జగన్ హాయాంలో రోడ్ల నిర్మాణం ఉత్తుత్తి సమీక్షలకే పరిమితమైంది

Spread the love

– గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం వాహనదారుల ప్రాణాలు తీస్తున్నా, ముఖ్యమంత్రిలో చలనంలేదు.
• ప్రజలు రోడ్లపై ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్లు హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్నాడు.
• ప్రజలకోసం, రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు ప్రారంభించిన రోడ్లన్నింటినీ, జగన్ మధ్యలోనే నిలిపేశాడు.
• జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో ఎన్నిరోడ్లు నిర్మించాడు.. వాటికోసం ఎంతడబ్బు ఖర్చుపెట్టాడు.. ఎన్ని గుంతలుపూడ్చాల్సి ఉందనే వివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

ప్రధానపత్రికల్లో రాష్ట్రంలోని రోడ్లదుస్థితిపై వచ్చిన కథనాలు, వార్తలు జగన్మోహన్ రెడ్డి పనితీరుకి నిదర్శనమని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబువేసిన రోడ్లపై దర్జాగా ప్రయాణించాడని, ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లపై ప్రయాణించేధైర్యం చేయలేక 20 కిలోమీటర్లకు కూడా హెలికాఫ్టర్లోనే ప్రయాణిస్తున్నాడని, రాష్ట్రంలోని రోడ్లు అద్వా న్నంగా ఉన్నాయని తెలిసే జగన్ గాల్లో ప్రయాణిస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ముఖ్యమంత్రి కాబట్టి గాల్లో తిరుగుతున్నాడు. కానీ ప్రజలు రోడ్లపై తిరగక తప్పడం లేదు. మొన్నమొన్న ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద రూ.16కోట్లు మూడేళ్లక్రితం మంజూరు అయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మంచంగి పుట్టు మండలంలో మూడేళ్లక్రితం ప్రారంభించిన రోడ్డునిర్మాణం మూడువారాల క్రితం పూర్త యింది. అదిపూర్తవ్వగానే మొన్నకురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. పూర్తిగా ధ్వంస మైంది. ఇదెలా ఉందంటే పనోడు పందిరేస్తే పిచికలు పడేసినట్టుగా ఉంది.

జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో రోడ్లేవేయడు. వేసినా తనపార్టీ వాళ్లజేబులు నింపడంకోసం పనితనంలేని కాంట్రాక్టర్లతో వేయించి, ఏదో మమ అనిపించి తారుపూసి రోడ్లువేయడం, డబ్బులు మింగేయడం చేస్తున్నారు. తమకు రోడ్డువచ్చిందని మంచంగి పుట్టు ప్రజలు సంతోషించేలోపే వర్షాలకు రోడ్డుమొత్తం పగిలిపోయింది.

ఒకవైపు రోడ్లువేస్తుంటే, మరోపక్క కొట్టుకుపోతున్నారు. మరోపక్క ప్రతిపక్షాలే ప్రజల బాధలు చూడలేక రోడ్లపై గుంతలుపూడ్చడంచేస్తున్నాయి. ఇంకాకొన్నిచోట్ల రోడ్లు తామువేస్తామని ప్రతిపక్షనేతలు ముందుకొస్తుంటే, అధికారులు అడ్డుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020-21తో ఒకసారి రోడ్లపై సమీక్ష సమావేశం పెట్టాడు . మేనెలలో సమీక్షసమావేశంపెట్టి, జూలై నాటికి రోడ్లువేయాలని, మరమ్మతులు చేయాలని చెబుతాడు.

2021-22లో కూడా సమీక్షాసమావేశంపెట్టి, ఇలానే చెప్పాడు. అప్పుడు వేసినరోడ్లు, ఇప్పుడు తమ ప్రభుత్వం వేస్తున్నరోడ్ల ఫోటోలుతీసి సోషల్ మీడియాలో పెట్టమన్నాడు. అసలు రోడ్లువేస్తే కదా ఫోటోలుతీయడానికి! జగన్ పాల నలో రోడ్లపై పడిన గుంతలధాటికి ట్రాక్టర్లు, లారీలవంటి వాహనాలే మరమ్మతులకు గురి అవుతున్నాయి. ప్రధానంగా జిల్లారహదారులపై ప్రయాణించాలంటే ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.

ప్రసవవేదన పడేవారు అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే రోడ్లపై ఉన్నప్పుడే కనే పరిస్థితి. ఇప్పటికే గుంతలమయమైన రోడ్లపై ప్రయాణిస్తూ నరకం చూస్తున్న ప్రజలు, వాహనదారులు రేపు వర్షాలుపడితే గుంతలుఎక్కడుంటా యో తెలియదని, వాహనాలకు, తమకు ఏమవుతుందోనన్న భయంతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న కృష్ణాజిల్లా ఉంగటూరు మండలానికి చెందిన వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి తనద్విక్రవాహనంపై ప్రయాణిస్తూ, గుంతలోపడి ప్రాణాలు కోల్పోయింది.

ఇటీవలే తెలంగాణఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై ప్రయాణించాలంటే నరకం కనిపించిందన్నారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీరోడ్లను తెలంగాణరోడ్లతోపోల్చి, ఈ ప్రభుత్వాన్ని ఎద్దేవాచేశాడు. కేంద్రమంత్రి మురళీధరన్ కూడా ఏపీరోడ్లదుస్థితిపై ట్వీట్ చేశాడు. కేంద్రమంత్రి వస్తున్నాడని తెలిసి కూడా రోడ్లపై గుంతల్ని పూడ్చని ప్రభుత్వం, ప్రజలకోసం రోడ్లు వేస్తుందా అని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్లని రోడ్లువేయమని అధికారులు బతిమాలుతున్నారు. వారేమో పాతబిల్లులు చెల్లిస్తేనే వస్తామంటున్నారు. చంద్రబాబుహాయాంలో మొదలుపెట్టిన రోడ్లనిర్మాణం గానీ, టిడ్కోఇళ్లు, అమరావతి నిర్మాణంగానివ్వండి ఏదైనాసరే, నేను మొత్తంపూర్తిచేస్తా ననిచెప్పిన జగన్ అన్నింటినీ గాలికి వదిలేశాడు. పనులుచేయకపోగా టీడీపీ ప్రభుత్వంలో చేసినపనులకు తాను బిల్లులుచెల్లించనంటున్నాడు.

కాంట్రాక్టర్లు చిప్పలు పట్టుకొ ని ధర్నాచౌక్ లో ధర్నాచేశారు. దేశంలో జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఇలాంటి ఘనతలు సాధ్యమవుతున్నాయి. జగన్ అతనిప్రభుత్వం బతిమాలినసరే కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితిలేదు. ఎక్కడోఒకచోట సొంతమనుషులతో తూతూమంత్రంగా వేసే ఒక టీ, అరా రోడ్డు కూడా గాలికి, వానకు కొట్టుకుపోతోంది.

2022-23లో ఏఐఐబీ, ఏపీ రూరల్ రోడ్డుప్రాజెక్ట్ కింద రూ.1500కోట్లు కేటాయిస్తే, జగన్ రెడ్డి రూ.655కోట్లే ఖర్చుపెట్టాడు. దాంతో 2023-24లో కేవలం రూ.455కోట్లే కేటాయించారు. మూలధనంలో ఖర్చుపెడితేనే ఉత్పాదకతపెరిగి, అభివృద్ధి జరిగి సంప ద పెరుగుతుంది. కానీ జగన్ ఆ ఖర్చుని పూర్తిగావిస్మరించాడు. రాష్ట్రబడ్జెట్ లో 2022-23లో రోడ్లపునర్నిర్మాణానికి రూ.979కోట్లుకేటాయించి, కేవలం రూ.247కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. 2022-23లో రూ.844కోట్లుకేటాయించి, ఇప్పటికి రూ.238 కోట్లు ఖర్చుపెట్టారు. బడ్జెట్లో నిధులుకేటాయించి, వాటిని ఖర్చు పెట్టకపోతే రోడ్లు ఎలా బాగుపడతాయి?

రాష్ట్రంలో 2,500కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్ల పునరుద్ధరణకు రూ.2,205కోట్ల అంచనాలతో బ్యాంక్ ఆఫ్ బరోడానుంచి రూ.2వేలకోట్ల రుణం తీసుకొని ఆసొమ్ముని దారిమళ్లించారు. పెట్రోల్ డీజిల్ పై రోడ్లసెస్సుపేరుతో ఇప్పటివరకు రూ.2,500కోట్లు వసూలుచేశారు. అలావసూలుచేసిన సెస్సుపై కూడా మరలా అప్పులు తీసుకొచ్చారు. అప్పులుకావాలంటే రూ.205కోట్లు రాష్ట్రప్రభుత్వం తనవాటా గా చెల్లించాలని బ్యాంకులు నిబంధనపెడితే, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం తోబ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇవ్వమని చెప్పేసింది. బ్యాంకులకు, కేంద్రానికి జగన్ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోవడంతో అనేకప్రాజెక్టులు రాష్ట్రంనుంచి వెనక్కు వెళ్లిపోయాయి.

గతేడాది రోడ్లమరమ్మతులు అయినాచేయండని ముఖ్యమంత్రి గతంలో ఆదేశించాడు. ఇప్పటికే వర్షాలు పడటం మొదలైంది..ఆయనచెప్పిన మరమ్మతులు ఎప్పుడు పూర్త వుతాయో తెలియదు. ఈ రోడ్లకు సంబంధించి జగన్ ప్రభుత్వంలోజరిగేవాటిపై చెప్పా లంటే ఒక పెద్దచాటభారతమే ఉంది. జగన్ రెడ్డి హయాంలో రూ.10,669కోట్ల అంచనా వ్యయంతో నరేగా మెటీరియల్ కాంపోండ్ నిధుల్ని, గ్రామసచివాలయాలు, రైతుభరో సా కేంద్రాలకు ప్రాథాన్యతఇస్తోంది.

ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద చేపట్టిన రహదారులపనులకు రూ.200కోట్ల బిల్లులు పెండింగ్ లోపెట్టాడు. పనులు చేయించు కుంటాడు కానీ బిల్లులు ఇవ్వడు. తనకుకావాల్సిన వారికి, తనపార్టీవారికి మాత్రమే బిల్లులుచెల్లిస్తాడు. దీనిలోకూడా రాజకీయాలు పక్షపాతం. రాష్ట్రంలో ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ సెక్టర్ పీఎం.జీ.ఎస్ కింద 500నుంచి 600కిలోమీటర్ల రోడ్లు వేస్తారు. దానికి రాష్ట్రవాటా ఇవ్వకపోవడంతో అదికూడా ఆగిపోయింది.

జగన్మోహన్ రెడ్డి ఒకసారి చాలాగొప్పగాచెప్పాడు. అదేంటంటే గ్రామీణరహదారుల మరమ్మతులకు రూ.10వేలకోట్లు అవసరమని సమీక్షలోచెప్పాడు. దాన్ని ఎలాసమీకరించాలో చెప్ప లేదు.
నితిన్ గడ్కరీ ప్రారంభించిన జాతీయరహదారులపనుల్ని తానే చేశానంటూ ఫోజులు కొడుతున్నాడు. జాతీయరహదారుల్ని కూడా జగనే నిర్మించాడంటూ నీలిమీడియా కోతలుకోస్తుంది. ఒకసారి అసెంబ్లీలో చెప్పాడు. 32నెలలపాలనలో రూ.639కోట్ల పను లు మాత్రమే చేశానని సమాధానంచెప్పాడు. రూ.10వేలకోట్లపనులు చేయాలని చెప్పినచోట కేవలం రూ.639కోట్ల పనులు జరిగినట్టు ఆయనే ఒప్పుకున్నాడు.

వర్షాకాలంలో రాష్ట్రంలోని రోడ్లపై ఎలా ప్రయాణించాలా అని ప్రజలు భయపడిపోతున్నా రు. కొన్నిచోట్ల దెందులూరి లాంటి నియోజకవర్గాల్లో రోడ్లపై వరినాట్లుకూడా వేశారు. చింతమనేని ప్రభాకర్ తనసొంతడబ్బుతో గ్రావెల్ తో రోడ్లమరమ్మతులు చేయించడాని కి సిద్ధమైతే, ఆయనపై కేసులుపెట్టారు. వీళ్లుచేయరు..ఎవరైనాచేస్తే ఊరుకోరు. కాబట్టి ఒక పత్రిక రాష్ట్రంలో సర్వేచేసింది. సర్వేచేసి 13జిల్లాల్లో 287కిలోమీటర్లు పరిశీలనచేస్తే, మొత్తం 7,010 గుంతలు ఉన్నట్టు ఫోటోలతో సహా చూపించింది. ఆ గుంతల్లో ఎన్ని గుంతలుపూడ్చారని జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశంపార్టీ ప్రశ్నిస్తోంది.

నీలి మీడియా, కూలిమీడియాకు ఈ గుంతలు కనిపించవు. ఏమైనా అంటే చంద్రబాబు రోడ్లువేయలేద ని ప్రచారంచేస్తాయి. వైసీపీఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ రాష్ట్రంలోని రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయని, రోడ్లపై ప్రయాణించి అనేకకుటుంబాలు గాయాలపాలయ్యాయని, గాయా లుపెరగడంవల్ల వైద్యులకు పనిపెరిగిందని 07-09-2001లో స్టేట్ మెంట్ ఇచ్చాడు. వైసీపీ ఇంకోఎమ్మెల్యే విశాఖపట్నం కన్నబాబురాజు గారు, రోడ్లువేయడానికి ప్రభు త్వం వద్దనిధులు లేవు, ఉన్నడబ్బంతా సంక్షేమపథకాలకే ఖర్చుపెడుతుంటే రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయని చెప్పారు. అంటే రోడ్డు సంక్షేమంలో భాగంకాదా?

రోడ్లపై తిరిగి వ్యాపారాలు చేయకూడదా.. ప్రయాణాలు చేయకూడదా? రోడ్లపై వెళ్లకుండా పిల్లలు, ఉద్యోగులుఎలా తిరగాలి? రోడ్లువేయడం సంక్షేమంలో పార్ట్ కాదా అని ప్రశ్నిస్తున్నా. కాబట్టి, జగన్ రెడ్డి అధికారం ఎప్పుడుదిగిపోతాడా.. రోడ్లు ఎప్పుడు బాగుపడతాయా అనిప్రజలు ఎదురుచూస్తున్నారు. రోడ్లదుస్థితిపై ఫోటోలు తీసి గ్యాలరీలోపెట్టండన్న ముఖ్యమంత్రి, ఆ గ్యాలరీయే పెట్టలేదు. ఏటా సమీక్ష చేసే వాడు.. ఈ సంవత్సరమైతే అసలు సమీక్షే చేయలేదు. మేలో సమీక్షచేసి, జూన్ లో రోడ్లు వేయాలంటాడు, కానీ కాంట్రాక్టర్లురారు.

తెలుగుదేశంహాయాంలో రూ.4,500కోట్ల రుణాల్ని ఏఈబీ ద్వారా తీసుకొచ్చి, 44 ప్యాకేజీలు కింద రోడ్లువేయడానికి టెండర్లు పిలిచి, దాదాపు రూ.600కోట్లు ఖర్చుచేశా రు, చంద్రబాబునాయుడి హయాంలో. జగన్ రెడ్డి వచ్చాక 44ప్యాకేజీల్ని అలాగే ఉంచే సి, పనులుచేసిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేదు. చంద్రబాబుపనులుప్రారంభిస్తే జగన్ ఆపేస్తాడు. అది ఫ్లైఓవర్ అయినా, ఓవర్ బ్రిడ్జి అయినా ఆపేస్తాడు. విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ గురించి కోర్టుకవెళ్లిన సందర్భంకూడా ఉంది.
కాబట్టి ఇవాళ ఈ రోడ్లమీద జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నాను.
ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు రోడ్లు ఎలాఉన్నాయి? ఇప్పడెలా ఉన్నాయి? నువ్వు వచ్చాక ఎంతమేరకు డబ్బులుఖర్చుపెట్టావు? ఎన్నిరోడ్లు ఇంకా వేయాల్సిఉంది? 7010 గుంతల్లో ఎన్నిగుంతలుపూడ్చావు? ఎన్నిగుంతలు పూడ్చాల్సి ఉంది అనే వివరాలతో ఒకశ్వేతపత్రం రిలీజ్ చేయగలవా అని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. చంద్రబా బు హయాంలో న్యూడెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి రోడ్లనిర్మాణానికి రూ.6,400కోట్ల నిధులుతీసుకొస్తే, ఆ డబ్బులు తానేతీసుకొచ్చానని జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటు న్నాడు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు వంతెన పునర్నిర్మాణ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ గ్రామా లు, మరియు మండలాల కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్, ఏపీ.ఎం.సీ .ఆర్.సీ.ఐ పీకింద ఖర్చుచేసింది కేవలం రూ.15కోట్లు మాత్రమే. రూ.15కోట్లతోగ్రామాలు, మండ లాల రోడ్లు కనెక్ట్ అవుతాయా? ఈ విధంగా రోడ్లనిర్మాణం పేరుతో తీసుకొచ్చిన డబ్బం తా ఎటుపోయింది…ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా జగన్ రెడ్డి హాయాంలో మాకుడబ్బులు ఇప్పించమని కాంట్రాక్టర్లు కోర్టుకువెళ్లారు . భవాని మెస్సర్స్ అండ్ కన్ స్ట్రక్షన్స్ లాంటిసంస్థలు రిట్ పిటిషన్లువేశారు.

కష్టం తెలుగుదేశా నిది.. ఫలితం వైసీపీదిలా ప్రచారంచేసుకుంటున్నారు. చంద్రబాబు హాయాంలో జాతీయరహాదారులకోసం 5,486కిలోమీటర్ల రహదారుల పనుల్ని ప్రతిపాదనచేస్తే, ఈయన ఇంతవరకు వాటిని కంప్లీట్ చేసినపరిస్థితిలేదు. అలాగే మరో 2వేలకిలోమీటర్ల రోడ్డుని పీపీపీ పద్ధతిలో అభివృద్ధిచేయాలని చంద్రబాబు ప్రతిపాదనచేశారు. రాష్ట్రస్థాయిలో 3వేలకిలోమీటర్ల రాష్ట్రప్రధానరహదారులు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

విజయవాడ-మచిలీపట్నం రహదారి ఎన్.హెచ్ -65 విస్తరణతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ పనులుచేపట్టారు. ఎన్.హెచ్ 6 పరిధిలో నరసన్నపేట -రణస్థలం, రణస్థలం-ఆనందపురం, ఆనందపురం – అనకాపల్లి, గుండు గొలను – కొవ్వూరు రహదారి పనులు ప్రారంభించారు. ఈయనవాటిని అన్నిం టినీ కూడా ఆపేశారు. ఎందుకు ఆపేశావంటే చంద్రబాబు మొదలుపెట్టాడుకాబట్టి అని అనుకోవాలి. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం రూ.120కోట్లతో కేంద్రప్రభుత్వంనుంచి మంజూరుచేయించి విస్తరించడం జరిగింది.

విజయవాడ నగరానికి 188కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.18,238కోట్లతో ప్రతిపాదనచేస్తే దాన్ని ఆపేశాడు. రాష్ట్రప్రభుత్వం భూసేకరణకు అనుమతించింది. భారత్ మాల ప్రాజెక్ట్ లో భాగంగా వేయాల్సిన రింగ్ రోడ్డునిర్మాణానికి కేంద్రంఒప్పుకున్నాకూడా ఈయన రింగ్ రోడ్డు ప్రారంభంచేయలేదు. రూ.800కోట్ల వ్యయంతో 16కిలోమీటర్ల పొడవైన చిలకలూరిపేట బైపాస్ రోడ్డుకూడా చంద్రబాబుప్రభుత్వం ప్రారంభించింది. ఈయన ఆపేశాడు.

రూ. 2,250కోట్లతో ఎన్.హెచ్.544 డీ కింద, గుంటూరునుంచి గిద్దలూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. కానీ ఈయన ప్రారంభించలేదు. రూ.2,680కోట్లతో ఏపీ ఒడిశా అటవీప్రాంతాలుకలుపుతూ, 280కిలోమీటర్ల మేర జాతీయరహదారిని ప్రతిపాదించారు. ఇందులో ఏపీకి 218కిలోమీటర్లుఉంది. దాన్ని కూడా ఈయనప్రారంభించలేదు. రాజధాని అమరావతి రాయలసీమను అను సంధానంచేస్తూ, 25వేలకోట్లతో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే టీడీపీప్రభు త్వంలో మంజూరైతే దాన్నిఆపేసి, నిర్వీర్యం చేసేశాడు.

విశాఖటపట్నం నుంచి భోగా పురం ఎయిర్ పోర్టు మధ్య అడ్డంకులులేని ప్రయాణంకోసం 2018లో చంద్రబాబు భీమిలి – భోగాపురం బీచ్ కారిడార్ ప్రతిపాదించారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ల లేదు. చంద్రబాబు ఏదిప్రారంభిస్తే, అదిప్రజలకు ఉపయోగమైనా సరే దాన్ని ఆపేస్తాడు అంతే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కజాతీయరహదారి అయినా కొత్తగా తీసుకోచ్చి పనులుచేశాడా అని ప్రశ్నిస్తున్నాం.

విజయవాడలో చంద్రబాబు హయాంలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మిస్తే దానికి రంగులేసి, మేం పూర్తిచేశామని చెప్పుకున్నారు.. అక్కడున్న ఎమ్మెల్యే, మాజీమంత్రి, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అన్నిరంగాల్లో వెనుకబ డిపోయిన రాష్ట్రం, రోడ్లువేయడంలో కూడా దేశంలో బాగా వెనుకబడింది. జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లు గోళ్లుగిల్లుకుంటూ కూర్చొని 8నెలల్లో ఏంచేస్తాడు? కనీసం రోడ్లపై గుంత లైనా పూడ్చి, ప్రజల నడుములు విరక్కుండా చూడాలి.” అని రఫీ డిమాండ్ చేశారు.

Leave a Reply