Suryaa.co.in

Andhra Pradesh

బుద్ధి జ్ఞానం ఏమైనా ఈ సీఎంకు ఉన్నాయా?

-కూటమి నుంచి నేను ఆశించింది ఇదే
-అమరావతి పునర్నిర్మాణంతో పాటు, రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా
-ఏపీ అంటే అమరావతి, పోలవరం
-కేంద్రంలోని బిజెపి సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ముందు చూపుతో అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టడం ఖాయం
-నరసాపురం పార్లమెంట్ సభ్యులు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించిన అమరావతిని పునర్నిర్మిస్తామని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధర్మవరం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొనడం పట్ల నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. కూటమి నుంచి నేను ఆశించింది ఇదేనని, ఈ ఆశయం కోసమే కూటమిలో బిజెపి ఉండాలని ఊరుకోవడం జరిగిందన్నారు. ఇదే నేను కలలు కన్న కూటమి అని పేర్కొన్నారు.

అమిత్ షా మాటల ద్వారా కూటమి నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని ప్రజలు భావిస్తున్నారన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఏపీ అంటే అమరావతి, పోలవరం అని నిర్వచించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి వైపు రాష్ట్రం పరుగులు పెట్టడం ఖాయమన్నారు.

ఒక చక్కటి రాజధానిని నిర్మించుకుంటే, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు నుంచి ఎంత ఆదాయం సమకూరుతుందో, అంతా ఆదాయం సమకూరగలదన్నారు. వెంటనే కాకపోయినా, పదేళ్లలో అన్ని హంగులతో రాజధానిని నిర్మించుకోగలిగితే అదొక పెద్ద సంపదగా మారుతుందన్నారు.

పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ఇటు రాయలసీమ ప్రాంతానికి కూడా సాగు, తాగునీటి ఇబ్బందులను లేకుండా చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. కృష్ణా డెల్టాకు రావలసిన నీరును శ్రీశైలం వద్దనే నిలిపివేసి, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందివ్వవచ్చునన్న ఆయన, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా హంద్రీ నీవా సుజల స్రవంతి కి నీటిని తరలించడం ద్వారా రాయలసీమ ప్రాంతం రైతాంగానికి సాగునీటిని సరఫరా చేయవచ్చునని తెలిపారు.

రాయలసీమను మళ్లీ రతనాల సీమగా మార్చవచ్చునని పేర్కొన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతంలో బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, శ్రీశైలం నుంచి మళ్లించిన నీటిని నేరుగా వ్యవసాయానికి అందించడం ద్వారా పచ్చని పంటలతో రాయలసీమ ప్రాంతం కళకళలాడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర నలుమూలల నీటి సౌకర్యం అందుబాటులోకి రావాలంటే పోలవరం పూర్తి చేయడం ఒక్కటే మార్గమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాజధాని లేని రాష్ట్రం ఏంట్రా… బాబు?!, బుద్ధి జ్ఞానం ఏమైనా ఈ ముఖ్యమంత్రి కి ఉందా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు రాజధానులని అంటాడు… కానీ రాష్ట్రానికి ఎక్కడా రాజధాని లేకుండా చేశాడు . మాట్లాడితే విశాఖపట్నం వచ్చేస్తాను… కాపురం పెట్టేస్తానని అంటాడన్న రఘురామ కృష్ణంరాజు, తాను లో కాపురం ఉండే అమరావతి మాత్రం రాజధాని కాదని అంటాడని, చివరకు అమరావతిలో నిర్మించిన రోడ్లను తవ్వేశారని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందన్న రఘురామకృష్ణంరాజు, పోలవరం ప్రాజెక్టును తక్షణమే యుద్ధప్రాతిపదికను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో అమరావతి పునర్నిర్మాణం, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారన్నారు. ఈ దిశగా బిజెపి నాయకత్వం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, రాజమండ్రి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హామీ ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సర్వేలన్నీ కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి
సర్వేలన్నీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెబుతున్నాయని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రవి ప్రకాష్ నేతృత్వంలోని ఆర్ టి వి సర్వేలోనూ, చాలామంది నిపుణులు కలిసి చేసే ఫోకస్ సర్వే, ప్రవీణ్ ఆధ్వర్యంలోని రైజ్ సర్వే తో పాటు నేను కూడా రెండు సర్వేలను చేయించాను. ఏ సర్వే అంచనాలను చూసిన కూటమి విజయాన్ని సూచిస్తున్నాయన్నారు. ఒక్క టైమ్స్ నౌ సర్వే మాత్రమే ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సర్వే అంచనాలను వెల్లడిస్తోందని చెప్పారు.

భూ హక్కు చట్టం గురించి మాట్లాడిన పాపానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై కేసులా?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ హక్కు చట్టం గురించి ప్రజలకు వివరించినందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసులు నమోదు చేయడం, ఈ ప్రభుత్వ ధమనకాండ కు నిదర్శనమని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై కేసులను నమోదు చేసినంత మాత్రాన , ఈ నల్ల చట్టం గురించి ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ , కూటమి నాయకులు ఎవరూ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈరోజు మళ్ళీ నేను కూడా భూ హక్కు చట్టం గురించి మాట్లాడుతున్నానని, ఇంకా చాలామంది కూటమి నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు.

సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారికే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతి ఏమిటి?
భూ హక్కు చట్టం ప్రత్యక్ష బాధితుడిని నేను అంటూ ఎక్స్ వేదికగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ ట్విట్ చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. డాక్టర్ పివి రమేష్ మూడేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి వద్ద వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదా లో పనిచేశారన్నారు . నా తల్లిదండ్రులు చనిపోతే, వారి పేరిట ఉన్న పట్టా భూమిని తన పేరిట మ్యూటేషన్ చేయడానికి రెవెన్యూ అధికారులు తిరస్కరించారని రమేష్ తెలిపారన్నారు. కృష్ణాజిల్లాలోని విన్నకోటలోని తన తల్లిదండ్రుల పేరిట ఉన్న పట్టా భూములను మ్యూటేషన్ చేయమని కోరుతూ, తహసిల్దార్ కు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారని, ఆర్ డి ఓ కు పోస్టులో పంపిన పత్రాలను కనీసం తెరిచి చూడకుండా వెనక్కి పంపారని రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారన్నారు .

36 ఏళ్ల పాటు రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో సేవలు అందించిన ఒక సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య వ్యక్తులు, రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని రఘురామకృష్ణం రాజు అన్నారు. డాక్టర్ పి వి రమేష్ పట్ల రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు దారుణమన్న ఆయన, పి వి రమేష్ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అని తెలిపారు. షెడ్యూల్ కాస్ట్ కి చెందిన ఆయన కష్టపడి చదివి ఓపెన్ కేటగిరిలో సొంత రాష్ట్రంలో పోస్టింగ్ సంపాదించుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎంపీ ప్రాణాలకు రక్షణ లేదని, జిల్లా కలెక్టర్ గా పని చేసిన అధికారి సొంత భూములను మ్యూటేషన్ చేసే పరిస్థితి లేదన్నారు.

ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని, విధ్వంసానికి గురి చేశారని మండిపడ్డారు. భూ హక్కు చట్టం గురించి సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి వి రమేష్ చేసిన ట్విట్ చాలు, ఈ చట్టం ఎవరి బాగు కోసం, ఎవరు కన్నాలు వేయడానికి తీసుకువచ్చారో అర్థమవుతుందని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు.

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారం మంచిది కాదు
అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో కొంతమంది మత పెద్దలు చేస్తున్న ప్రచారం మంచిది కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తాను కొన్ని చర్చిలను సందర్శించానని, ప్రార్ధనా మందిరాలలో ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, అందుకే కేవలం చర్చి ఫాదర్ లను కలిసి వారి ఆశీస్సులను తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను కలిసి మేము మీకు ఓటు వేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చిలను, మసీదులను కూల్చివేస్తారట కదా అంటూ ప్రశ్నించారని తెలిపారు.

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చీలు, మసీదుల జోలికి అసలు రామని వాటి కాంపౌండ్ గోడను కూడా తాకమని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. బిజెపిని ఉద్దేశించి బహుశా ఈ రకమైన ప్రచారాన్ని కొంతమంది పనిగట్టుకుని చేస్తున్నారని, ఇప్పుడు బిజెపి, టిడిపి, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన మందిరాల జోలికి రాదని స్పష్టమైన హామీ నేను ఇస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు ఎన్నో…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయని, రథాలను ధ్వంసం చేశారని, శ్రీరాముడి శిరసుని ఖండించారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పిచ్చివాళ్లు, తేనెటీగలు, ఉన్మాదుల పేరిట హిందూ దేవాలయాలపై 130 చోట్ల దాడులు జరిగాయని పేర్కొన్న ఆయన, దేవాలయాలపై దాడులు జరిగాయని రానున్న కూటమి ప్రభుత్వ హయాములో చర్చీలు, మసీదులపై దాడులు జరుగుతాయనే ప్రచారం సరి కాదన్నారు. అంతర్వేది రథం దగ్ధం చేస్తే ఎవరికైనా బాధనిపిస్తుందని, శ్రీరాముడి శిరస్సును ఖండిస్తే ప్రతి ఒక్కరూ బాధపడతారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్చిలపై, మసీదులపై దాడులు చేస్తారట కదా అని నన్ను రెండు చోట్ల ప్రశ్నించడం జరిగిందన్న ఆయన, ఎవరైనా మనశ్శాంతి కోసమే ప్రార్థన మందిరాలకు వెళ్తారని , ఎవరి మత విశ్వాసం వారిదన్నారు. ఏ మత విశ్వాసమైనా ఒక్కటేనని, మనకంటే గొప్ప శక్తివంతుడైన భగవంతుడు కాపాడుతాడనేది ప్రతి ఒక్కరి నమ్మకమని తెలిపారు. ప్రార్థన మందిరానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తాను తన కుటుంబం, తన దేశం బాగుండాలని కోరుకుంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి వంటి వారు మాత్రమే తాను ఒక్కడినే బాగుండాలని, దేశం, రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుకునే వ్యక్తి అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

కూటమి దెబ్బకు వైకాపా విలవిల
రాష్ట్రంలో కూటమి దెబ్బకు వైకాపా విలవిలలాడుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. రాష్ట్రంలో బిజెపిని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ ని ఎంతో బలోపేతం చేశారని అయినా ప్రస్తుత రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి ఆయన నుంచి కనీసం సలహా కూడా తీసుకోవడం లేదని ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ హాస్యాస్పదంగా ఉందన్నారు. సోము వీర్రాజు రాజమండ్రిలో ఉన్న ఆయన్ని పట్టించుకోవడంలేదని విజయ సాయి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న రఘురామకృష్ణం రాజు, ఆయన్ని పట్టించుకోవడంలేదని ఈయనకు ఎవరు చెప్పారు అంటూ ఎద్దేవా చేశారు.

నెల్లూరులో విజయసాయిరెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నారు. వేమిరెడ్డి ఘనవిజయం సాధించబోతున్నారన్నారు . రాష్ట్రంలో కూటమి త్రివేణి సంగమంలా ముందుకు దూసుకు వెళ్తోందన్న రఘురామ కృష్ణంరాజు, బిజెపి రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షురాలికి, మాజీ అధ్యక్షుడికి మధ్య వైరం ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించారన్నారు. అయినా ఎన్నికల పనుల్లో బిజీ గా ఉండే విజయసాయి ట్విట్ చేస్తారా అంటూ ప్రశ్నించిన ఆయన, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే విజయసాయి పేరిట ట్వీట్ చేసి ఉంటారన్నారు.

బాబాయిని హత్య చేయించినట్టుగానే… తెలుగు భాషను హత్య చేసే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి
బాబాయిని హత్య చేయించినట్లుగానే తెలుగు భాషను కూడా హత్య చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని ధర్మవరం సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. మాతృభాషను అవమానించేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని అమిత్ షా పేర్కొనగా , దానికి సాక్షి దినపత్రిక వక్రీకరణ వార్తలను రాసిందని ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియానికి అమిత్ షా వ్యతిరేకం అనే అర్థం వచ్చే రీతి లో సాక్షి కథనాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలని తాను గతంలో పట్టుబట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డికి నాకు విభేదాలు వచ్చాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సి ఎస్ బదిలీతో సజావుగా ఎన్నికలు
రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీతో పాటు, మండుటెండల్లో చల్లటి వార్తగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ వార్తను వింటామని రఘురామ కృష్ణంరాజు అన్నారు. డిజిపి బదిలీ కైతే సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్యానెల్ జాబితాను పంపించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీకి అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదని, కేంద్ర ఎన్నికల సంఘమే ఒకరి పేరును సూచిస్తుందని వారు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా పదవి బాధ్యతలను చేపడుతారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీతో సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆయన, ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండడం కోసమే రెండేళ్లుగా కూటమిలో బిజెపి ఉండాలని నేను కోరుకోవడం జరిగిందన్నారు. కూటమిలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం జరుగుతోందన్న ఆయన, నాకు ఎమ్మెల్యేగా రాసిపెట్టి ఉన్నట్టు ఉందని అందుకే ఎమ్మెల్యే కాబోతున్నానని తెలిపారు. మా శ్రీనివాస్ వర్మ కచ్చితంగా ఎంపీగా విజయం సాధిస్తారన్నారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దోపిడీకి పాల్పడిందో ధర్మవరం సభలో ప్రసంగించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యం సిండికేట్లను నిర్వహించారని, అమరావతిని అటకెక్కించి, పోలవరాన్ని పడుకోబెట్టారని అమిత్ షా విమర్శించారని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE