Suryaa.co.in

Telangana

ఎన్‌టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరికి ఈడీ సమన్లు

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని హకీంపేట్ గ్రామం, షేక్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 403/1 (పాత నంబర్‌) సర్వే నంబర్‌ 120 (కొత్త)లోని 1,519 చదరపు గజాల స్థలం అలాట్‌మెంట్‌కు సంబంధించి ఎన్‌ఫోర్సెమెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

ఈ లావాదేవీలు జరిగినపుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌టీవీ న్యూస్‌ ఛానల్ ఛైర్మన్‌ టి నరేంద్ర చౌదరికి, ఇతరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా సమన్స్‌లో పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించిన లావాదేవీల పత్రాలను కూడా తీసుకురావాలని ఈడీ స్పష్టం చేసింది. సొసైటీకి చెందిన పదేళ్ళ ఆడిట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టులు, వార్షిక నివేదికలు, ఆడిట్‌ రిపోర్టులు, సొసైటీ బోర్డ్‌ మినిట్స్‌ను కూడా తీసుకురావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వచ్చిన సమయంలో సొసైటీ అంతర్గతంగా విచారణ జరిపి ఉంటే, వాటి వివరాలు కూడా తీసుకురావాలని సమన్స్‌లో ఈడీ పేర్కొంది.

LEAVE A RESPONSE