Suryaa.co.in

Andhra Pradesh

ఇంటింటికీ వైద్య సేవలు

– వార్డు యూనిట్‌గా వైద్యసేవలు
– అంటువ్యాధులు రాకుండా అప్రమత్తం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
బాధితులకు బీజేపీ ఎమ్మెల్యేల నెల జీతం విరాళం
– బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే 32 డివిజన్లలో 131కు పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. వీటికి అదనంగా డోర్ టు డోర్ డిసీజ్ సర్వేను 450 మంది ఏఎన్ఎం, ఆషా కార్య కర్తలతో, నగర పాలక వైద్య సిబ్బందితోసర్వే నిర్వహించటం జరుగుతుంది.

దోమకాటు కారణంగా మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఒక్కొక్క వార్డు సెక్రటేరియట్ పరిధిలో ముగ్గురు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ లను,శానిటేషన్ వర్కర్లను, వీఎంసి వైద్య సిబ్బందిని సర్వే కి నియమించటం జరిగింది. వరద నీటి ప్రభావం తగ్గిన 28 సెక్రటేరియట్ల పరిధిలో స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి యాంటీ లార్వాల్ ఆపరేషన్ నిర్వహిస్తాం.

చికున్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టేందుకు ముందుచూపుతో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లకి వారం రోజుల పాటు 900 మంది సిబ్బంది కి ఓరియంటేషన్ క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. సెక్రటేరియట్ పరిధిలో నీళ్లు లేనిచోట దోమల వల్ల వచ్చే వ్యాధులను నిర్మూలించి, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ సర్వే 7 రోజులపాటు నిర్వహిస్తాం.

సర్వేకోసం వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సహకారం అందించాలి. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాధుల బారిన పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇళ్లల్లో వరద నీరు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉన్నందున దోమల లార్వా ఇళ్లల్లోనే గోడలు, ఫ్రిజ్ ల వెనక, పూల కుండీలు తదితరాల ఆవాసంగా చేసుకుని ఉండే అవకాశం ఉంది. అక్కడ స్ప్రే చేయాల్సిన అవసరం ఉందని అందుకే వైద్య సిబ్బంది ఇంట్లోకి వస్తారన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సిబ్బందికి సహకరించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… విజయవాడ నగరంలో ప్రకృతి ఇబ్బంది పెట్టిన కారణంగా ప్రజలు వరదల్లో చిక్కుకొని చాలా ఇబ్బంది పడ్డారు.అయినా కూడా అపార అనుభవం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో శ్రమించి వీరిని ఆదుకుంటున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుందన్నారు బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, నెల రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నుంచి మాకొచ్చే విరాళాలను కూడా సీఎం సహాయనిధికి ఒకేసారి అందిస్తామన్నారు.

LEAVE A RESPONSE