కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలను కోర్టులు, దర్యాప్తు సంస్థల విచారణల దాకా తీసుకువచ్చిన ఆ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం దాడులు చేశారు. ఢిల్లీలోని ఆ సంస్థకు చెందిన 12 కార్యాలయాలతో పాటుగా కోల్కతాలోని 2 కార్యాలయాల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
ఈ కేసులో ఇటీవలే తొలుత రాహుల్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు సోనియాను 3 రోజుల పాటు విచారించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే దిశగా ఓ పత్రికను నడపాలన్న ఉద్దేశంతో గతంలో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక నిర్వహణ కోసం యంగ్ ఇండియా పేరిట ఓ సంస్థను కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆస్తులను రాహుల్ గాంధీ నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే.
Enforcement Directorate today carried out searches at multiple locations in Delhi and other places in the alleged National Herald money laundering case pic.twitter.com/WOOEwzkml7
— ANI (@ANI) August 2, 2022