-మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా?
-అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం?
– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీవీ5 సూటి ప్రశ్నలు
హైదరాబాద్: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బిడ్డకు.. విజయసాయిరెడ్డి తండ్రి అంటూ ఆమె భర్త చేసిన ఆరోపణల వ్యవహారం ముదురుపాకాన పడుతోంది. ఆ ఆరోపణపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందులో తమ చానెల్‌పై ఆరోపణలు చేయడాన్ని టీవీ5 యాజమాన్యం ఖండించింది. ఆ మేరకు విజయసాయికి కొన్ని ప్రశ్నలు సంధించింది.
టీవీ5 సంధించిన ప్రశ్నలు యధాతథంగా..
ఆరోపణలు ఎవరివి? నువ్వు ప్రశ్నించేదెవరిని విజయసాయిరెడ్డి?! మహిళ భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదునే చూపించాం. ఫిర్యాదులో ఆయన పేర్కొన్న అంశాలనే వార్తగా చూపించాం. ఫిర్యాదులో అంశాలనే ప్రస్తావించాం తప్ప మేం చేసిన ఆరోపణలు కాదు కదా?
అసలు నువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్‌కి కదా? మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా? అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం? మీరెవరితో ఎలాంటి సంబంధాలు కలిగున్నారో చర్చించే తీరక టీవీ5కి లేదు.
మీరు ఎలాంటి వారో.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు విజయసాయిరెడ్డి. విశాఖ, నెల్లూరు, ఢిల్లీ.. ఇలా అనేక ప్రాంతాల్లో మీ గురించి అనేక ప్రాంతాల్లో అనేక కథలు వినిపిస్తున్నాయి. వాటి గురించి టీవీ5 ఏం మాట్లాడలేదే?
ఇప్పుడు జరుగుతుంది ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపైనే చర్చ. దానికే మీరు వివరణ ఇవ్వాలి విజయసాయిరెడ్డి. ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మరింత నిజాయితిగా ఉండాలి అదే జనం కోరుకుంటున్నారు. ఆ మహిళతో మీకు ఎలాంటి సంబంధం లేదని.. మదన్ మోహన్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకునే ప్రయత్నాలు చేసుకో. కానీ ఇదంతా మీడియానే చేసిందనే రీతిలో అక్కసు ఎందుకు?
ఆరోపణలు ఎదుర్కొన్న మహిళ వెర్షన్ కూడా టీవీ5 ప్రసారం చేసింది. మీ వివరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేశాం. మేము మీడియాగా మా బాధ్యతను నిర్వహించాం నిర్వహిస్తాం. ఓ వ్యక్తి మీ వ్యక్తిగత జీవితంపై ఆరోపణ చేస్తే.. ఆ రీతితోనే సమాధానం చెప్పాలి.
ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సమాజానికి కూడా సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది. మీకు చేతనైతే ఆ పనిచేయండి అంతేకాని మీడియాపై నిరాధారణ ఆరోపణలు తగవు విజయసాయిరెడ్డి.