Suryaa.co.in

Telangana

నన్ను సీఎం..సీఎం అని అనొద్దు

-ఇప్పుడే సీఎం అంటే నన్ను ఎమ్మెల్యేగానే ఓడిస్తారు
-నాకు ఏ పదవీ ముఖ్యం కాదు..నాకు ప్రజలే ముఖ్యం
-మీకోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమే
-వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ
-పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్గొండ: ”నన్ను సీఎం..సీఎం అని అనొద్దు.. మంత్రి పదవినే వదిలివేశాను.. నాకు ఏ పదవీ ముఖ్యం కాదు. నాకు ప్రజలే ముఖ్యం..మీకోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమే. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.” అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు పూజలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా .. సీఎం అనకుంటేనే సీఎం అవుతానని, మీరు సీఎం.. సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యేగనే ఓడిస్తారని అన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

LEAVE A RESPONSE