కలెక్టర్లు, ఎస్పీలను మార్చిన ఈసీ

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి
పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్
ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్
కృష్ణా కలెక్టర్ గా కె. బాలాజీ
అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్
తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీ లను కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె. బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్త వారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది.

Leave a Reply