– మీకు ఆత్మ గౌరవం అంటూ లేదా?
– డబ్బుకి కక్కుర్తి పడి తప్పుడు సర్వే చేయకండి
జగన్ గెలిస్తే గెలవొచ్చు. కానీ ఒక సెఫాలజిష్టికి సామాజిక బాధ్యత లేదా అన్నది నా ప్రశ్న. జగన్ గెలుపు కారణాల్లో మాల, మాదిగలు అంటే దళితులు జగన్ వెంట నిలిచారు అని ఉల్లేఖించాడు.
అవునా? ఇంకా మమ్మల్ని బట్టలు విప్పి కొట్టినా, మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేసినా ఏకంగా చంపి డోర్ డెలివరీ చేసినా మేమంతా జగన్ వెంటే ఉంటామా? శిరోముండనం చేసినా.. జగన్ కాళ్ళు మొక్కుతూ ఉంటామా మస్తాన్ భయ్యా?
భూమి కొనుగోలు పథకం, పండ్ల తోటల పెంపకం, ఆటోలూ, కార్లు, ఇన్నోవాలు ఇవ్వకపోయినా.. మాకు అంతకు ముందు ఇచ్చిన విదేశీ విద్యాపధకం కొండెక్కించినా జీ హుజూర్ అంటూనే ఉంటామా సోదరా?
మాకు ఆత్మ గౌరవం అంటూ లేదా?
మాకు ఇచ్చే ఇరవై ఆరు పధకాలు ఏకంగా రద్దు చేసి, మా ఆడపిల్లల్ని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసినా కిమ్మనకుండా ఉంటమా మస్తాన్ దొరా?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన NSFDC, NSKFDC, NBFDC ఇంకా మీ మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు డైవర్ట్ చేస్తే.. మేం చప్పట్లు కొడుతూ ఓట్లు వేయాలా సర్కార్?దేశం లో ఏ సీయం కూడా దళితుల్ని ఇంత దగా చేయలేదు. మరి జగన్ గారికి ఎలా ఇంత దైర్యం వచ్చింది?
నమ్మి భూములు ఇస్తే, వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అల్లరి చేసి శాంతియుత ఆందోళన చేస్తే మహిళలని కూడా చూడకుండా డొక్కలో పొడుస్తారా యువరానర్? ఎటు పోతున్నాం? బ్రతుకు తెరువు కోసం విలువలు పాతరేస్తే నెక్స్ట్ జెనరేషన్ క్షమిస్తుందా మిత్రమా?
మీరు ఆకాశంలో విహరిస్తున్నారేమో.. మేము రోడ్లలో పోతుంటే నడుములు విరుగుతున్నాయి. గర్భిణీ లు ప్రసవం రోడ్డు మీదే అయ్యే దుస్థితి.
ఏమున్నది గర్వకారణం?
ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలయ్యింది. జగన్ మాత్రం సంపన్నుడు అయ్యాడు. ఎవరి కోసం సీయం పదవి మస్తాన్ గారూ.? జగన్ మాత్రమే సంపన్నుడు ఐతే చాలా?
ప్రతి ఇంటిపై ఐదు లక్షల అప్పు తీర్చేది ఎలా?
11 లక్షల కోట్ల అప్పు తీరేది ఎప్పుడు?
వారం వారం రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చే అప్పు ఎవరు తీరుస్తారు?
అప్పులు తీర్చడం కోసం చెత్త మీద పన్ను వేసినా మీ చెత్త బ్రెయిన్ కి తప్పనిపించలేదా? ప్రతి స్కీం ఒక స్కాం కాదా? ఇవన్నీ దళితులు బలహీన వర్గాలు అర్థం చేసుకోరు అని మీరు అనుకుంటున్నారా?
ఒక కుటుంబ పెద్ద ఆస్తులు పెంచి, కొంత దాచి పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పిస్తారు. ఇక్కడ ఏం జరిగింది? పిల్లలు(ప్రజల ) నోరు కొట్టబడింది. ఇప్పుడు అప్పులో రామ చంద్రా అన్నా ఆ దుఃఖం మీకు కనిపించడం లేదా? ఒక్క పరిశ్రమ పెట్టకపోయినా.. పెట్టిన పరిశ్రమలు తరిమేస్తున్నా మీరు “సమ్మ”గా అనుకూల ఎగ్జిట్ పోల్ ఎలా సమర్పించారు అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇప్పటికైనా సాతాను సారీ మస్తాన్ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు.. జరిగిన ఆర్థిక బీభత్సాన్ని అవలోకించండి. డబ్బుకి కక్కుర్తి పడి తప్పుడు విశ్లేషణ ఇవ్వకండి. డబ్బు ఇవ్వాళ ఉంటుంది రేపు పోతుంది. చెడ్డపేరు వస్తే అది జీవితకాలం కొనసాగుతుంది తస్మాత్ జాగ్రత్త.
మనలో మాట. టీడీపీ టికెట్టు కోసం మీరు ప్రయత్నించారట.. కూటమి లో భాగంగా ఓడిపోతుంది కదా అది. మరి ఎందుకు టికెట్ అడిగినట్టు?
– ఆర్. డి. విల్సన్
బీజేపీ అధికార ప్రతినిధి