Suryaa.co.in

Telangana

ఇన్ని దారుణాలు జరుగుతుంటే కేసీఆర్ నోటీకి తాళం వేసుకున్నారా ?

-జూబ్లీహిల్స్ రేప్ కేసుని నీరుగార్చే కుట్ర జరుగుతుంది
-ఏఐసీసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ మండిపాటు

బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించడం కేసు నీరుగార్చి నిందితులని కాపాడే ప్రయత్నం.దిశా ఘటనలో రాత్రికిరాత్రి నింధితులని పట్టుకొని ఎన్ కౌంటర్ చేసి కాల్చి చంపేశారు. కానీ జూబిహిల్స్ ఘటన వెలుగు చూడటానికి ఏడు రోజులు ఎందుకు పట్టింది ? పేదలు నిందితులలైతే వారి పట్ల ఒక న్యాయం, బడా బాబులకు, రాజకీయ నాయకుల పిల్లలకు ఒక న్యాయమా ?

ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకే లేడని ఎలా చెప్తున్నారు ? మీరేమైనా ఫారన్సిక్ పరిక్షలు చేశారా ? ఎందుకు కేసుని పక్క దారి పట్టించాలని చూస్తున్నారు. పోలీసులపైన రాజకీయ వత్తిళ్ళు బలంగా వున్నాను. అందుకే కనీసం నిమ్డుతుల పేర్లు కూడా కనీసం బయటపెట్టడం లేదు.

ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఈ కేసులో బాదితురాలి తరుపున వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ నియమించాలి.డ్రగ్, పబ్ కల్చర్, జరుగుతన్న అత్యాచారల నివారణ కోసం స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మహిళలు భద్రత కల్పించే అంశం చర్చించి తగిన చర్యలు చేపట్టాలి.కేసు పూర్తయ్యే వరకు బాధితురాలికి అన్ని రకాల భద్రత మరియు భరోసా కల్పించాలి.

‘జూబ్లీహిల్స్ రేప్ కేసులో హైదరాబద్ కమీషినర్ సీవీ ఆనంద్ మాట్లాడిన మాటలు నిందితులను కాపాడే విధంగా వున్నాయి. బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించడం కేసు నీరుగార్చి నిందితులని కాపాడే ప్రయత్నం. అలాగే కొంతమంది రాజకీయకుల వత్తిడి వున్నట్లు కూడా కనిపిస్తుంది” అని వ్యాఖ్యానించారు ఏఐసీసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాసోజు.

దిగజారిన పోలీసు వ్యవస్థకు, లా అండ్ ఆర్డర్ కి ఈ కేసు ఒక ప్రతీక. 31న బాదితురాలు తండ్రి ఫిర్యాదు చేస్తే నిందుతులు ఎవరో గుర్తించడానికి 7రోజులు పట్టింది. దిశా ఘటనలో రాత్రికిరాత్రి నిన్డుతులని పట్టుకొని ఎన్ కౌంటర్ చేసి కాల్చి చంపేశారు. కానీ ఇక్కడ ఏడు రోజులు ఎందుకు పట్టింది ? పేదలు నిందితులలైతే వారి పట్ల ఒక న్యాయం, బడా బాబులకు, రాజకీయ నాయకుల పిల్లలకు ఒక న్యాయమా ? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా వీడియో వైరల్ కాకుంటే అసలు ఈ కేసు లేకుండా చేసేవాళ్ళు” అని వ్యాఖనించారు.

అసలు ఎమ్మెల్యే కొడుకే లేడని జోయల్ డేవిడ్ చెప్పారు. నిన్న సీవీ ఆనంద్ ఎమ్మెల్యే కొడుకు కారు దిగి వెళ్లిపోయారని చేఫ్తున్నారు. అసలు ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకే లేడని ఎలా చెప్తున్నారు ? కార్ దిగేలోపే రేప్ చేసి ఉండొచ్చు కదా?
అసలు రేప్ చేయలేదనడానికి ఆ అబ్బాయి సెమెన్ సేకరించి మీరేమైనా ఫారన్సిక్ పరిక్షలు చేశారా ? ఎందుకు కేసుని పక్క దారి పట్టించాలని చూస్తున్నారు . ఎంఐఎం, టీఆరెస్ నేతలకు ఎందుకు భయపడుతున్నారు” అని ప్రశ్నించారు.

అసలు కారు ఎవరిదో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు ? దిశా ఘటనలో నిందితుల జన్మకుండలితో సహా బయటపెట్టారు. కానీ ఈ కేసులో నిందితుల పేర్లు కూడా బయటికి రానివ్వడం లేదు. పేదలకు ఓకే న్యాయం, బడా బాబులకు, రాజకీయ నాయకులకు ఒక న్యాయమని స్పష్టంగా అర్ధమౌతుంది.

నిందుతులు డ్రగ్స్ తాగలేదని పోలీసులు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏ ఆధారాలతో వాళ్ళు మందు తాగలేదని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 15రోజులుగా విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 27న 16 ఏళ్ల పాపపై బర్త్ డే పార్టీ పేరుతో రేప్ జరిగింది. మే 27న జూబ్లిహిల్స్ ఘటన, మే 30న బాలిక పై ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారు.. ఇలా ఇంతపెద్ద ఎత్తున అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లడటం లేదు. నోటికి తాళం వేసుకున్నారా ? పురపాలక మంత్రి కేటీఆర్ కి భాద్యత లేదా ? ఎంఐఎం పార్టీ వాళ్ళు కొడతారని భయపడుతున్నారా ? ఇదు పూర్తిగా భాద్యతరాహిత్యం” అని విమర్శించారు దాసోజు.

ఇలాంటి ఘటన ఇతర రాష్ట్రాల్లో జరిగినపుడు ఆ ప్రభుత్వం తీవ్రంగా స్పదించాయి. గతంలో నెల్లూరులో ఒక విదేశీ మహిళాకి ఘటన జరిగినపుదు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. 57 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు పూర్తి చేశారు. కానీ తెలంగాణలో కనీసం స్పదించకపోవడం దుర్మార్గం. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఈ కేసులో బాదితురాలి తరుపున వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ నియమించాలి.” అని డిమాండ్ చేశారు

”పోలీసులపైన రాజకీయ వత్తిళ్ళు బలంగా వున్నాను. అందుకే కనీసం నిమ్డుతుల పేర్లు కూడా కనీసం బయటపెట్టడం లేదు. పోలీసు అధికారులని బానిసలుగా మార్చేసిన నేపధ్యంలో పోలీసులు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నేరస్తులకు ఫ్రండ్లీగా మారోద్దు. డ్రగ్, పబ్ కల్చర్, జరుగుతన్న అత్యాచారల నివారణ కోసం స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మహిళలు భద్రత కల్పించే అంశం చర్చించి తగిన చర్యలు చేపట్టాలి” అని కోరారు దాసోజు.

LEAVE A RESPONSE