Suryaa.co.in

National

జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎంకు ఈడీ నోటీసులు

-రేపు విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం
-మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఫ‌రూక్‌పై కేసు
-సోనియాను విచారిస్తున్న రోజే ఫ‌రూక్‌కు ఈడీ నోటీసులు

జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోమ‌వానం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధ‌వారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో అబ్దుల్లాను ఈడీ అధికారులు కోరారు. మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన కేసులో అబ్దుల్లాపై కేసు న‌మోదు చేసిన ఈడీ…తాజాగా ఆయ‌న‌ను విచార‌ణ‌కు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారిస్తున్న రోజే ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

LEAVE A RESPONSE