కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచనలో అజహరుద్దీన్ ?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు.

2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం చెందారు.ఆ తరువాత హెచ్ సీఎ అధ్యక్షునిగా గెలుపొందారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరు నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

అయితే ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. ఎమ్మెల్యే కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ… రెండింటిలోనూ అజహర్ పేరు లేకపోవడంతో ఆయన ఇక కాంగ్రెస్ లో కొనసాగడం ఇష్టం లేక, ఆ పార్టీ సభ్యత్వానికి, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే తలంపుతో ఉన్నట్టు సమాచారం

Leave a Reply