నేత్రదాత..సరోజినీ దేవి కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పెరుగు శివారెడ్డి…
కనులు లేవని
నీవు కలత పడవలదు..
నా కనులు నీవిగా
చేసుకుని చూడు..
ఇలా పాడకపోయినా
కొన్ని లక్షల మందికి
కంటి చూపునిచ్చి
జీవితాల్లో వెలుగు నింపిన
అపరబ్రహ్మ…శివారెడ్డి!
సర్వేంద్రియానాం
నయనం ప్రధానం
అభిమన్యుడిలా అమ్మకడుపున
విన్నాడో ఏమో..
నేత్రవైద్యునిగా
మారేందుకే
ఆ తల్లి కన్నదేమో..
డాక్టరైనప్పటి నుంచి
అదే దీక్ష..
చీకటి నిండిన కనులకు
ఆయన కత్తెరే రక్ష..!
శివారెడ్డి హస్తవాసి..
నైపుణ్యత పోత పోసి..
మానవత కలబోసి..
చెయ్యి పడితే
చూపు వచ్చినట్టే..
అంధుని బ్రతుకున వాసంతమే…
ఆనందం సొంతమే..!
ఒక్క ఆపరేషన్
ఎంతో పరేషాన్..
ఆ డాక్టరుకి ఆపరేషనే
నిత్యకృత్యం..
అలసిపోని చెయ్యి..
అది తాకితే
వెలుగు దూరమైన నయనం
తళుకుబెళుకుల నందనం..!
రెండున్నర లక్షల
శస్త్ర చికిత్సలు..
నేత్రవైద్యుడే కాదు ప్రపంచంలో
ఏ వైద్యుడూ
సాధించని అద్భుతం..
అలాంటి వైద్యం..
శివారెడ్డి చీకటి జగతికి
సమర్పించిన
వెలుగుల నైవేద్యం..!
రాష్ట్రపతి కానీ
నిరుపేదే అవనీ..
నీ కన్నుకి ఆయన దన్ను..
ఇవ్వగలిగినోడికి ఫీజు..
లేనోడికి ఉచితమే ఆయన నేర్చిన సముచితం..
తూ తూ మంత్రం కాదది
అభినవ సుసృతుని
వేదమంత్రం..వైద్యతంత్రం!
అమెరికా రమ్మన్నా
నాకు సరిపడదన్న దేశభక్తి..
సంపన్నులు కాదు
ఆపన్నులే నా ప్రాధాన్యతన్న
నిబద్ధత..
Retirement is mandatory…
continuation of service is humandatory
పదవీ విరమణ
తర్వాత కూడా
ఆగని క్రతువు..
తుది శ్వాస వరకు
ఎక్కుపెట్టే ఉంది
ఆ మహనీయుని ధనువు..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286