– కేంద్రంలోని అధికారులంతా బీజేపీకి తొత్తులా?
– అధికారులను ఏ రీజన్ కింద బదిలీ చేశారో చెప్పి ఉండాల్సింది
– వాలంటీర్ల వ్యవస్ధను ఎవరూ ఏమీ చేయలేరు.. దానిని కదల్చలేరు
– ఐఏఎస్,ఐపిఎస్ అధికారుల్ని డీమోరల్ చేయడానికే పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదులు చేశారు.
– తనను కలసిన మీడియాతో వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
జగన్ వాలంటీర్ల వ్యవస్దను ప్రజలలోకి తీసుకువెళ్లారు.దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి.ఇతర రాష్ట్రాల వారు సైతం దానిని మెచ్చుకున్నారు. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు.
వాలంటీర్ల వ్యవస్ధను ఎవ్వరూ ఏమీ చేయలేరు.అది అవసరం దాని వల్ల ఉపయోగం ఉంది. నాలుగేళ్ళలోఅది ఎస్టాబ్లిష్ అయింది.తిరిగి జగన్ ప్రమాణ స్వీకారం చేశాక మరింత మెరుగ్గా వాలంటీర్ల సర్వీసులు వాడుకునేలా చేస్తారు. ఆ భరోసా వాలంటీర్లందరికి ఉందన్నారు. వాలంటీర్ అనే పేరులోనే సర్వీసు అనేది స్పూరిస్తుంది.వారికి ఇచ్చేది పారితోషికం. శాలరీ కాదు అని వివరించారు. సమాజంలో బాగా బతికేందుకు సామాజిక స్పృహ పెంచుకునేందుకు వాలంటీర్ గా పనిచేయడం అనేది దోహద పడుతుంది అన్నారు.నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని అన్నారు.
ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే టిడిపి,బిజేపి ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ….
. అధికారులను డీమోరలైజ్ చేసేందుకు పురందేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు నేను ఓ పత్రికలో చూశాను.20 మంది ఐపిఎస్ లపై ఫిర్యాదు చేశారు. ఈ లెక్కన చూస్తే నరేంద్రమోది ప్రభుత్వంలో పనిచేసేవారందరూ బిజేపి తొత్తులై ఉండాలన్నారు. లేదా బిజేపి రూల్స్ స్టేట్స్ లో వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలి అని ప్రశ్నించారు.పురందేశ్వరి కేంద్ర మంత్రిగాను,చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయడంలో తప్పులేదు.ఎన్నికల కమీషన్ పరిధిలోకి వ్యవస్దలు వెళ్లాక అది ప్రతిపక్షమైనా,అధికారపక్షమైనా సరే బాధలు ఉంటే చెప్పుకోవచ్చు. అన్నారు.
అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.అధికారయంత్రాంగాన్ని డీమోరల్ చేయడానికి,ఆత్మస్దైర్యం దెబ్బతీయడానికి కక్షగట్టి ఫిర్యాదులు తప్పుడువి చేస్తున్నారు. అయోమయం సృష్టిస్తున్నారు. వారికి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ఇలాంటివి చేస్తున్నారు.ఈసీ పై వత్తిడి తెస్తున్నారు.వారు కూడా లొంగిపోతున్నారు. నిన్న అధికారులను బదిలీ చేశారు. ఏ రీజన్ కిందనో చెప్పి ఉండాల్సింది. చిలకలూరిపేట ప్రధానిసభ అని ఓ రీజన్ చెప్పారు. ప్రధాని సెక్యూటిరికి ఎస్పీజీ ప్రత్యేకంగా ఉంటుంది.ప్రధాని వచ్చారంటే మొత్తం వారి ఆధీనంలో ఉంటుంది. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. ఇధి రిపోర్టర్లకు,మీడియాకు కూడా తెలుసు అన్నారు.
చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు.
వివేకానంద హత్యవిషయంలో షర్మిల,సునీతలు చేస్తున్న విమర్శలను తప్పుడు విమర్శలుగా సజ్జల కొట్టిపడేశారు.జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఆఖరుగా షర్మిల,సునీతలను ముందుపెట్టి ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు.ఐదేళ్ళు ఏమీ మాట్లాడని షర్మిల ఈరోజు వచ్చి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
ఉదయం లేచిన దగ్గర్నుంచి వారు చేసే విమర్శలకు సమాదానాలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదన్నారు.ఎందుకంటే వాళ్ళు కోర్టుపరిధిలో ఉన్న అంశాలు గురించి కూడా మాట్లాడుతున్నారన్నారు.దురదృష్టవశాత్తు ఐదేళ్ళ క్రితం జరిగిన హత్య గురించి ఈరోజు మాట్లాడటం చూస్తే జగన్ గారిని దెబ్బతీయాలనే దురుధ్దేశ్యం కనిపిస్తుందన్నారు.చంద్రబాబు ఆడమన్నట్లుగా వారిద్దరు ఆడుతున్నారని తెలియచేశారు.