Suryaa.co.in

Andhra Pradesh

గుణం లేనివాడు కులం మరక వేస్తాడు

-మానవత్వం లేనివాడు మతం కెలుకుతాడు
-మనస్సు పదిలం లేనివాడు ప్రాంతం పగ రగిలిస్తాడు
-రాజధానికి కులం ఎక్కడ, మతం ఏమిటి?
(డా. ఎం.సీ.దాస్ సౌజన్యంతో)

వారు ముఖపరిచయం కూడా లేనివారు. సాయంత్రం షో సినిమాకి వచ్చారు. సినిమా సగంలో భావోద్వేగంతో రాజధాని ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతులకు సంతాపసూచకంగా నిలబడ్డారు “రాజధాని ఫైల్స్” సినిమా ఇంటర్వెల్ లో. ఎక్కడా కూడబలుక్కోకుండా, వారు ముక్తకంఠంతో చేసిన “జై అమరావతి” నినాదాలతో, సినిమా హాలు దద్దరిల్లింది. వారిలో రన్నర్స్, స్విమ్మర్స్, లాయర్లు, డాక్టర్లు, సిఏ లున్నారు, ఇంజనీర్లు, రజకులు, గృహిణులు, పౌరసంఘనాయకులు, వ్యాపారస్తులు, వారింట్లో పని జేసేవారు కూడా ఉన్నారు. సినిమా తర్వాత డా” ఎం సీ దాస్ రచన “గుణం లేని వాడు కులం మరక వేస్తాడు… మానవత్వం లేనివాడు మతం కెలికేస్తాడు… రాజధానికి కులమేమిటి, మతమేమిటి?” గేయాన్ని ఆలపించారు.

LEAVE A RESPONSE