Suryaa.co.in

Telangana

సారా కేసులో సారు బిడ్డే కీలకం

లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత
రింగ్‌మాస్టర్ ఆమెనే
ఈడీ సంచలన వ్యాఖ్యలు
అప్రూవర్‌ను తన పేరు చెప్పవద్దని బెదిరించారు
ఫోన్లు ధ్వంసం చేశారు
లిక్కర్ కేసులో అసలు పాత్రధారి కవిత
ఆధారాలను జడ్జికి ఇచ్చిన ఈడీ

ఢిల్లీ: సారా కేసులో సారు బిడ్డ కవితను ఈడీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రను నిరూపిస్తూ, వాటి ఆధారాలను జడ్జికి సమర్పించింది. అప్రూవర్ ఇచ్చిన సాక్ష్యం కూడా అందులో పేర్కొంది. కేసీఆర్ బిడ్డ కవిత ఈ కేసులో ఎంత క్రియాశీలపాత్ర పోషించారు? అప్రూవర్‌గా మారిన వారిని ఏ స్థాయిలో బెదిరించారన్నది ఆధారాలతో సహా వాదించింది. అయితే కవిత తన కుమారుడి చదువు పేరుతో ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని ఆరోపించారు. గురువారం కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరఫు న్యాయవాదులు. రీజాయిన్డెర్లు ఫైల్ చేశారు.

కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్‌ పై ఒక పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. బెయిల్ పిటిషన్‌ పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. కవితపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియ జేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు.

విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవే నని కోర్టుకు ఈడీ వివరించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ కేసు లోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారన్నారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతే కాదు.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ తరపు న్యాయవాది జడ్జికి సమర్పించారు.

LEAVE A RESPONSE