యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు:విజయశాంతి

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్, … రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి… నేడు రైతుల పట్ల రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్ర విధానాలను అనాలోచితంగా తప్పుబడుతూ, అనవసరంగా ధర్నాలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది.
పారాబాయిల్డ్ రైస్ విషయంలో తప్ప… రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్‌సిఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర సర్కార్… యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటూనే… వానాకాలం వడ్లు కల్లాలలో పోసి నెలదాటినా కొనకుండా… వర్షాలకు తడిసి పాడవుతున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకుండా… యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు మొదలెడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన, బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటు.
రైతు సమస్యలు ఎలాగూ పట్టని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌… కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిల్వలుండి… అరోగ్యం విషయంలో సైతం భిన్నాభిప్రాయాలున్న పారాబాయిల్డ్ లేదా స్టీమ్ రైస్‌ను అడ్డుకోకుండా… హుజూరాబాద్‌లో ఓటమి నైరాశ్యంతో, అనవసరంగా కేంద్రాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రైతాంగాన్ని ఇబ్బందుల పాలుచేస్తూ… దళారులతో సిండికేట్‌గా మారి అఫీషియల్‌గా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు… రాబోయే ఎన్నికల్లో యావత్ తెలంగాణ రైతాంగం బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.