిగా నిర్వీర్యంచేశాడు.
రాష్ట్రంలోని ఒక్క బీసీ యువకుడికి కూడా కార్పొరేషన్ కింద రూపాయి సాయంచేసింది లేదు. బీసీలకు పంచాయతీపదవులిచ్చాము.. మున్సిపల్ ఛైర్మన్ల నుచేశామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఆయనలోని అజ్ఞా నానికి నిదర్శనం. ఈ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు పదవులు పెత్తనమంతా జగన్మోహన్ రెడ్డి వర్గానిదే. ఈ వాస్తవం ముఖ్యమం త్రికి కూడా తెలుసు. తెలిసీ కావాలనే బీసీలను మరింత మోసగిం చడానికి, వారిన తనస్వార్థానికి బలితీసుకోవడానికి ఆయావర్గాల కు ఏదోచేస్తున్నట్లు వారిని నమ్మించడానికి కట్టుకథలు అల్లుతు న్నాడు. రూ.5లక్షలు, ఇతరత్రాసౌకర్యాలు ఉన్న పదవులసహా, ప్రభుత్వంలోని కీలకవ్యవహారాలు చక్కబెట్టే స్థానాలన్నింటీనీ జగన్మోహన్ రెడ్డి తనవర్గంవారికే అప్పగించాడు.
ఎందుకూకొరగాని చెప్పుకోవడానికి పనికిరాని వాటిని మాత్రమేబీసీలకు,ఎస్సీ, ఎస్టీల కు ఇచ్చి, వారికన్నీళ్లు తుడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూతుళ్లు విదేశాల్లో చదువుతుంటే, బీసీ, ఎస్టీ, ఎస్సీ యువత మాత్రం ఉద్యోగాలు, సరైన చదువులులేక రోడ్లపై పడ్డారు. జగన్ తన అనుచరులకోసం బీసీలకుకార్పొరేషన్లు ఏర్పా టుచేశాడు తప్ప, బీసీలను ఉద్ధరించడానికి కాదు. బీసీల్లో దాదాపు 140కి పైగా కులాలుంటే, తూతూమంత్రంగా నిధులు, విధులులేని 56కార్పొరేషన్లుఏర్పాటుచేశాడు. అవి ఎక్కడున్నా యో, వాటికి ఎన్నినిధులుఇచ్చారో ఎవరికీతెలియదు. బీసీ కార్పొరేషన్లుఉన్నది బీసీయువతకు అండదండలు ఇవ్వడానికి, వారికి ఆర్థికంగాచేయూత ఇవ్వడానికి, కానీ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన బీసీ కార్పొరేషన్లద్వారా ఎంతమంది బీసీయువతకు ఏ విధమైన సాయం, ఉపాధి లభించాయో ఆయనే సమాధానం చెప్పాలి.
బీసీలకు అవిచేశాము..ఇవిచేశాము అని చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి వాస్తవంగా వారికి ఒరగబెట్టిందేమీ లేదు. పైగా బీసీలఅభ్యున్నతికోసం కేంద్రప్రభుత్వమిచ్చిన నిధులనుకూడా దారిమళ్లించి, తనప్రభుత్వ అవసరాలకోస వాడుకున్నాడు. గ్రామాల్లో మంచినీటి కల్పనకోసంకేంద్రమిచ్చిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి స్వాహాచేశాడు. వైసీపీప్రభుత్వంలోని డిప్యూటీ సీఎంలు ఆటలో అరటిపండ్లు మాత్రమే. పేరుకే డిప్యూటీసీఎంలు తప్ప, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కులేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ నోరుతెరవమంటే తెరవడం, లేదంటే కుక్కినపేనుల్లా పడిఉండటమే వారిపని. బలహీనవర్గాలంటే బీసీలే కాదు..ఎస్సీలు,ఎస్టీలు అందరూ వస్తారు. ఆయా వర్గాలకు ఈ ముఖ్యమంత్రి తనపాలనలో ఒరగబెట్టింది శూన్యం. టీడీపీ ప్రభుత్వంలో బీసీవిద్యార్థులతోపాటు, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థులు విదేశాల్లోచదువుకునేలా చంద్రబాబునాయుడు వారికి ఆర్థికంగా అండదండలు అందించారు.
జగన్ అధికారంలోకివచ్చాక టీడీపీప్ర భుత్వంలో చదువుకోవడానికి వెళ్లిన అనేకమంది విద్యార్థులు విదే శాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వసాయం అందక, వారి కుటుంబాలఆర్థికపరిస్థితి సహకరించక, విదేశాల్లో వారుపడు తున్న నరకయాతన ఈముఖ్యమంత్రికి కనిపించడంలేదు. బీసీల కు ఈ ముఖ్యమంత్రే కొత్తగా స్పీకర్ ఇచ్చామన్నట్లు చెబుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో యనమలరామకృష్ణుడు, ప్రతిభాభారతిలు చేసిన పదవులు జగన్మోహన్ రెడ్డికి గుర్తులేవా? దళితుడైన బాల యోగిని లోక్ సభస్పీకర్ ను చేసింది చంద్రబాబునాయుడు కాదా? ఎర్రంన్నాయుడిగారిని కేంద్రమంత్రినిచేసి, ఢిల్లీలో చక్రం తిప్పేస్థానంలో కూర్చొబెట్టింది తెలుగుదేశంకాదా? బీసీలకు పెద్ద పీట వేశామంటున్న ముఖ్యమంత్రి, వారిని నిజంగా పీటలకే పరిమితంచేశాడు. సింహాసనాలను మాత్రం తనవర్గానికి అప్పగించాడు.
ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది వేరు, ఇప్పుడు ఆయనచేస్తున్నది వేరు. తన రెండున్నరేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎన్నినిధులు ఇచ్చి,ఎన్ని కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచాడో చెప్పగలడా? ఆయావర్గాలకు ఈప్రభుత్వం ఏంచేసిందో వివరిస్తూ, పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగలరా? ప్రజలను మోసపెట్టి, మభ్యపెట్టేలా పాలనచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా తనమోసపూరిత విధానాలకుస్వస్తి పలికితే మంచిది.
జగన్మోహన్ రెడ్డిని నమ్మి, అతని పాలనఎలాఉంటుందో చూద్దామనే బీసీలు, ఎస్టీలు,ఎస్సీలు ఆయనకు అవకాశమిచ్చా రు. స్థానికసంస్థలఎన్నికల్లో టీడీపీకి ఓటేసినా, చంద్రబాబునాయు డి నాయకత్వం రాదనిగ్రహించే ప్రజలంతా 2024ఎన్నికలు ఎప్పుడువస్తాయా… చంద్రన్నని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దా మా అని ఎదురుచూస్తున్నారు. తమప్రభుత్వానికి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైందనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు గ్రహిస్తే మంచిది.

LEAVE A RESPONSE