“రేషన్” తినండి అమ్ముకోవద్దండి

70

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ రఘునందన్

చౌక బియ్యం ను ప్రజలు అధిక ధరకు అమ్ముకోవద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిలల్దార్ మాచన రఘునందన్ సూచించారు.బుధవారం నాడు ఆయన దిండి లో ఓ ఇంట్లో రేషన్ బియ్యం తో వండిన అన్నం తిన్నారు. ఈ సందర్బంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొంత మంది రేషన్ బియ్యం నాణ్యత విషయం లో తేలికగా తీసుకుంటూ.. చవక గా వచ్చాయి కాబట్టి అంతగా పోషక విలువలు ఉండవేమో అన్న అపోహ కలిగి ఉన్నారని అభిప్రాయ పడ్డారు.

అందుకే క్షేత్ర స్థాయి అవగాహన కలిగించారు. ఓ ఇంటికి వెళ్లారు.రేషన్ బియ్యం ను వండించి మరీ తిన్నారు. ప్రభుత్వం ఒక్క కిలో బియ్యం పై 30 రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. ప్రజల వద్ద ఆహార భద్రత కోసం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవడం జరుగుతున్నదనీ వివరించారు. ఈ చౌక బియ్యం ను కొందరు అక్రమార్కులు ఇంటింటికీ తిరిగి అధిక ధర చెల్లించి కొని అత్యధిక ధరకు కోళ్ల ఫారం లకు అమ్ము కుంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఎక్కడి పంట ను అక్కడే మర పట్టి బియ్యం గా చేసి ప్రజలకు అంద జేస్తున్నామని వివరించారు.