Suryaa.co.in

Andhra Pradesh

దోపిడీ ద్వారంపూడి జైలుకి వెళ్లడం ఖాయం

టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి

కాకినాడ: ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయమని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం అక్రమ ఎగుమతి, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు వ్యాపారాలను చేసి ప్రోత్సహించి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేశారంటూ వారు ద్వారంపూడిపై ధ్వజమెత్తారు.

కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీలు విలేకరులతో సమావేశం నిర్వహించి ద్వారంపూడి నాలుగు రోజుల క్రితం సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండ బాబు), టీడీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతూ రాసిన లేఖపై వారు స్పందించారు.

ఈ సందర్భంగా వీరు, రమేష్, బాలాజీలు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లు వైకాపా పాలనలో ద్వారంపూడి కాకినాడను పోర్టును ఎన్నో అక్రమాలకు కేంద్రంగా చేసుకొని తన వ్యాపారాలను కొనసాగించేవారున్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దొంగ బియ్యం ఇతర మాదకద్రవ్యాలు ఎగుమతి కాకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో అతను గగ్గోలు పెడుతున్నారని చెప్పారు.

కాకినాడ పోర్టులో అక్రమ రవాణా జరగకుండా తాము చెక్ పోస్ట్ చేయగా, కార్యక్రమాలు పోర్టులో చురుగ్గా సాగేందుకు మరో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోర్టు పేరు ప్రఖ్యాతలు పెంచుతామన్నారు. పోర్టులో కార్మికులకు నష్టం జరుగుతుందంటూ ద్వారంపూడి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. త్వరలోనే ద్వారంపూడి అతను అరాచకాలను బహిర్గతం పరుస్తామన్నారు.

ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి తమ కార్యకర్తల ఇళ్లను కూల్చారని, టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి చేశారని, జన సైనికులను రాళ్లతో కొట్టించారని చెప్పారు. నాడు ద్వారంపూడి చేసిన అక్రమాలను ఆరోపించామని నేడు వాటిని ఆధారాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తమ నేత కొండబాబు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, యువ నేత లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారిపై నోటు దురుసుగాను, వ్యక్తిగతంగా విమర్శించిన ద్వారంపూడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టమని చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు.

ఎన్నో అక్రమాలు చేసిన ద్వారంపూడి అతని అనుచరులను కాకినాడలో గుడ్డలు విప్పించే పరిస్థితి వస్తుందని వీరు, రమేష్, బాలాజీలు చెప్పారు. గడచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన వైసీపీ, జగన్ ప్రభుత్వం వారి నాయకులు మూడు నెలల పాలన పూర్తి కాని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటంటూ వీరు, రమేష్, బాలాజీలు హేళన చేశారు.

LEAVE A RESPONSE