– విజయవాడ నగరాభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం
– అమృత్ పథకంలోని పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలిచ్చాం
– ఐలా పరిధిలో ఉన్న ఇళ్లకు వెంటనే తాగునీరు అందించాలని ఆదేశాలు
– మీడియాతో మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడలో కొన్నిచోట్ల తాగునీటి సమస్య ఉందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష చేసారు..వీఎంసీ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు,చేపట్టాల్సిన అభివృద్ది పనులుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.
విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు,వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర,కార్పొరేషన్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు… నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సరిగా అందడం లేదని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమస్య పరిష్కారానికి కొన్నిచోట్ల మంచినీటి ట్యాంకులు నిర్మించాలని అధికారులు తెలిపారు.వెంటనే ఆయా ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులను వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని ఆదేశించారు..గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అమృత్ పథకం నిధులు విడుదల కాలేదని, ఆ నిధులు గనుక వచ్చి ఉంటే విజయవాడ నగరంలో తాగునీటికి కొరత ఉండేది కాదన్నారు.
కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రి…అమృత్ 1.0 పథకంలో చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నవి….వాటి పూర్తికి ఎంతమేర నిధులు అవసరం అవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు…ఇంటింటికీ నీటి కుళాయి కనెక్షన్ల వివరాలు,పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికీ రక్షిత నీటి సరఫరాకు అవసరమయ్యే నిధుల వివరాల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు.
ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో గురునానక్ నగర్ లో ఉన్న సుమారు 400 ఇళ్లకు తాగునీటి సరపరా ఇవ్వడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు…అయితే ఐలాతో ఉన్న సాంకేతిక పరమైన కారణాలతో కార్పొరేషన్ నుంచి మంచినీటి పైప్ లైన్ ఇవ్వలేదనే విషయాన్ని కమిషనర్ ధ్యానచంద్ర మంత్రికి తెలిపారు.
ఆయా ఇళ్లకు వెంటనే మంచినీరు అందించేందుకు అవసరమైన పైప్ లైన్ లు నిర్మించాలని మంత్రి వెంటనే అధికారులను ఆదేశించారు..అయితే సాంకేతిక పరమైన అవరోధాలు తొలగేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు..ఇక బుడమేరు వరదతో పాడైన రోడ్లను కూడా త్వరితగతిన నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు.
వరద కాల్వల నిర్వహణ,సివరేజ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణంపైనా చర్చించారు..డ్రెయిన్స్ లో ఉన్న పూడిక తీత పనులు కొనసాగుతున్నాయని…త్వరితగతిన సిల్ట్ తొలగింపు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. వాంబే కాలనీలో ఉన్న కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే అంశాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
అసైన్డ్ భూముల్లో ఉన్న వాటికి ఇళ్ల పట్టాలిచ్చే అంశంపై వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో మంత్రి మాట్లాడారు..సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు..విజయవాడ సమగ్ర అభివృద్దికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని…త్వరలోనే దానికి సంబంధించి అవసరమైన నిధుల గురించి సీఎంగారితో చర్చించి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.