పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఉద్యోగుల ఆవేదన

రంగారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ అందలేదని జిల్లాలో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు సిబ్బంది చేరుకుంటున్నారు.

జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. 8 సెగ్మెంట్ల పరిధిలో 1419 ప్రాంతాల్లో 3453 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 35 లక్షల 23 వేల 219 మంది ఓటర్లు ఉన్నారు. 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు 43 వేల 775 మంది ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 209 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ సిబ్బంది 15,212 మంది ఉన్నారు. మైక్రోఅబ్జర్వర్లు 283 మంది, పీ.ఓలు 3803 మంది, ఏ.పీ.ఓలు 3803, ఓ.పీ.ఓలు 7606 మంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు.

Leave a Reply