• వైసీపీనేతలకు వణుకుడు రోగం
• ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకొని కేసుల నుంచి తప్పించుకుంటున్న జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం.. వైసీపీ కార్యాలయాలు అద్దెకివ్వడం ఖాయం
• టీడీపీ-జనసేన పొత్తు ప్రజలు కావాలనుకుంటున్నది.. మనస్ఫూర్తిగా వారు మెచ్చినది
• టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి, వైసీపీనేతలకు ఏంటి సమస్య? ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం
• దుర్మార్గుడు..దుష్టుడు.. పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిని సాగనంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పొత్తులు అవసరం
• పవన్ కల్యాణ్ ను తప్పుపడుతున్న వైసీపీ కాపునేతలు, అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తమ వర్గానికి చేసిన ద్రోహాన్ని గుర్తెరిగి మాట్లాడాలి
• టీడీపీ-జనసేన కలయికపై నోరుపారేసుకుంటున్న మంత్రులు.. మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్ రెడ్డి సీట్లు ఇస్తాడనే నమ్మకంలేదు
• వైసీపీకి అభ్యర్థులు లేరు అనడానికి తాను ప్రకటించిన ఇన్ ఛార్జ్ లు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కారన్న జగన్ వ్యాఖ్యలే నిదర్శనం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
టీడీపీ-జనసేన పార్టీల అధినేతల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కిందే భూకంపం వచ్చిందని, రాష్ట్రంలో ఎండలు పెరిగినప్పటికీ తాడేపల్లి కొంపలో మాత్రం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, అక్కడున్న నాయకుల కు చెమటలు ఆగడంలేదని, తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటించింది మొదలు, నేటి అభ్యర్థుల ప్రకటన వరకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు ఎందుకంతగా మితిమీరి స్పందిస్తున్నారో తెలియడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని తొలినుంచీ చెబుతూనే ఉన్నాం. ఇరుపార్టీ లు పొత్తుకు సిద్ధమైనప్పటినుంచీ వైసీపీ ఏదోరకంగా తమమధ్య విబేధాలు సృష్టించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. తాజాగా టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాతపాటే మాట్లాడితే వై.వీ. సుబ్బారెడ్డి, మంత్రులు అంబటి, రోజా సహా వైసీపీనేతలంతా ఒకరితర్వాత ఒకరు తమకొచ్చిన వణుకుడు రోగంతో మాట్లాడారు. 175స్థానాలు గెలుస్తామని గొప్ప లు చెబుతున్న వైసీపీనేతలు టీడీపీ-జనసేన పొత్తుని చూసి ఎందుకు భయపడుతున్నారు?
టీడీపీ-జనసేన ఒకేసారి 99మంది అభ్యర్థుల్ని ప్రకటించేసరికి వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. ప్రతిపక్షపార్టీల పొత్తుపై ఏడ్చే బదులు.. ఐదేళ్లలో తాను చేసింది జగన్ రెడ్డి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు?
ప్రతిపక్షపార్టీల పొత్తుపై పడి ఏడ్చే బదులు జగన్ రెడ్డి ఐదేళ్లలో తానేం చేసింది చెప్పుకొని ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నాడు? టీడీపీ-జనసేన నుంచి పోటీచేసే 99మంది అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించడంతో వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. టీడీపీ అధినేత సుదీర్ఘ కసరత్తు చేసి తొలిజాబితా ప్రకటించిన వెంటనే వైసీపీలో కొత్త ముసలం మొదలైంది. గతంలో జగన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ ఇన్ ఛార్జులకు భయం పట్టుకుంది. 50 రోజుల్లో మొత్తం తతంగం ముగిసి పోతున్నాకూడా జగన్ రెడ్డి ఇప్పటికీ పూర్తిగా ఒక్క స్థానానికి కూడా అభ్యర్థిని ప్ర కటించలేదు.
ఇప్పటివరకు వైసీపీతరుపున ప్రకటించిన వారంతా ఆయా నియోజ కవర్గాలకు ఇన్ ఛార్జ్ లు మాత్రమేనని, పోటీచేసే అభ్యర్థులు కారని గతంలో జగన్ రెడ్డే చెప్పాడు. టీడీపీ-జనసేన పొత్తుపై నోరు పారేసుకుంటున్నఅంబటి రాంబా బు, రోజా, గుడివాడ అమర్నాథ్ లకు సీట్లున్నాయా? గతఎన్నికల్లో ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధుల్ని ఇప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు వేరేచోటికి మార్చడాన్ని ఏమనాలి? ఇంతకు ముందు వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించిన ప్రజల పరిస్థితి.. వారు తమపై ఉంచిన నమ్మకం ఏమిటో కూడా జగన్ ఆలోచించలేదు.
జగన్ రెడ్డి… పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు వైసీపీలోని కాపునేతలకు తమ వర్గం ఆత్మాభిమానం గుర్తురాలేదా?
పవన్ కల్యాణ్ ను ఆయన సామాజికవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో తిట్టిస్తూ జగన్ రెడ్డి సంతోషపడుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి, జనసేన అధినేతను వ్యక్తిగతంగా అనరాని మాటలు అన్నప్పుడు వైసీపీలోని కాపునేతలు ఎందుకు స్పందించలేదు? అప్పుడు వారికి ఆ వర్గం ఆత్మాభిమానం గుర్తురాలే దా?
చంద్రబాబునాయుడు గతంలో కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు, వారి కోసం వేలకోట్లతో ఏర్పాటుచేసిన కాపు కార్పొరేషన్ ను జగన్ రెడ్డి రద్దు చేసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఆ వర్గం నేతలు ఎందుకు నోరెత్తలేదు? జగన్ రెడ్డి ప్రతి బహిరంగసభలో పవన్ కల్యాణ్ ను తిడుతున్నా ఏనాడూ వైసీపీ కాపునేతలు మాటమాత్రంగా కూడా స్పందించింది లేదు.
టీడీపీ-జనసేన పొత్తు ప్రజలు అంగీకరించి, మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పొత్తు.. వారే స్వయంగా ఏర్పాటు చేసిన పొత్తు ఎన్నికల తర్వాత వైసీపీ కార్యాలయాలు అద్దెకివ్వడమే
టీడీపీ-జనసేన పొత్తు ప్రజలు అంగీకరించిన, మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పొత్తు. ప్రజలే స్వయంగా ఏర్పాటుచేసిన పొత్తు. అలాంటి పొత్తుతో వైసీపీ చిత్తు అవుతోం దనే జగన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు 7 జాబితాలు విడుదలచేశాడు… ఆ జాబితాల్లో తాను ప్రకటించిన వారెవ రూ అభ్యర్థులు కాదని తానే అంటున్నాడు. ఇలాంటి వైఖరితో వైసీపీనావను ఆయనే ముంచేస్తున్నాడు. ఎన్నికలు ముగిశాక వైసీపీ కార్యాలయాలు అద్దెకు ఇవ్వడమే మిగిలింది. జగన్ రెడ్డి మెప్పు, ప్రాపకం కోసం టీడీపీ-జనసేన పొత్తుపై నోరుపారేసుకునే వైసీపీనేతలు భవిష్యత్ లో తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో వాలి.
ప్రధానంగా పవన్ కల్యాణ్ ను తిడుతున్న వైసీపీలోని కాపునేతలు జగన్ రెడ్డి తమవర్గానికి చేసిన ద్రోహాన్ని గుర్తించి మాట్లాడాలి. వైసీపీకి ఎలాంటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ పార్టీని ప్రజలు సింగిల్ డిజిట్ కే పరిమితం చేయబోతున్నా రు. వైసీపీకి ఎన్నికల్లో పోటీచేయడానికి అవసరమైన హోదా కూడా ఉండదు. ఎన్నికలయ్యాక జగన్ రెడ్డి బతుకు ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నా డు. ఆ పదవి కాస్త పోతే ఆయనకు ఎలా ఉండాలో అలా ఉంటుంది.
విలేకరుల ప్రశ్నలపై ఆనంద్ బాబు స్పందన…
టీడీపీ-జనసేన పొత్తు ప్రజలు కావాలనుకుంటున్నది.. వారు మెచ్చిన పొత్తు. 50 రోజుల తర్వాత వైసీపీ కనిపించదు. తనపార్టీ తరుపున తాను ప్రకటించిన వారు ఎవరూ అభ్యర్థులు కారని చెబుతున్న జగన్ రెడ్డి తీరుచూస్తే, ఆయనకు ఎవరూ పోటీకి దొరకడంలేదని తేలిపోయింది. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. టీడీపీ ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి..వైసీపీనేతలకు వచ్చిన సమస్య ఏమిటి? ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం.. వాటిని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. భయపడేవారే పొత్తుల్ని తప్పుపడతారు.
దుర్మార్గుడు..దుష్టుడు.. పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిని సాగనంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడానికి పొత్తులు అవసరం
టీడీపీ ఒక్కరోజే 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. జగన్ రెడ్డి 7జాబితాల విడుదల చేసినా నేటికీ ఒక్కవైసీపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మా పార్టీ ఇన్ ఛార్జ్ లు ఎవరూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కారని స్వయంగా వై.వీ.సుబ్బా రెడ్డే అంటున్నాడు. దాన్నిబట్టే ఒక్క అభ్యర్థినికూడా వైసీపీ ప్రకటించలేదని అర్థ మైంది. కూలి..నీలి మీడియాను అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి కావాలనే టీడీపీ-జనసే నల్ని తిట్టిస్తున్నాడు. ఎన్నికల్ని ఎదుర్కోవడం చేతగాక.. గెలిచే చేవలేకనే జగన్ రెడ్డి ఇలా బరితెగించాడు.
టీడీపీ-జనసేన పొత్తుపై నోరుపారేసుకుంటే అయినా తమకు జగన్ సీట్లు ఇస్తాడనే కొందరు మంత్రులు.. మాజీ మంత్రులు మాట్లాడు తున్నారు. తెలుగుదేశానికి గెలుపుఓటములు కొత్తకాదు. ఓటమి తర్వాత వైసీపీ చాప చుట్టేయడం ఖాయం. పొత్తులకోసం వెంపర్లాడటం… భయపడటం ఏమీ లేదు. ఒక దుర్మార్గుడు.. దుష్టుడు.. పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిని సాగనంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడానికి పొత్తులు అవసరం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో, ఇండియాకూటమి లో ఎన్ని పార్టీలున్నాయి? 50 రోజుల్లో వైసీపీ కథ ముగుస్తుంది.” అని ఆనంద్ బాబు తెలిపారు