(గోవిందరావు)
పవిత్ర పుష్కరిణిలో అపచారానికి పాల్పడ్డ భూమన కరుణాకరరెడ్డి…
తన ప్రచార ఆర్భాటానికి పుష్కరిణి పవిత్రతను మంట కలిపిన భూమన…స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పుణ్యస్నానాలు అచరింపచేసే పుష్కరిణిని తన పబ్లిసిటీకి విచ్చల విడిగా వాడుకున్నారు. పుష్కరిణిలో ఏకంగా ఫ్యాషన్ పరేడే నిర్వహించారు…..ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్‌ల మార్చివేశాడు భూమన….
తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వస్తున్న విమర్శలకు, తన హయాంలో తప్పేమి జరగలేదని ప్రమాణం చేయడానికి వచ్చిన భూమన.. పుష్కరిణిలో ఏకంగా ఫోటోషూట్ నిర్వహించారు.భూమన పుష్కరిణిలో స్నానం ఆచరిస్తుండగా అతని ప్రవేట్ ఫోటో గ్రాఫర్, 360 డిగ్రీలలో ఫోటోలు క్లిక్ మనిపిస్తునే ఉన్నారు.
ఫోటో గ్రాఫర్ సైతం పుష్కరిణిలో దిగి, ఫోటోలను తీయడం, అక్కడ ఉన్న భక్తులందకి విస్మయానికి గురిచేసింది. చేసిందే అపచారం ….ఇంకా అదేందో ఘన కార్యం అయినట్లు, సొంత పార్టీ మీడియాలో లైవ్ కూడా. ఇంత కన్నా అపచారం ఏమన్నా ఉంటుందా అంటూ భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.
పుష్కరిణిని ఫోటోషూట్ స్పాట్‌గా మార్చిన భూమన, ఫోటోగ్రాఫర్‌లను అధికారులు ఉదాసీనంగా వదిలివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పుష్కరిణిలో అపచారానికి పాల్పడిన భూమనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు.