– రాష్ట్రంలో కాపు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది
– కాపుల సంక్షేమం చంద్రబాబు నాయుతోనే సాధ్యం
– తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్
వైసీపీ 3 ఏళ్ల పాలనలో కాపులకు జరిగింది అన్యాయాలు, అవమానాలే. రాష్ట్రంలో కాపు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అడుగడుగునా కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మొన్న విదేశీ విద్య, పీజురీయింబర్స్ మెంట్ రద్దు చేశారు, నేడు కాపు నేస్తం పధకం నిలిపేశారు. కాపులకు ఓ వైపు సంక్షేమ పధకాలు దూరం చేస్తూ మరో వైపు ఆర్దికంగా, రాజకీయంగా అన్ని విధాల కాపుల్ని అణిచివేస్తున్నారు.
టీడీపీ హయాంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఏటా రూ.1,500 కోట్ల నిధులను ఖర్చు చేశాం. కానీ జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించేశారు.పోటీ పరీక్షలకు సిద్దమయ్యే కాపు విధ్యార్దులకు డిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేసి ఏపీ భవన్ ని వైసీపీ భవన్ గా మార్చారు. మరోవైపు.. కాపు కార్పొరేషన్‌ను అలంకార ప్రాయంగా మార్చి కాపు యువతకు ఉపాధి అవకాశాల్లేకుండా అన్యాయం చేశారు.
అన్నివర్గాలకు ఇచ్చే పెన్షన్లు, అమ్మవడి తదితర పథకాల నిధులను కాపు సంక్షేమంలో చూపించి దగా చేస్తున్నారు. ఉమ్మడి పథకాల్లో నిధులనే బాగాలుగా విడదీసి వెల్ఫేర్ పద్దులో చూపుతున్నారు. దారుణంగా మోసం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర పథకాల్లో కలిపేశారు.పాత పథకాలకు ముందు వైఎస్సార్ పేరు చేర్చి కొత్త పథకాలుగా నమ్మించి మోసం చేస్తున్నారు. చివరకు రాష్ట్రంలో కాపులు బ్రతకలేక పొరుగు రాష్ట్రాలకు వలస వెల్లే పరిస్థితి కల్పించారు.
టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తే వాటిని కూడా జగన్ రద్దు చేసి కాపులపట్ల తనకున్న ధ్వేషాన్ని బహిరంగంగానే చాటుకున్నారు. కాపు భవన్‌లు రద్దు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం కాపులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగాఅణగద్రొక్కుతున్న జగన్ రెడ్డికి కాపు సోదరులు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు.