Suryaa.co.in

Telangana

కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఈసీ ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది. మంగళవారం జరిగిన ప్రచారంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ నివేదిక కోరింది.

LEAVE A RESPONSE