జగన్ రెడ్డి… ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి. వైసిపి నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో తమ సమస్యలపై హవాలా కింగ్ బాలినేనిని ప్రశ్నించిన మహిళ కవిత ఇంటికి వైసీపీ మూకలు తాళాలు వేసి వేధించడం దారుణం. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు కనీసం నీళ్లు, పాలు కూడా తెచ్చుకునే వీలు లేదంటూ నిర్బంధిచడమే వైసిపి పాలనలో మహిళలకు దక్కిన గౌరవమా? కవితను వేధిస్తున్న బాలినేని అనుచర గణం, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.