భయాందోళనలో ప్రజలు! ఏపీఎండిసి యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం!
సిఐటియునేతల విమర్శ!
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం, మంగంపేట ఏపీఎండిసి మైనింగ్ తవ్వకాల వలన, ఆర్ఆర్ టు అగ్రహారం, ఇల్లు నేరులు చీలడం, హెవీ బ్లాస్టింగ్ వల్ల రాళ్లు పడడం, వలన భయభ్రాంతులకు గురవుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు దాసరి జయచంద్ర, సిఐటియు మండల కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షులు పులగంటి శ్రీనివాసులు, సంఘటన ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అగ్రహారానికి అడగడగనా న్యాయానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల ఇల్లు కూలిపోయి పులగంటి ఈశ్వరనే బాలుడు నవంబర్ 17న చనిపోయిన విషయం గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఏపీఎండిసి యాజమాన్యం రెవెన్యూ అధికారులు, రెండు నెలలు లో గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని గ్రామ పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ మూడు నెలలు జరిగిన కనీసం ఆ ప్రస్తావనే లేదన్నారు. గత నాలుగు రోజుల క్రితం ప్రాథమిక పాఠశాల, పెచ్చులు విద్యార్థులు ఆడుకుంటున్న సందర్భంలోవిరిగి కింద పడి ప్రమాదం తప్పిందన్నారు. పునరావాస బాధ్యతలకు ఉద్యోగాలు లేవంటూనే, రాజకీయ రికమండేషన్ తో ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. అగ్రహారానికి ఇంటి స్థలం గాని, షిఫ్టింగ్ చార్జీలు గాని, వన్ టైం సెటిల్మెంట్ గాని చేయలేదన్నారు. 1000 కోట్ల ఆదాయం తెచ్చిన ఏపీఎండిసి యాజమాన్యం, డేంజర్ జోన్స్ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కారం చేయడం లేదన్నారు. కాలయాపన చేస్తున్నారని, మోసం చేస్తున్నారని విమర్శించారు.
2013 పునరావాస ఆక్ట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం ఇచ్చి ఉపాధైనా చూపండి, లేదా వన్ టైం సెటిల్మెంట్ కింద 20 లక్షల పరిహారం చెల్లించి, స్థలం ఇచ్చి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన ఏపీఎండి యాజమాన్యం రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. వారికి న్యాయం జరగకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పులగంటి చలపతి, పులగంటి జయకృష్ణ, డేరంగుల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.