మీడియాలో ప్రతి రోజూ కనీసం రెండు చావు వార్తలు
“అక్రమ సంబంధం – హత్య ” అని …
చేయాల్సినవి – చేయకూడనివి !
1. ప్రతి రోజు భర్య భర్త కనీసం గంట సేపు ఆత్మీయంగా మాట్లాడుకోవాలి . బిజీ అనే మాట తప్పు .
మనసుంటే మార్గముంటుంది . ఎమోషనల్ బాండింగ్ కు మించింది లేదు . అదుంటే అన్నీ బలాదూర్ . సమస్యలు విభేదాలు అన్నీ పరిష్కారమయిపోతాయి .
2 . భార్య – భర్తల మధ్య కలుసుండలేని స్థాయిలో విభేదాలుంటే హాయిగా విడి పోండి . కానీ ముందుగా పిల్లల గురించి ఆలోచించండి . పెద్ద మనుషుల / కౌన్సిలర్ ల సాయం తీసుకోండి .
ఎంత మాత్రం పొసగదు అనుకొంటే కొట్లాటలు లేకుండా నవ్వుతూ విడిపోయి హాయిగా జీవించండి .కక్షలు కార్పణ్యాలు వద్దు . అది కార్తిజల్ హార్మోన్ ను స్రవిస్తుంది. ఒళ్ళు నాశనమవుతుంది. ప్రతీకార చర్యల గురించి ఆలోచన వస్తే .. జైలు .. రాత్రంతా కుట్టే దోమలు .. పక్కనే దుర్గంధం వెదజల్లే టాయిలెట్ … కడుపులో తిప్పే వాసన … చిప్ప కూడు గురించి తలచుకోండి .
లోకం పెద్దది . ఒక వ్యక్తి పై కక్ష తీర్చుకోవడం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు .
3 . భర్త : ఆ అవసరం కేవలం మీకే అనుకోవద్దు .ఆమెకు కూడా .
సహజ సిద్ధంగా ఆమెకు ప్రేరణ కు సమయం తీసుకుంటుంది . వచ్చాక ఆమె టెస్ట్ మ్యాచ్ ను ఆశిస్తుంది . వచ్చామా? ఒకటి రెండు ఓవర్లు ఆడి మన అవసరం తీర్చుకొన్నామా? అన్నట్టు ఉండకూడదు . అట కు ముందు ఉపోద్ఘాతం ముఖ్యం . అదొక సృష్టి కార్యం . స్నానం .. మల్లెలు .. ఆగారు బత్తుల వాసన .. కనీస స్థాయిలో ఉండాలి కదా ?
అసలు ఆటకు ముందు.. ముందస్తు ఆట కనీసం అరగంట సాగాలి. ఆమె కూడా ఆటకు మానసికంగా శారీరికం గా సిద్ధం కావాలి . చాలామంది త్వరగా అవుట్ అయ్యే లక్షణాన్ని కలిగివుంటారు . జస్ట్ రిలాక్స్ . ఇది నూటికి తొంబై శాతం మందిలో కేవలం మానసికం .
స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నీక్ ద్వారా దీన్ని సులభంగా నెల రోజుల్లో జయించవచ్చు అవసరమనుకుంటే అనుకొంటే .. మీలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు సిల్డెనాఫిల్ తీసుకోండి .
ఇది వరకే తీవ్ర గుండె సమస్యలుండే వారికి మినహాయించి ఇది సేఫ్ . కేవలం యాభై మిల్లి గ్రాములు . ఒకటి మాత్రమే . అరగంట ముందు . దీని పైనే శాశ్వతంగా ఆధారపడొద్దు .
మనిషి చర్మం కొత్త స్పర్శకు .. కళ్ళు కొత్త ఆకారానికి ఇష్టం చూపుతాయి . ఇది బయాలజీ . అందుకే మానవ సమాజానికి కట్టుబాట్లు నైతిక నియమాలు వచ్చాయి . మనసు ఒక కోతి . కోరికలు గుర్రాలైతే బతుకు గతి తప్పుతుంది. కళ్లెం వెయ్యండి. అగ్నికి ఆజ్యం పొయ్యొద్దు .
నెట్ పై దొరికే చెత్త ఫిలిమ్స్ ను చూసి ఏదో చేసేయాలని హనీ ట్రాప్ లో ఇరుక్కోవద్దు. సెక్స్ టార్షన్ వల్ల ఆస్తులు పోగొట్టుకొన్న వారు ఎందరో . వయసు మీద పడుతున్నా ఏదో చేసేయాలని చివరకు పసి పిల్లల వైపు మళ్ళి దారుణమయిన శిక్షలు అనుభవిస్తున్నవారు ఎందరో . తస్మాత్ జాగ్రత్త .
4 . భార్య : ఒక బక్క పలచ హీరో చేయి ఎత్తితే ఇరవై మంది వస్తాదులు గాల్లోకి లేస్తారు . ఇది సినిమా . ఇక నెట్ పై దొరికే అలాంటి చిత్రాల్లో .. కూడా ఇంతే ..
వాస్తవానికి వంద రెట్లు చూపుతారు . అలాంటి వాటిని చూడొద్దు . చూసినా .. నిజమని నమ్మొద్దు.
అక్కడ గంట రెండు గంటలు సాగుతుంటుంది . దాని షూటింగ్ వారం – పది రోజులు .
మీరు అనుకున్నట్టు ఒకే సారి కాదు. పరిణామానికి సామర్త్యానికి సంభంధం లేదు . బయోలాజికల్ గా ఆఫ్రికా ఖండ మూలాలున్న నల్ల వారి సంగతి వేరు . … యెల్లో స్కిన్ కలిగిన మంగోలాయిడ్ జాతి వారు .. థాయ్ దేశస్తులు .. ఇటు చివరి ధ్రువం .
భారతీయులు మంగోలాయిడ్ వారికి దర్గర్లో . అంటే చివరి నుంచి వచ్చే స్థానాల్లో ఒకటి . కానీ పని తీరుకు పరిణామానికి సంభంధం లేదు . ఒకప్పుడుఅయితే ఇలాంటి వి ఎవరికీ తెలిసేవి కావు . ఇప్పుడు అలాంటి ఫిలిమ్స్ చూసి రకరకాల అపోహలు పెంచుకొంటున్నారు . పొరుగింటి పుల్ల కూర మహా రుచి .. . అందునా మగాళ్లకు . దీనికి తోడు కొత్త స్కిన్ అంటే ఎక్కువ స్పందన .
కొనేళ్లు కాపురం తరువాత వేగం తగ్గొచ్చు . కాస్త గ్యాప్ తీసుకోండి . ఫరవాలేదు . ఇంటిలోని దానిలో కొత్త దనం తెచ్చుకోండి . కొత్త కనెక్షన్స్ ఏర్పర్చుకుంటే జీవితం తలకిందులు . మొన్న జరిగిన ఘటనలో ప్లే స్కూల్ నడిపిన ఒక మహిళ తన కొత్త కొత్త స్నేహితుడు ఆ సమయం లో పట్టుకొనేందుకు ఒక రాడ్ ను ఏర్పాటు చేసిందట . ఇది నూటికి నూరు శాతం .. అలాంటి ఫిలిమ్స్ చూసి చేసిన అనుకరణ .
ఇప్పుడు ఆమె చర్ల పల్లి మహిళా జైల్లో .. మెట్లు ఉడిగి పొయ్యే దాక మగ గాలి కూడా సోకదు .ఈ రోజే ప్రపంచం అంతమయ్యి పోదు . రేపన్నది ఉంటుంది. ఇది పురుషులు కూడా గ్రహించాల్సిన అంశం .
3. ఓటిటి – భారతీయ సంస్కృతి పై అణుబాంబు అని రెండేళ్ల నాడే పోస్ట్ పెట్టాను . ఏ కొంపలో ఎప్పుడో పేలుతుందో … హత్యా వార్తలు చదివి భయకంపితులు అవుతున్న జనం .
4. కొత్త శరీరాన్ని చూస్తే .. సహజంగా ఆకర్షణ ఏర్పడుతుంది . ఇది బయలాజికల్ గా పురుషుడి కైనా స్రీ కైనా సహజం. పురుషాధిక్య సమాజాల్లో మహిళ సాంస్కృతిక నియంత్రణ కు ఎక్కువగా గురయ్యింది . పరాయి పురుషుడిని కలలో కూడా ఊహించుకోవద్దు .. అనే పదేపదే బాల్యం నుంచి చెప్పడం వల్ల మహిళలు నిన్నటి తరం దాక పరాయి పురుషుల్ని ఆ దృక్పధం తో చూడడం అరుదుగా జరిగేది .
{పురుషాధిక్య సమాజంలో పురుషుడికి ఈ అవకాశం దక్కింది . రాజుల కాలం నాడే అంతఃపురం లో నృత్యాలు. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కులం పేరుతొ .. మేళాలు .. హైదరాబాద్ సహా అనేక నగరాల్లో బార్స్ లో నృత్యాలు . స్త్రీని ఎలాంటి ఆచ్చాదనా లేకుండా చూడటానికి మగడు సంపదను వెచ్చించిన రోజులు . ఇప్పుడు నెట్ పై అన్నీ ఫ్రీ గా .. } నెట్ పుణ్యమా అంటూ పురుషుడిని ఆలా చూడాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది .
ఆ రోజుల్లో జ్యోతి లక్ష్మి , జయమాలిని మాలిని హలం అనురాధ సిల్క్ స్మిత .
అప్పట్లో మగ సిల్క్ స్మితలు లేరు. కారణం డిమాండ్ లేదు. ఇప్పుడు ఉత్తుత్తి రోషన్ . రన్ బీర్ సింగ్ .. ఇంకా ఎంతో మంది మగ జయమాలిని లు సిల్క్ స్మితలు .. కొత్త డిమాండ్ మరి .
లింగ సమానత్వం వద్దా ఏంటి ? వద్దంటే ఉతికి ఆరేస్తారు . చీరి చింతకు కడతారు లింగ సమానత్వం పేరుతొ వర్జీనియా స్లీమ్స్ .. ఈవ్ .. కాప్రి .. మోర్ .. పింక్ జిన్ . బ్రో కోడ్ .. కాస్మోపాలిటన్ బకార్డి బ్రిజర్ .. జెండర్ ఈక్వాలిటీ పేరుతొ ఇప్పుడు బిలియన్ డాలర్ ల వ్యాపారం .. ఇదో పెద్ద ప్రపంచం .
పోస్ట్ చదవడం ఇక్కడితో ఆపెయ్యండి . ఇక పై చదివితే భరించలేని కంపు .. మీరు కళ్ళుతిరిగి పడిపొయ్యే ప్రమాదం .
స్కిన్ షో .. ల వెనుక పెద్ద వ్యాపారముంది . అవినీతి సొమ్ము కోట్ల కొద్దీ పోగయ్యింది . ఒక దశ తరువాత …” డబ్బు ఎందుకు ? ఇప్పటికే గోడౌన్ నిండింది . ఆ సుఖాన్ని ఇవ్వండి” అని అడిగే అధికారులు .. నాయకులు ఎక్కువయ్యారు . క్రేజ్ ఎంత ఎంచుకొంటే అంత రేట్ .
నెట్ పై తనది .. తన కూతురిది ఫోటో లు పెట్టి బాగా డిమాండ్ పెంచుకున్న ఒక మహిళ ! ఇది జస్ట్ ఒక ఉదాహరణ .
ఎన్ని బిజినెస్ లు డౌన్ అయ్యినా ఎవర్ గ్రీన్ బిజినెస్ మాత్రం ఎప్పుడూ డౌన్ కాదు. ఫాన్స్ ఓన్లీ అప్ రెండేళ్ల క్రితం ఆదాయం 22, 495 కోట్లు . ఏటా రెట్టింపు అవుతోంది . నెట్ పై ఇలాంటివి ఎన్నో .. మొత్తం ఆదాయం లక్షల కోట్లు .
తెల్లోడు ముందుగా బ్రెయిన్ వాష్ చేస్తాడు . మోడరన్ .. ట్రేండింగ్ .. అని ఇమేజ్ తెస్తాడు . అటు పై బిజినెస్ లో లాభాలు పండించుకొంటాడు .
“నా ఒళ్ళు . నా ఇష్టం” .. ఇది యూరోప్ సమాజం లో చాల పాతపడిన వ్యవహారం .దీన్ని ఎప్పుడో సాగదీసి . …”పెళ్ళైతే ఏమి ? ఇష్టాయిష్టాలు ఉండవా?” అంటూ కంచ దాటడాన్ని నార్మల్ చేసేసారు .
స్కాండినేవియాన్ దేశాల్లో ఇప్పుడు పురుషులో ఒక ట్రెండ్ .వాళ్ళు కోయిలలు . కోయిల తన గుడ్డును కాకి గూడులో పెడుతుంది .
ఇప్పుడు దీన్ని దీన్ని మరింత ముందుకు తోసి .. సాగదీసి… కొత్త వ్యాపారం మొదలెట్టారు .
దంపతులు కంపెనీ కి తమ డిటైల్స్ పంపుతారు. తరువాత ఆడిషన్స్ . సెలెక్ట్ అయితే ఫిలిం . లక్షల రూపాయిలు పారితోషికం. భర్త చెయ్యాల్సింది ఏమీ లేదు . జస్ట్ మొబైల్ పట్టుకొని షూట్ చేస్తుంటాడు .అయన అందమయిన భార్య .. షూట్ లో ..
” ఆమెకు ఇష్టాలుంటాయి . నువ్వు వద్దంటే నిన్ను చంపి వెళ్లి పోతుంది . నువ్వే ఒప్పుకొంటే ఆమెకు హాయి .. నీకు డబ్బు” .. ఇది కాన్సెప్ట్ .
భారతదేశం తో సహా త్వరలో విడుదల !
సరి కొత్త డేటింగ్ అప్పలు .. కావాలనే టైపింగ్ మిస్కెట్లు చేస్తున్నా .. దారిద్య్రాన్ని రాయలేక .. ఆ అప్ లో జంటలు అప్లై చేసుకోవచ్చు . దబ్బున వాడు కొనుక్కుంటాడు . మొగుడికి డబ్బు .. ఆమెకు అది ..నమ్మశక్యం కావడం లేదు కదా ?
వాళ్ళ బిజినెస్ లు మూడు షో లు.. అరవై కోట్ల డాలర్స్ సాగుతుంది . ఈ రొంపి లోకి దిగితే మనము మన కుటుంబాలు నాశనం .
సగం దేహం పురుషుడు .. సగం స్త్రీ ..
ఇదే అర్ధ నారీశ్వర తత్త్వం .
పురుషుడు స్త్రీ కలిస్తేనే సమాజం .. మానవ మనుగడ .
పురుషాధిక్య సమాజం లో మహిళా స్థితి గతులును మెరుగు చెయ్యడం అవసరం .
బిజినెస్ అవసరాలకోసం లింగ సమానత్వం పేరుతో జరిగే నాటకాల పట్ల అప్రమమతంగా ఉండండి .