Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి నాలగేళ్ల పాలనలో పేదలను నిరుపేదలుగా మార్చారు

– పేదలను ధనికుల్ని చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం
– టీడీపీ మిని మ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో మార్పులు ఖాయం
– ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ నేతలు

వైసీపీ నాలుగేళ్ల పాలనలో పేదలు నిరు పేదలుగా మారిపోయారని టీడీపీ నేతలన్నారు. పేదలను ధనికుల్ని చేయాలన్నదే చంద్రబాబు నాయడు లక్ష్యమని, టీడీపీ మినిమ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో మార్పులు ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రజా చైతన్య బస్సు యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. బుధవారం నాడు టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జోన్ -1 పరిధిలో
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉదయం. 10:30 గంటలకు ములగాడ ఆంజనేయ స్వామి గుడిలో టీడీపీ నేతలు పూజలు నిర్వహించి చైతన్యయాత్రను ప్రారంభించారు. అనంతంర గాజువాక డిపో దగ్గర డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి డిపో ఎదురుగా మూసేసిన అన్నా క్యాంటీన్ వద్ద సెల్ఫీ దిగారు. మరిడిమాంబ మండపం వద్ద గల వరద నీరు గడ్డ HPCL 40 కోట్ల నిధులతో ఆధునీకరణ చేసిన డ్రేన్ ను సందర్శించారు.

తర్వాత టీడీపీ హయాంలో రూ. 18 కోట్లతో హిందుస్థాన్ షిప్యాడ్ నుంచి జింక్ వరకు రోడ్డు విస్తరణ , డబుల్ రోడ్డు, డివైడర్ మధ్యలో సుందరీకరణ చేసిన ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకొన్నారు. అనంతరం మల్కాపురం మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి నుంచి మెయిన్ రోడ్డు మల్కాపురం జంక్షన్ (SBI) వరకు భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రాలు పంచి ప్రచార కార్యక్రమం చేపట్టారు. మద్యాహ్నం శ్రీహరిపురం మెయిన్ రోడ్ మార్కెట్ సాయిబాబా గుడి పక్కన శ్రీహరిపురం లో సుమారు బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సమావేశంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పిజివిఆర్ గణబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్ ఏ డి ప్లై ఓవర్ రామూర్తి పంతులు పేట అండర్ పాస్ నిర్మించాం. రెండుఎమ్మర్వో ఆఫీసులు సాధించాం. వైసీపీ పాలనలో మార్కెట్లో రేట్లు మండి పోతున్నాయి. టమోటా, అల్లం, పచ్చి మిర్చి కొనలేని స్థితి వచ్చింది. మహిళల కోసం మహిళా శక్తి, అమ్మకు వందనం పధకాలు రూపొందించామని అన్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విశాఖ లో మూడు సార్లు ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. టీడీపీ హయాంలో పేదలందరికీ సంక్షేమ పధకాలు అమలు అందించాం. హుద్ హుద్ సమయంలో చంద్రబాబు నయుడు విశాఖనే ఉండి ఆదుకున్నారు. ఆదాయం తాడేపల్లి సీఎం ఇంటికి చేరితే అప్పులు మాత్రం ప్రజల ఇంటికి వస్తున్నాయి. ఏడాదికి మద్యం ద్వారా ప్రతి వ్యక్తి నుంచి రూ. 36,000 వేలు గుంజుకుంటున్నారు.

తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ
వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైయ్యింది, యువతకు ఉద్యోగాలు లేక డ్రగ్ గంజాయి కి బానిసలయ్యారు. గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, మహిళల బాదలు గమనించే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి మూడు సిలెండర్స్ ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ
జగన్ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు చేశారు. నాలుగేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దువ్వావరపు రామారావు,శ్రీ వేపాడ చిరంజీవి రావు,దక్షిణ నియోజవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి, పీలాగోవింద సత్యనారాయణ,కోళ్ల లలిత కుమారి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు,రాష్ట్ర కమిటీ దూళి రంగనాయకులు, బోండా జగన్ ,పుచ్చు విజయ్ కుమార్,కార్పొరేటర్ గల్లా చిన్న, బమ్మిడి రమణ, దాడి రమేష్, పల్లా శ్రీనివాసరావు,శరగండం రాజశేఖర్,రాజమండ్రి నారాయణ, తోటరత్నం, ఉరుకూటి ఉండేవిడ్, నక్క లక్ష్మణ్ రావు,సర్వసిద్ధి అనంతలక్ష్మి, సిహెచ్ రామ్మోహన్, శ్రీనివాసరావు, ఈతలపాక సుజాత , కుట్టా కార్తిక్, తదితరులు పాల్గొన్నారు

జోన్ -2 పరిధిలో :
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాయుడుపాకల గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక వినాయక, ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్రను ప్రారంభించారు. కొంతమూరులో టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి కాతేరు వెంకటాద్రి ఫంక్షన్ హాల్ వరకూ బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ
సంక్షేమ పథకాలకు దేశంలో శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. నాడు ఎన్టీఆర్ తిండి, బట్ట, ఇల్లు ప్రతి పేదవాడి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఆ తరువాత చంద్రబాబు ప్రతి పేదవాడూ ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో మరిన్ని సంక్షేమ పథకాలు సృష్టించారని తెలిపారు.

టిడిపి హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ పాలనలో రద్దు చేశారని విమర్శించారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు టిడిపి మినీ మేనిఫెస్టో రాగానే ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా టిడిపికి ఉందన్నారు.

జగన్ దోచుకున్న అక్రమ ఆస్తులను వెనక్కు తెచ్చి, ప్రభుత్వ నిధుల దుబారాను అరికట్టి, సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తామని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినీ మేనిఫెస్టోలో హామీలిచ్చామని చెప్పారు. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని యనమల ప్రకటించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, తిరిగి రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబును సిఎం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ టిడిపి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి, మరికొన్ని పథకాలను రద్దు చేసి సంక్షేమానికి నవరంధ్రాలు పెట్టారని ఆయన మండిపడ్డారు. టిడిపి పాలనలో సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన నిధుల గురించి ఆయన సుధీర్ఘంగా వివరించారు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సంక్షోభంలో పడినా ఒక పక్క అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మళ్ళీ చంద్రబాబును చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

రూరల్ నియోజకవర్గంలో 5800 ఇళ్ళు కట్టించామని, వాటిని సకాలంలో లబ్దిదారులకు అందించకుండా వైసీపీ వేధిస్తోందన్నారు. జగనన్న కాలనీలు అంటూ ముంపు ప్రాంతాలలో పట్టాలిచ్చారని విమర్శించారు. విద్యుత్ బిల్లులు సాకుగా చూపి సంక్షేమ లబ్దిదారులలో వైసీపీ ప్రభుత్వం కోత విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ
జగన్ రెడ్డి అరాచక పాలనపై నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలిస్తోందన్నారు. ప్రజల్లో చైతన్యం మొదలైందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ ప్రచారం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు, ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలను మించి మన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ నాలుగేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందని విమర్శించారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టిడిపి అన్నారు. రాష్ట్రంలో ఐదుగురు దళిత మంత్రులు ఉన్నారని, వారిలో ఒకరి పేరైనా మీకు తెలుసా అని ప్రశ్నించారు. మంత్రి తానేటి వనిత నల్లజర్ల నియోజకవర్గంలో ఒక పాఠశాల విషయంలో 3.5 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని ఆరోపించారు.వైసీపీ అక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులని చేయాలని ఆయన కోరారు.

రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, నిరుద్యోగం ప్రబలిపోతోందని విమర్శించారు. జగన్ పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు నవరంధ్రాలు పొడిచిందని విమర్శించారు. జగన్ మాదిరి అప్పులు తెచ్చి దోచుకోవడం కాదని, సంపద సృష్టించి చంద్రబాబు సంక్షేమం పంచుతారని చెప్పారు. మినీ మేనిఫెస్టోలోని హామీల గురించి ఆయన వివరించారు.
ఈ సభలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు,మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, డొక్కా నాథ్ బాబు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శులు వెలుగుబంటి ప్రసాద్, మీసాలరాజు, కాశి నవీన్ కుమార్, జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు కందుల రాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, రాష్ట్ర టిడిపి బిసి సెల్ ప్రధానకార్యదర్శి చెల్లుబోయినశ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ, నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కొయ్యల కుమారి తదితరులు పాల్గొన్నారు.

జోన్ 3 పరిధిలో:
గురజాల నియోజకవర్గ ఇన్ చార్జ్ యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ళ మండలం జూలకల్లు గ్రామంలో ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించాంరు. అనంతరం గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన వివిధ అభివృద్ధి పనులు, పిడుగురాళ్ల రూరల్ బ్రహ్మనపల్లి గ్రామం వద్ద నిర్మించిన అండర్ పాస్ ను, పిడుగురాళ్ల పట్టణం లోని పోలీస్ స్టేషన్ ను, 60 శాతం నిర్మించిన పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు ను, టిడ్కో గృహాలను టీడీపీ నేతలు సందర్శించారు.

సాయంత్రం 4 గంటలకు పిడుగురాళ్ల పట్టణం లోని వల్లెల గార్డెన్స్ లో కార్యకర్తలు, మేధావులు, తటస్థులు, ప్రజా సంఘాలతో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇదేం కర్మ మన గురజాలకి అంటూ ప్రదర్శించిన లఘు చిత్రం చర్చా వేదికకు హాజరైన అందరినీ ఆలోచింపజేసింది. పల్నాడు ప్రాంతంలో వైకాపా అరాచకాలు, హత్యా రాజకీయాల పై మేధావులు, తటస్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు పిడుగురాళ్ల పట్టణం లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, అనంతరం భారీ ర్యాలీ తో బ్రాహ్మణ పల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన రచ్చ బండ కార్యక్రమ సభాస్తలికి చేరుకున్నారు.

రచ్చబండ కార్యక్రమం సందర్భంగా తెదేపా నేతలు వైసిపి నాయకులు అధికార అండతో పల్నాడు లో చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేశారు, అదేవిధంగా మినీ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సభ సందర్భంగా పల్నాడు ప్రాంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పి, భరోసాను కల్పించారు.

కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీ నారాయణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఇంచార్జి లు జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, మొహమ్మద్ నజీర్, రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యరావు, గుంటుపల్లి నాగేశ్వరరావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, నల్లపాటి రాము, కనుమూరి బాజీ, షేక్ ఫిరోజ్, తురక వీర స్వామి , నాతాని ఉమా మహేశ్వరరావు, దాసరి రాజా మాష్టర్, చిట్టాబత్తిన చిట్టి బాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, బోంతు శివసాంబి రెడ్డి, కుర్రి శివారెడ్డి, కర్నాటి వరలక్ష్మి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటిరెడ్డి, టి.ఎన్.ఎస్ ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలి, బిసి సెల్ అధ్యక్షులు మున్నా రాంబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాతులూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జోన్ – 4 పరిధిలో:
నెల్లూరు పార్లమెంట్ కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం నుంచి యాత్ర ప్రారంభించారు. అనంతరం రాజుపాలెం లోని ఏఎంసి గోడౌన్స్ ను సందర్శించి అక్కడ సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా సెల్ఫీలు తీసుకున్నారు. రామతీర్థం గ్రామంలోని పైడేరు వంతెనను తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చేశామని అక్కడ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అనంతరం ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం గ్రామం నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోవూరు ఇంచార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు పనబాక లక్ష్మి, కొవ్వూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంచల బాబు యాదవ్, రాష్ట్ర సాంసృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, ఎమ్మెల్సీ దొరబాబు, నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి ప్రసాద్, పార్లమెంట్ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి భూలోకం విజయకుమార్, మాజీ ఎంపీపీ ఏకశిరి వెంకటరమణమ్మ తరితరులు పాల్గొన్నారు.

జోన్ -5 పరిధిలో:
అనంతపురం పార్లమెంట్ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జీ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటలకు కాశీపురం క్రాస్ వద్ద యాత్ర ప్రారంభమైంది. కదరంపల్లి మీదుగా ఆవులదట్ల వద్ద ప్రజలు, మహిళలు స్వాగతం పలికారు. అక్కడ తెదేపా హయాంలో వేసిన రోడ్డును చూపిస్తూ నాయకులందరు సెల్ఫీ ఛాలెంజ్ చేసారు. ర్యాలీ కోర్ట్ కాంప్లెక్స్, R & B ఆఫీసు, బస్టాండ్ దాటిన తరువాత వినాయక సర్కిల్ వద్ద ర్యాలీ నాయకులతో పెద్దఎత్తున సాగింది. ఇక్కడ 2500-3000 మంది వరకు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బికె పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆలూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తదితరులు ప్రసంగించారు.అనంతరం ర్యాలీ బళ్లారి క్రాస్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నాయకులూ సమర్పించారు. సాయంత్రం 5:30 గంటలకు బస్సు యాత్ర కణేకల్ క్రాస్ వద్దకు చేరుకుంది, ఇక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు, నాయకులు పార్టీ పథకాల గురించి ప్రసంగించారు.

సాయంత్రం 7:15 నిమిషాలకు బస్సు యాత్ర కణేకల్ మండల కేంద్రం చేరుకుంది, పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు గారితోపాటు బికె పార్థసారథి, పార్లమెంటు అధ్యక్షులు, హిందూపురం, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బిటి నాయుడు, కళ్యాణదుర్గం ఇన్ చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, ఉన్నం హనుమంతారాయ చౌదరి, గుండుమల తిప్పేస్వామి, కోట్ల సుజాతమ్మ, మీనాక్షీ నాయుడు, ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, కరణం రామమోహన్, బి. బుగ్గయ్య చౌదరి, జి. వెంకటశివుడు యాదవ్, తలారి ఆదినారాయణ, జెఎల్ మురళీధర్, డాక్టర్ శ్రీనివాసమూర్తి, కమతం కాటమయ్య, రాష్ట్ర కార్యదర్శి గాండ్ల విశాలాక్షి, జె. గౌస్ మోద్దీన్, స్వరూప, జి. అదెన్న, రాయదుర్గం నియోజకవర్గం నుండి అన్ని మండలాల పార్టీ నాయకులు గ్రామ / పట్టణ నాయకులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE