★జగన్ 2లక్షల55 వేల కోట్లు దోచుకుంటే.. మైలవరం ఎమ్మెల్యే 1000 కోట్లు.. మంత్రి జోగి రమేష్ 500 కోట్లు దోచుకున్నారు
★దోచుకోవటం దాచుకోవడం తప్ప రైతును పట్టించుకునే తీరికలేదు
★ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వదిలి బయటకు రావాలి
★నేషనల్ హైవే పై టెంట్లు, రెడ్ కార్పెట్ వేసుకొని పరామర్శించే ముఖ్యమంత్రి రైతులకు ఏం న్యాయం చేస్తాడు?
★అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులు, కౌలు రైతుల బాధలు ముఖ్యమంత్రికి పట్టడం లేదు
★4ఏళ్లుగా కాలవలు డ్రైన్లు బాగు చేసిన పాపాన పోలేదు రైతుల సొంత ఖర్చులతో బాగు చేయించుకున్నారు
★మైలవరం ఎమ్మెల్యే అసమర్థత వల్లే బుడమేరుకు ఈ దుస్థితి
★తుఫానుకు తీవ్రంగా నష్టపోయి రైతు కష్టంలో ఉంటే మైలవరం ఎమ్మెల్యే అడ్రస్ లేడు
★బుడమేరు లో 40 లక్షలు దోచేసిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఇది మీ అవినీతి కాదా? మీరు సరిగా పనిచేసే ఉంటే రైతుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు
★నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి పైరుకు,ప్రతి ఎకరానికి పరిహారం అందించాలి
★తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం, రాయనపాడు లో బుడమేరు కాలువ బాగు చేయక ముంపునకు గురై దెబ్బతిన్న పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వదులు బయటకు రావాలని దోచుకోవటం దాచుకోవటం పై ఉన్న శ్రద్ధ రైతుల కష్టం పై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో శీలంనేని సాంబశివరావు, పోలసాని సుబ్బారావు, రంగినేని నరేంద్ర, అంగిరేకుల శివన్నారాయణ గంట శివరాం ప్రసాదు, గుత్తికొండ ప్రసాదరావు, తాతినేని వెంకటేశ్వరరావు, కాటంనేని జనార్ధన్, హరిబాబు, చైతన్య, తేలు పాపారావు, వేముల శ్రీను, ముప్పవరపు శ్రీనివాసరావు చప్పిడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.