తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024 కరపత్రం ఆవిష్కరణ

– చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు
– టీడీపీకి మద్దతు ప్రకటించిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి
– తమ మద్ధతు అని నేతల స్పష్టీకరణ

ఉండవల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే తమ సంపూర్ణ మద్ధతని మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. ముస్లింలపై దమనకాండను సాగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. ఉండవల్లిలో శనివారం చంద్రబాబును కలిసి ‘తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024’ కరపత్రాన్ని ఆవిష్కరింపజేశారు. మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఫారూఖ్ షిబ్లీకి చంద్రబాబు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

49 నియోజకవర్గాల్లోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సమావేశంలో టీడీపీకి మద్ధతు ప్రకటించాలని నిర్ణయించామని నేతలు వివరించారు. టీడీపీ విజయానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్న తమపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ పునరుద్ధరిస్తామని, ముస్లింల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. ముస్లింలపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.

Leave a Reply