-పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం
– అన్నదాతను కష్టాల నుంచి గట్టెక్కిస్తాం.
– యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన కుమ్మరిపల్లి వాసులు
• మా గ్రామంలో కరెంటు సక్రమంగా ఉండటం లేదు.
• అరకొర విద్యుత్ సరఫరా కారణంగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయాం.
• గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన నీరు,చెట్టు బిల్లులు ఇంతవరకు పడలేదు.
• ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో వ్యవసాయంలో అప్పుల పాలవుతున్నాం.
• మా ప్రాంతంలో టమోటాలు అధికంగా పండిస్తున్నాం. నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజి సౌకర్యం కల్పించాలి.
• వ్యవసాయం గిట్టుబాటుగాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
• ఉద్యానవనపంటలను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ ఏమన్నారంటే.. …
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పంట తప్ప ఏ ఒక్కటీ లాభసాటిగా లేదు.
• ఎన్నికల సమయంలో గిట్టుబాటు ధరలు, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పిన సిఎం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతలను గాలికొదిలేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతను కష్టాల నుంచి గట్టెక్కిస్తాం.
• టమోటారైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మదనపల్లిలో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుచేస్తాం.
• పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.