-పల్నాడులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
-ఇంటింటికి టిడిపి మేనిఫెస్టో
పల్నాడు : టీడీపీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 31 వార్డు రెడీనగర్ లో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ, జనసేన బీజెపీ ఉమ్మడి వినుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రిని, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రజలందరూ ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌదాగర్ జానీ బాషా, వాసిరెడ్డి హనుమంతరావు, కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, రామారావు , మిలిటరీ వెంకట్రావు, సుబేదారి అజిస్, సోమేపల్లి శీను, మన్నెం వెంకట్, జిమ్ జానీ, రాజోలి బాజీ, తుమాటి కాశి, చికెన్ బాబు, కాలంగి రాజు, అప్పారావు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.