Suryaa.co.in

Telangana

కేసీఆర్ …నీ నిరంకుశ, ఆరాచక పాలన ఇక ముందు సాగదు

– బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్

రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఈ బడ్జెట్ సెషన్ మొత్తం మూగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేయడం అన్యాయం.ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన గౌరవ ఎమ్మెల్యేలలను సస్పండ్ చేయడమే కాకుండా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఇంతటి నిరంకుశ నిర్ణయాలను ఎప్పుడూ చూడలేదు.బడ్జెట్లోని ప్రతీ మాటకు మూందు, వెనుక కేంద్రం నింద వేస్తుంటే నిల్చొని నిరసన తెలిపితే సేషన్ అంతా సస్పెండ్ చేస్తారా.

గతంలో ఇదే టీఆర్ఎస్ శాసన సభ్యులు, ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన మంత్రి హరీష్ రావు గవర్నర్ ప్రసంగాన్ని, బడ్జెట్ కాపీలను చించేసి ఛైర్ పైకి విసిరేసిన సందర్భాలున్నాయి. మరి అప్పుడు హరీష్ రావును జీవితకాలం సస్పెండ్ చేయాల్సి ఉండెనా.

కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర సర్కార్ కూడా మా 12 బీజేపీ ఎమ్మెల్యేలపై ఈ విధంగానే రాజ్యంగ విరుద్ధంగా సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీం కోర్టు తప్పుబట్టింది. శాసన సభ్యుల హక్కుల్ని కాలరాయలేరని చెప్పింది.ఈ సందర్భంగా కేసీఆర్ కు నేను హెచ్చరిస్తున్నా… నీ నిరంకుశ, ఆరాచక పాలన ఇక ముందు సాగదు.

LEAVE A RESPONSE