Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం

2014లో మా నాన్నని చంపేశారన్నాడు
2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు
నేడు పెన్షనర్ల ఉసురు తీసి శవ రాజకీయం చేస్తున్నాడు
ఇవి ప్రభుత్వ హత్యలు కావా ?
దళితులకు 27 పథకాలిచ్చినోడు పెత్తందారుడా.. వారి పథకాలు రద్దు చేసినోడు పెత్తందారుడా
అన్న క్యాంటీన్‌తో కడుపు నింపినోడు పెత్తందారుడా.. అన్నం దూరం చేసినోడు పెత్తందారుడా?
దళిత సమాజంలో వైసీపీపై తిరుగుబాటు మొదలైంది
కొవ్వూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

 

కొవ్వూరు: జనసైనికులు హుషారుగా ఉండాలి. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రం నాశనమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్‌కు కొవ్వూరు సభా వేధిక నుండి అభినందిస్తున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రజల్ని గెలిపించడం కోసం బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నాయి. పార్లమెంటులో బీజేపీ అభ్యర్ధిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇద్దరు జనసేన అభ్యర్దులు పోటీ చేస్తున్నారు.

జగన్ రెడ్డికి శవ రాజకీయాలు అలవాటుగా మారిపోయాయి. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. వారి వారసత్వమే శవ రాజకీయం. మనుషుల్ని చంపేసి, దండేసి, ఎదుటివారిపై నెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి చనిపోతే, రిలయన్స్ వారు చంపేశారన్నారు. వారి షాపులపై దాడులు చేయించాడు. అధికారంలోకి రాగానే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు.

2014లో తండ్రి లేని బిడ్డ ఓటు వేయండి అన్నాడు. కానీ, రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి ఓటు వేశారు. 2019లో మళ్లీ శవ రాజకీయానికి తెరలేపాడు. తొలుత కోడికత్తి డ్రామా తీసుకొచ్చాడు. తర్వాత బాబాయి బాత్రూం మర్డర్ తీసుకొచ్చాడు. నారాసుర రక్త చరిత్ర అంటూ కథలు చెప్పాడు. జగన్ రెడ్డీ ఇప్పటికైనా సాధానం చెప్పు. బాబాయిని ఎవరు చంపారో. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు వారి చెల్లెలు సమాధానం అడుగుతోంది. శవ రాజకీయాలు చేసే వారు మీకు కావాలా?

వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్. 2014లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశాను. మళ్లీ అధికారంలోకి వస్తే తొలి నెలలోనే రూ.3000 ఇచ్చేవాడిని. కానీ, జగన్ రెడ్డి ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్ల తర్వాత రూ.3000 చేశాడు. రూ.1000 ఇచ్చి లక్ష సార్లు చెప్పుకుంటున్నాడు. రూ.2000 ఇచ్చింది కూడా జగన్ రెడ్డేనంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసేయను. కానీ రాజకీయ పార్టీకి పని చేయడం సరికాదు.

ప్రభుత్వం కోసం పని చేయమని చెప్పాను. ఎన్నికలు అయ్యే వరకు వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని కమిషన్ చెప్పింది. దాంతో, జగన్ రెడ్డి శవ రాజకీయాలు మొదలు పెట్టాడు. పండుటాకుల్ని చంపడానికి స్కెచ్ వేశాడు. గతంలో నేను ప్రతి అవ్వకు, తాతకు చెప్పా.. పెద్ద కొడుకుగా అండగా ఉంటానని చెప్పాను. ఆ మేరకు పెన్షన్ రూ.2000 చేశాను. అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి పేద వాడికి రూ.5కే కడుపు నిండా అన్నం పెట్టాను. పెన్షన్ పొందేవారు.. నెల మొత్తం అన్న క్యాంటీన్లలో అన్నం పెట్టి ఇంకా రూ.1500 మిగిలేలా చేశాను. చివరి రోజుల్లో కష్టపడకూడదనే లక్ష్యంతో కడుపు నిండా అన్నం పెట్టాను.

కానీ, సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారు. వారితో పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, సచివాలయాలకు రావాలన్నారు. ఇది ప్రభుత్వ హత్యలు కావా అని ప్రశ్నిస్తున్నా. జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం తప్ప పాలన చేతకాదు. చేతకాకపోతే ఒక్క రోజులో ఇంటి వద్ద ఎలా పంచాలో నేను చేసి చూపిస్తా. ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేయకపోతే, ఈ నెల నుండే రూ.4000 ఇస్తానని చెప్పా. దీంతో జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాడు. ఈ బుద్ధి రెండు రో జుల ముందు ఏమైంది? చంపే హక్కు నీకు లేదు. ప్రభుత్వంలో ఉన్నావు బాధ్యత నీది. ప్రశ్నించే హక్కు నాకుంది. తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తా.

శవ రాజకీయాలు చేసే జగన్ రెడ్డి ఫ్యాన్ ఆగిపోయింది. తిరిగే పరిస్థితి లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేసేందుకు ప్రజలు సిద్ధమైపోయారు. జగన్ రెడ్డి అరాచకాలు చూశాక.. పార్టీ గుర్తుగా గొడ్డలి పెట్టుకో. రాష్ట్రాన్ని శ్మశానం చేసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గమనా సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఐదేళ్ల పాలనలో ఎవరికైనా ఎలాంటి ప్రయోజనం అయినా కలిగిందా? నా ఎస్సీలు అంటూనే వారి గొంతులు కోస్తున్నాడు. సబ్ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు కల్పించాను. 27 సంక్షేమ పథకాలు అమలు చేశాం. వారి అభివృద్ధికి జనాభా దమాషా ప్రకారం నిధులిచ్చా.

ఐదేళ్లలో 3వేల ఎకరాలు కొనుగోలు చేసి అందించాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. డ్రైవర్లకు ఇన్నోవా కార్లు ఇచ్చి యజమానుల్ని చేశాను. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య తీసుకొస్తే.. ఆయన పేరు తీసేసి జగన్ రెడ్డి పెట్టుకున్నాడు. దళితులు ప్రశ్నించకూడదు, నోరెత్తకూడదు, ఎదురు నిలవకూడదు. కాదని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో చిత్రహింసలు పెడుతున్నారు. అవసరమైతే చంపేస్తున్నారు.

6000 మంది దళితులపై తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితుల్ని చంపేశాడు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. పైగా అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి వెళ్లాడు. అతన్ని ప్రజలంతా తరిమికొట్టారు. జగన్ రెడ్డి లాంటి అరాచకాన్ని అంగీకరిస్తామా? నేను అధికారంలోకి రాగానే రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్దరిస్తా. అభివృద్ధికి తోడుగా నిలుస్తా. మే 13న పోలింగ్ కి వెళ్లే క్షణంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇంట్లో, ఊళ్లో చర్చ జరపండి. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి.

జగన్ రెడ్డి పదే పదే అంటున్నాడు. జగన్ రెడ్డి పేదల మనిషంట.. నేను పెత్తందారుడినంట. జగన్ రెడ్డి 43 వేల కోట్లు దిగమింగాడని సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు వేశాయి. అది పాత లెక్క. ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు వెనకేశాడో అర్ధం కాని పరిస్థితి. పేదలకు కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్ పెట్టిన మనిషి పెత్తందారుడా.. రద్దు చేసి కడుపు కొట్టినోడు పెత్తందారుడా? పేద పిల్లలకు విదేశీ విద్యతో పేదలకు ప్రపంచ దేశాల్లో చదివించిన వారు పెత్తందారుడా.. రద్దు చేసిన వారు పెత్తందారుడా? ఈయన కుమార్తెలు లండన్, అమెరికాలో చదువుకుంటారు. పేదల పిల్లలు మాత్రం విదేశాల్లో చదవకూడదా? తెలివైన వారిని ఎంత వరకైనా చదివించి, ఉన్నత ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది.

టీడీపీ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. అప్పుడు రూ.200 వచ్చే కరెంటు బిల్లు జగన్ రెడ్డి 9 సార్లు పెంచి రూ.1000 చేశాడు. ధరలు పెంచని వారు పెత్తందారుడా.. ధరలు పెంచి పీల్చి పిప్పి చేసేవారు పెత్తందారుడా? ప్రజల బలహీనత అర్ధమైపోయి.. జే బ్రాండ్స్ తెరపైకి తెచ్చాడు. తయారీ, డిస్ట్రిబ్యూషన్, అమ్మకం మొత్తం జగన్ రెడ్డే చేస్తాడు. రూ.60 ఉన్న క్వార్టర్ రూ.200 చేశాడు. పెంచిన రూ.140 జగన్ రెడ్డి జేబుల్వలో వేసుకుంటున్నాడు. కిరాణా కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్స్ ఉన్నా గానీ, మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ జరగవు.

ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా.. తిరిగి ఆ శవాలతో శవ రాజకీయం చేస్తున్న అసలు సిసలైన పెత్తందారుడు ఈ జగన్ రెడ్డి. ఇక్కడే గోదావరి ఉన్నా ఎవరికీ ఇసుక దొరకడం లేదు. టీడీపీ హయాంలో ఉచితంగా అందే ఇసుక ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరింది. ఇసుక, మద్యంలో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇసుక మొత్తం దోచుకుని 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశాడు. రిచ్చెస్ట్ సీఎం ఎవరు అంటే దేశమంతా జగన్ రెడ్డి వైపు చూపిస్తున్నారు.

ప్రజలకు రూ.10 ఇచ్చి బుగ్గలు నిమిరి, నెత్తిన చెయ్యి పెట్టి రూ.100 లాగేస్తున్నాడు. ధరల బాదుడు, పన్నుల పోటు, ఛార్జీల మోతతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. విభజన సమయంలో తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం 35శాతం తక్కువగా ఉంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చా. పరిశ్రమలు ఏర్పాటు చేశా. ఆదాయం సృష్టించి.. ఆ వ్యత్యాసాన్ని 27 శాతానికి తగ్గించాను. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యత్యాసం తిరిగి 42 శాతానికి పెంచాడు. జగన్ రెడ్డి మరోసారి వస్తే.. రాష్ట్రంలో ఉపాధి దొరక్క ప్రజలంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. జగన్ రెడ్డిని గద్దె దించితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది.

కొవ్వూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, హోం మంత్రి. ఆమె చేస్తున్న ఇసుక దోపిడీకి పేదలు బలైపోయారు. తాళ్లపూడి నుండి విజ్జేశ్వరం వరకు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తోడేశారు. గామన్ బ్రిడ్జి కుంగిపోయింది. హోం మంత్రిగా అధికారాలు లేకపోయినా.. దోపిడీకి అడ్డూ అదుపూ లేదు. అత్యాచారాలు ప్రశ్నిస్తే.. ఇలాంటివి సాధారణమేనని మాట్లాడే మహానుభావురాలు ఆమె. మట్టి, ఎర్రమట్టి దోచుకున్నారు.

సెంటు పట్టా కోసం అరకొర చెల్లించి సేకరించిన భూముల్ని ఎకరా రూ.75 లక్షలకు అమ్ముకున్నారు. దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిపై తప్పుడు కేసు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. ప్రజలంతా తిరుగుబాటు చేస్తే.. ఇక్కడి నుండి పారిపోయి గోపాలపురంలో వాలింది. ఇక్కడ చెత్త అక్కడ బంగారమవుతుందా? దోపిడీలన్నీ తెలిసిపోవడంతో ఓటమి తధ్యమని ట్రాన్స్ ఫర్ చేశారు.

కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న వెంకటేశ్వరరావు సౌమ్యుడు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. నియోజకవర్గానికి ఏం కావాలన్నా అందిస్తాను. బీజేపీ అభ్యర్ధిగా పురందేశ్వరి నిలబడుతున్నారు. ఒక ఓటు సైకిల్ గుర్తుపై.. మరో ఓటు కమలం గుర్తుపై నొక్కి రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేసుకోవాలి. ప్రజలు గెలవాలి. శాడిస్టు ముఖ్యమంత్రి. అందర్నీ అవస్థలకు గురి చేసే ముఖ్యమంత్రిని గద్దె దించాలి. నీతిగా బతికే నాకే ఇబ్బందులు సృష్టించాడు. ఇలాంటి అరాచక శక్తిని ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇంటికొకరు తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని ముందుకు రావాలి.

రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం పోరాడుతున్న న్యాయవాదులకు మనస్పూర్తిగా మద్దతిస్తున్నా. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తా. 39 రోజులు రాష్ట్రం కోసం పని చేయండి. ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను.

 

LEAVE A RESPONSE