ప్రజలపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

ఏలూరు : దెందులూరులో బీసీలపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అనుచరులతో దాడి చేయించారు. వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం, తిమ్మన్న గూడెం గ్రామంలో “నేను సిద్ధం” కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తన అనుచరులతో కలిసి పర్యటించారు.

అనంతరం గ్రామ కూడలిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బెంచ్‌పై కూర్చుని ఉన్న గ్రామ యువకులు వాహనంలో వెళ్తూ చెయ్యి ఊపిన ఎమ్మెల్యేకు కూర్చునే అభివాదం చేస్తారా, లేచి నిలబడటం తెలియదా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు యువకులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

దాడిలో పిప్పర దుర్గా ప్రసాద్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటనను వీడియో తీస్తున్న కంచర్ల వెంకటేశ్వర యాదవ్‌ అనే యువకుడి ఫోన్‌ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులను తీసుకెళ్ళి స్టేషన్లో పడేయాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పోలీసులను పురమాయించారు. వెంకటేశ్వర యాదవ్‌ అనే గ్రామస్థుడు జరిగిన సంఘటన మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు.

Leave a Reply