సోషల్ మీడియాలో మహిళలపై చిన్నచూపు చూస్తే సహించం

Spread the love

– పవన్ కి 10 రోజులు గడువు
– రాష్ట్ర ఉమేన్స్ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

అమరావతి: సోషల్ మీడియా లో మహిళలపై చిన్నచూపు చూస్తే సహించేది లేదని రాష్ట్ర ఉమేన్స్ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మహిళ అభ్యుదయం కోసం ఏర్పాటు చేసిన ప్రతి శుక్రవారం ఉమేన్స్ డిగ్నిటీ డే ని పురష్కరించుకొని ఇప్పటికే రెండు వారాలుగా కొనసాగుతుంది. మొదటి వారం బ్రోచర్ విడుదల చెయ్యగా, రెండో వారం పింక్ బెలూన్ లు ఎగురవేశారు.

ఈ క్రమంలో శుక్రవారం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం 5వ భవనం లో రాష్ట్ర ఉమేన్స్ కమిషన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సభ్య సమాజం లో మహిళ తన ఆత్మ గౌరవం కాపాడుకోవడం కోసం తీవ్ర కృషి చెయ్యాల్సి వస్తోందన్నారు. సోషల్ మీడియా లో మహిళల్ని కించపరిచే విదంగా పోస్టులు పెడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ ను కమిషన్ ప్రశ్నించిందన్నారు. ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారని పది రోజుల్లో సమాధానం చెప్పాలంటూ హెచ్చరించ్చినట్లు తెలిపారు. మహిళ కమిషన్ అంటే విలువ లేకపోతే మహిళ అంటే విలువ లేదన్నట్లని అన్నారు.

Leave a Reply