Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో భారతీరెడ్డి, వాసిరెడ్డి పద్మ తప్ప.. జగన్ తల్లి, చెల్లి కూడా సంతోషంగా లేరు

-రాష్ట్రంలో వైఎస్ భారతీరెడ్డి ఒక్కరే మహిళా?
– భారతమ్మ, విజయమ్మ అని పిలిచేవాళ్లు కూడా తమ కుటుంబ సభ్యుల శీలాన్ని నిందించుకుంటారా?
– తోటి మహిళలు….జగన్ రెడ్డి భార్య, తల్లి లాంటి వారు కాదా ?
– టీడీపీ ఆధ్వర్యంలో మహిళా ఆత్మగౌరవ దీక్ష

విజయవాడ ధర్నాచౌక్ లో టీడీపీ ఆధ్వర్యంలో మహిళా ఆత్మగౌరవ దీక్ష జరిగింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీల మహిళా నేతలు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకపోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మణిపూర్ ఘటనకు మించిన పరిస్థితులు కొలకొన్నాయని, జగన్ రెడ్డి అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని నేతలు అన్నారు.

వంగలపూడి అనిత మాట్లాడుతూ…
నాలుగేళ్ల కాలంలో అక్కచెల్లెమ్మలు, రైతులు నుండి రాజకీయ నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి అందర్నీ వేధించాడు. జగన్ పాలనలో సంతోషంగా కనిపించిన మహిళలు చాల తక్కువ. జగన్ పాలనలో వైసీపీ మహిళా మంత్రులు, భారతీరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తప్ప జగన్ తల్లి, చెల్లి కూడా సంతోషంగా లేరు. అమరావతి మహిళా రైతులు న్యాయపోరాటం చేస్తే పోలీసులతో దాడి చేయించిన వ్యక్తి జగన్.

రాష్ట్ర మహిళలంతా వైసీపీ నేతల అవమానాలతో కృంగిపోతున్నారు.మహిళల రైతులు, అలంకారం, నగలపై కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.వైసీపీ పాలనలో ప్రశ్నిస్తే కేసులు, బూతులు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు.జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న జీతం ఒక్క రూపాయి….కానీ ఇతని భార్య చీర ధర రూ.40వేలు. కానీ సామాన్యుల భార్యలు రూ.2వేలు విలువచేసే చీర కట్టుకుంటే విమర్శలు ఎందుకు చేస్తున్నారు?

మణిపూర్ రాష్ట్రంలో మహిళను అత్యంత ఘోరంగా అవమానిస్తే సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. ఏపీలో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. మణిపూర్, ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు తీవ్ర అవమానాలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో భారతీరెడ్డిపై ఎవరో వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మనోవేదనకు గురై రౌంట్ టేబుల్ సమావేశం పెట్టారు.

కానీ సామాన్య మహిళలకు అన్యాయం, అవమానాలు ఎదురైతే పద్మ ఎక్కడ దాక్కుంటుందో అర్థం కావడం లేదు.హోం మంత్రి తానేటి వనిత తల్లుల పెంపకాన్ని కించపరిచేలా మాట్లాడుతోంది. తన అక్కని ఏడిపించిన వారిని నిలదీసిన అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ నేతలు దారుణంగా చంపేశారు. జగన్ పాలనలో మహిళలపై 1.14లక్షల నేరాలు, 490 దాడులు జరిగాయి. వలంటీర్లు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని నిలదీస్తే నా దిష్టిబొమ్మను తగులబెట్టారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగులబెట్టాలని మహిళలు ప్రయత్నిస్తే అక్రమ కేసులు పెట్టారు.

డీజీపీ, ముఖ్యమంత్రి, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి మా సహనం నశించిపోయింది. సోషల్ మీడియాలో మాపై పోస్టులు పెట్టిన వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్లకు దేహశుద్ధి చేయక తప్పదు. కడుపు మంటతో నా కొడక అని విమర్శ చేసిన నన్ను అడ్డగోలుగా అవమానించారు. భారతమ్మ, విజయమ్మ అని పిలిచేవాళ్లు కూడా తమ కుటుంబ సభ్యుల శీలాన్ని నిందించుకుంటారా?

భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి వెకిలినవ్వులు నవ్వాడే తప్ప..కనీసం ఖండించలేదు. మహిళా పోలీసులను కూడా వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవమానిస్తున్నారు. మొన్నటివరకు జగన్మోహన్ రెడ్డిని స్మరించిన ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ పేటీఎం కుక్కలు ఇష్టమొచ్చినట్లు వేధిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ మేం ఉంటాం… మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు….నాకు ఫోన్ చేయండి. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

అవమానించిన వాళ్ల ఇళ్లకు వెళ్లి తన్ని వద్దాం అని రాష్ట్ర మహిళలకు పిలుపునిస్తున్నా. పోలీసులు, డీజీపీ, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వల్ల రాష్ట్ర మహిళలకు రక్షణ దొరకడం లేదు. మహిళలు తమకు జరిగిన అన్యాయం పై ఏడ్వడం కాదు…మిమ్మల్ని ఏడిపించిన వాళ్లను ఏడిపించేలా మనోధైర్యంతో ఉండాలని కోరుతున్నా.

పీతల సుజాత మాట్లాడుతూ…. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవించారు, సమాన హక్కులు కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారు. డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ, అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది. రోజుకు సగటున 50 వరకు ఏపీలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. భారతదేశంలో మహిళలపై అరాచకాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారని అసెంబ్లీలో చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే నన్ను తీవ్రంగా అవమానించింది.

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలే మహిళలను కించపరుస్తూ..ఆత్మగౌరవంపై దెబ్బతీస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మహిళలపై అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ నాయకులు, పేటీఎం బ్యాచ్ ను వంగలపూడి అనిత మగాడిలా ఎదుర్కొంటుంది. పోరాడుతోంది. తెలుగు మహిళలు భయపడే ప్రసక్తే లేదు.

ఫేక్ పోస్టులు, తప్పుడు రాతలు రాసే వారు తమ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నేతలు ఫేక్ పోస్టులను కొనసాగిస్తే వాళ్ల ఇళ్లకు తెలుగు మహిళలు వెళ్లి చెప్పులతో బడితపూజ చేయడానికి వెనుకాడరు. దిశచట్టంతో జగన్మోహన్ రెడ్డి మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాడు. తల్లుల పెంపకం సరిగా లేదు, వస్త్రధారణ సరిగా ఉండడం లేదు, తాగినమైకంలో తప్పు చేశారు అని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మహిళల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

అన్నం తినే వాళ్ళు ఎవరూ మహిళలపై పోస్టులు పెట్టరు. అవమానించరు. తెలుగు మహిళలను ఎంత టార్గెట్ చేసినా…మా పోరాటం మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తాం. మహిళలపై అఘాయిత్యాలు ఆగేవరకు, బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు మా పోరాటాం కొనసాగుతుంది.

ఆచంట సునీత మాట్లాడుతూ… జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువు లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళలను బూటు కాలితో తన్నించిన చరిత్ర జగన్ రెడ్డిది. టీడీపీ మహిళా నేతలపై వైసీపీ పేటీఎం బ్యాచ్ సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి రాకతో రాజకీయాల్లోకి నైతిక విలువలు పతనమయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదు. సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ చేపట్టిన అంగన్వాడీలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చెరమగీతం పాడాలి.

గద్దె అనూరాధ మాట్లాడుతూ… స్వాతంత్ర్యపోరాటం చేసిన మహిళలకు ఏమాత్రం తగ్గకుండా అరాచక పాలనపై తెలుగు మహిళలు పోరాడుతున్నారు. వాళ్లకు నా అభినందనలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలను ట్రాక్టర్ తో గుద్ది చంపడం, ఇళ్లు కూల్చి వేధించడం, సీబీఐ కేసులు పెట్టి వేధించడం వంటి విష సంస్కృతికి తెరలేపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మహిళల సున్నితమైన హృదయాలను గాయపరుస్తున్నారు.

మహిళలు రాష్ట్రంలో విపరీతంగా మిస్ అవుతున్నారు. కనిపించకుండా పోతుంటే కనీసం వెతికే పనికూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో సొంత చెల్లి న్యాయం కోసం ఎన్నో గడపలు తొక్కుతూ బ్రతిమాలుకోవాల్సివస్తోంది. సొంత బాబాయ్ ఇంట్లో దీపాలు ఆర్పేసిన వ్యక్తి, రాష్ట్రంలోని మహిళల ఇళ్లల్లో కార్తీక దీపాలు వెలిగిస్తాడంటే ఎవరూ నమ్మే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వీటిని నియంత్రించడంలో చేతులుస్తేశాడు. మహిళలు ఎన్నో దురాచారాలు, ఆచారాలు, కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా సమాజంలోకి వచ్చాం.

ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రోత్సహించారు. ఆధునిక సంఘ సంస్కర్తగా చంద్రబాబు నిలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్లీ మహిళలు వంటింటికే పరిమితం అయ్యే పరిస్థితులు తెచ్చాడు. దుర్మార్గపు పాలనకు సమాధి కట్టేందుకు మహిళలంతా ముందుకు రావాలి. మహిళలు మదర్ థెరిస్సాలు మాత్రమే కాదు మహంకాళిలా మారగలరని నిరూపించాలి. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి.

కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ….. జగన్మోహన్ రెడ్డి చేతకాని పరిపాలన వల్ల మహిళలు రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. ప్రభుత్వం అదుపుచేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు కడుపు మంటతో మహిళలు ఇలా తిరగబడాల్సి వస్తుంది. అధికారాలు మారుతూ ఉంటాయి…కానీ మహిళల పట్ల గౌరవం, మర్యాదలు మారకూడదు. ప్రభుత్వ విధానాలను నిలదీసిన మహిళలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధించడమే మీ పార్టీ విధానాలా జగన్మోహన్ రెడ్డి?

మహిళల ఆత్మగౌరవం పై దెబ్బతీసిన వారిలో ఒక్కరిపై కూడా జగన్ సరైన చర్యలు తీసుకోలేదు. పైగా ప్రోత్సహించడం మహిళల పట్ల చిన్నచూపుకు నిదర్శనం. గతంలో బీహార్, యూపీలో ఇలా మహిళలపై అఘాయిత్యాలు జరిగేవి. నేడు జగన్ పాలనలో ఏపీ ముందుకు వచ్చింది. మహిళలపై వేధింపులపై గతంలో డీజీపీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసి, మహిళలకు జరుగుతున్న అన్యాయంపై విజ్ఞప్తి చేశాం.

కానీ ఎక్కడా అదుపుచేసే చర్యలు తీసుకోలేదు. నీచమైన పుట్టుక పుట్టిన వాళ్లే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడతారు. రాజకీయాల్లోకి మహిళలను లాక్కొచ్చి అవమానించడం నీచమైన చర్య. మహిళలను ఎలా గౌరవించాలో ఎన్టీఆర్, చంద్రబాబు అనేక కార్యక్రమాల ద్వారా రుజువుచేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్ మత్తులో రాష్ట్ర యువత ఊగిసలాడుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు పురిగొల్పుతోంది.

మహిళలపై పోస్టులు పెట్టిన వారిపై జగన్ చర్యలు తీసుకోకపోతే మేం అధికారంలోకి వచ్చాక అన్యాయం జరిగిన ప్రతి మహిళకు న్యాయం చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోక తప్పదు. వైసీపీ నాయకులు మహిళలను బెదిరించి, ఇళ్లకు పరిమితం చేయాలని చూస్తున్నారు. మహిళలు ఎక్కడా తగ్గొద్దు…మీ న్యాయ పోరాటాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటాం.

తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… జగన్ రెడ్డి మహిళా భద్రతను గాలికొదిలేశాడు. దోచుకోవడం-దాచుకోవడం మినహా జగన్ రెడ్డికి మహిళా రక్షణ పట్టడంలేదు ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసి వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. తోటి మహిళలు….జగన్ రెడ్డి భార్య, తల్లి లాంటి వారు కాదా ? పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తూ బాధితులను పట్టించుకోవడంలేదు. వచ్చే ఎన్నికల్లో మహిళలు జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి

సుగుణమ్మ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా పరిస్థితి ఉందా? దిశా చట్టం ఏమైంది జగన్ రెడ్డీ?అత్యాచారాలు యాధృచ్ఛికమని వైసీపీ మహిళా మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు కాదా?పోలీసులు నిందితులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టులు పెడుతున్నారు.

మాలతి, లోక్ సత్తా పార్టీ మహిళా నాయకురాలు:
జగన్మోహన్ రెడ్డి మహిళలకు గౌరవం లేకుండా చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ ఘటనలపై ఇళ్లల్లో ఉన్న మహిళలంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అసమర్ధతను గుర్తిస్తున్నారు. మహిళలను గౌరవించే విధానాలను తల్లులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే నేర్పించాలి.
అక్కచెల్లెమ్మలు అంటూనే జగన్మోహన్ రెడ్డి మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిని ప్రోత్సహిస్తున్నారు. మహిళలను పార్టీలతో ముడిపెట్టి చూడడం సరికాదు. ఏపార్టీలో ఉన్న మహిళ అవమానానికి గురైనా యావత్ మహిళా లోకానికి అవమానం జరిగినట్లే భావించాలి. జగన్మోహన్ రెడ్డి విభజించు..పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తూ మహిళలపై నిర్బంధాలు విధిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకుండా పోయింది. వైసీపీ దుష్టపాలనను గద్దె దింపాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు.

పి.దుర్గాభవాని, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి:
మహిళల ఆత్మగౌరవాన్ని హరించే శక్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మణిపూర్ లో యావత్ దేశం తలదించుకునేలా మహిళలను నగ్నంగా ఊరేగించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. తల్లికడుపున పుట్టిన కొంతమంది దుష్టశక్తులు మహిళల అంగాంగాలను ఊరేగింపుగా ప్రదర్శన చేస్తున్న నీచ సంస్కృతి నేడు దేశంలో నడుస్తోంది. మహిళలను కించపరిచే హక్కు ఈ దుష్టశక్తులకు ఎవరిచ్చారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? మహిళలను వంటింటి నుండి బయటకు తీసుకురావాడానికి ఎన్నో పోరాటాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డిపాలనలో వంటింటికే మహిళలను పంపుతున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు నేడు ఏపీలో దాపురించాయి. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టేవారికి ఆ ధైర్యం ఎవరు ఇస్తున్నారు?

రావి సౌజన్య, జనసేన:
రాష్ట్రంలో వైఎస్ భారతీరెడ్డి ఒక్కరే మహిళా? వైసీపీ గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా రోజా గురించి మాట్లాడాలి. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఎక్కడో రోజా చెప్పాలి. వేరే వారికి అవమానం జరిగితే వెటకారం చేసే రోజా తన కుటుంబంపై ఆరోపణలు వస్తే తట్టుకోలేకపోతోందా? గంట, అరగంట మంత్రులను వెనకేసుకురావడమేనా ముఖ్యమంత్రి బాధ్యత? పరదాల చాటున పర్యటనలు చేసే ముఖ్యమంత్రి మనకు అవసరమా? జగన్ రెడ్డి, వైసీపీ నేతలను మహిళలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

LEAVE A RESPONSE