Suryaa.co.in

Andhra Pradesh

వ్యతిరేక ఓటు నిరోధించడానికే డీఎస్సీ పరీక్షలు

– ఎన్నికలలో జరిగే అవకతవకలపై అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లా ల నుండి వైసీపీ, తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే జీ సమక్షంలో బిజెపి లో చేరారు. వారిని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ . నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి పలువురు పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంసకర పాలన చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే.. ఎన్నికల్లో అడుగుపెట్టినట్లే. ఎన్నికలలో జరిగే అవకతవకలపై అప్రమత్తంగా ఉండాలి.

దొంగ ఓట్లు వేయించుకోవడానికి సమాయుత్తము అయ్యే .. వై నాట్ 175 అంటున్నారు. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ పై దృష్టి సారించాలని ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాస్తాం. డీఎస్సీ పరీక్షలు రాసే 10లక్షల మంది ఎన్నికల్లో ఓటు వేయకుండా, మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ పరీక్షలు. వ్యతిరేక ఓటు నిరోధించడానికే డీఎస్సీ పరీక్షలు. ఎన్నికల పోరు శంఖారావం నరేంద్ర మోదీ చేయనున్నారు.

పార్టీ లో చేరే వారిని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆహ్వానించారు. బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రాం కుమార్, శ్రీ కాకుళం జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వర రావు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE