Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి చెందిన ఏపీగా తీర్చిదిద్దేందుకు కృషి

– 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి సూచికలు 12 స్వర్ణాంధ సాధన సూత్రాలని వీటికి ఇరవై సూత్రాలను అనుసంధానం చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమైన పేదరికం లేని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

ప్రధాని మోడీ సంకల్పం వికసిత భారత్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్ర భాగస్వామ్యం తథ్యమని, నేను బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలో విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో పర్యటనతో కలిపి అయిదు పర్యటనలు అవుతాయన్నారు.

జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, ప్రజా ఆరోగ్యం, మహిళ, శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన – సెర్ప్, ప్మా అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర, ల్లాలకు సంబంధించిన సమీక్షల కోసం నిర్దిష్ట సమాచారం కోసం ఆదేశించినట్టు తెలిపారు. ఇంకా, దినకర్‌ ఏమన్నారంటే.. జాతీయ గోకుల్ మిషన్ పథకాల ద్వారరా పాల ఉత్పత్తి పెంచడానికి, మేలురకం జాతుల పశు సంపద పెంచడానికి కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నాం.

కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల నిధులు రాబట్టడం, రాష్ట్ర వాట నిధులు సమకూర్చి ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పనిలో మేం ఉన్నాం. ఆర్ధిక, సామాజిక, నాగరికత అభివృద్ధిలో నీటి ప్రాముఖ్యత అత్యంత ఆవశ్యం. 20 సూత్రాల కార్యక్రమాల అమలులో, నీతి అయోగ్ 17 ఎస్జీడీ లలో, 12 స్వర్ణాంధ్ర సాధన సూత్రాలలో నీటి వనరుల ప్రాధాన్యం సుస్పష్టం. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు కొత్త నీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ చాల కీలకం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేంద్రం సహాయంతో 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల పూర్తి సామర్ధ్యంతో, 175 టీఎంసీల ఉపయోగిత సామర్ధ్యం కలిగిన పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ పూర్తి కావడానికి 12,157 కోట్లు విడుదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 15,146 కోట్లు విడుదల చేసింది.

పోలవరం రాష్ట్ర జీవనాడి అయితే, వెలిగొండ వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా జీవనాడి. 2019 – 24 మధ్య నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పోలవరంతో సహా ఏ ప్రాజెక్టు అడుగు ముందు పడలేదు. 6 మార్చి 2024 న వెలిగొండ పూర్తి కాకుండానే పూర్తి అయినట్లు జాతికి నాటి ముఖ్యమంత్రి జగన్ అంకితం చేశారు. 12 మార్చి 2024 న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశంతో నా నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ వెలిగొండ పర్యటన చేసి వాస్తవలను బయట పెట్టాం.

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన అనంతరం ఒకవైపు కేంద్రం నుంచి నీటి ప్రాజెక్టుల నిధులు రాబడుతూనే రాష్ట్ర పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ముఖ్యమంత్రి నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తూ వాస్తవ అవసరాల ఆధారంగా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరంతో పాటు రాష్ట్ర ప్రాధాన్యత ప్రాజెక్టుగా వెలిగొండ ప్రాజెక్టును పరిగణిస్తూ రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో మా బృందం ప్రకాశం జిల్లా అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి సమీక్షించింది.
ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో నేను వెలిగొండ పర్యటన, సమీక్షలో భాగస్వామ్యం అయ్యాను.

క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పర్యటనలో భాగమైన రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి కు, సంబంధిత అధికారులకు సోమవారం సమర్పించాను.

LEAVE A RESPONSE