-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి: రాష్ట్రంలో ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం తన ఛాంబర్ లో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నేతృత్వంలోని ఎస్సి ఎస్టీ గజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో వారి సమస్యలపై కూలంకషంగా చర్చించినారు. ముఖ్యంగా జి ఓ నంబరు 789 ప్రకారం సెక్రెటేరియట్ లో లైజనింగ్ ఆఫీసర్ నియామకం, అన్ని కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, రోస్టర్ రిజిస్టర్ అమలు వంటి సమస్యలను పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షు&ప్రధాన కార్యదర్శి ఎం సునీల్ కుమార్& K.V. రమణ కృష్ణాజిల్లా అధ్యక్షుడు జి ఎస్ వై సుధాకర్ బాబు, ఎం రాఘవులు, డాక్టర్ ఓ నాగరాజు, బి రవి తదితరులు పాల్గొన్నారు.