పూతలపట్టు నియోజకవర్గంలో భువనమ్మ నిజం గెలవాలి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది… ఐరాల మండలం, చింతగుంపలపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం భువనమ్మ కారులో వెళుతూ ఉన్నారు. రోడ్డు ప్రక్కనే భువనమ్మ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రామచంద్రనాయుడు అనే వృద్దుడిని ట్రాలీ కుర్చీలో భువనమ్మ గమనించారు.
పక్షవాతం జబ్బుతో మంచాన పడిన ఆ వృద్దుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ కూతురు వస్తుందని తెలుసుకుని చూడాలని కుటుంబ సభ్యులను కోరడంతో అక్కడకు తీసుకొచ్చినట్లు భువనమ్మకు కుటుంబ సభ్యులు వివరించారు. వెంటనే భువనమ్మ ఆ వృద్దుని వద్దకు వచ్చి, చేయి పట్టుకుని ఏం పెద్దాయన…బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం జాగ్రత్త…ఏమైనా అవసరమైతే మన పార్టీ నాయకులను మీకు అందుబాటులో ఉండమని చెబుతా..వెళ్లొస్తానని కాసేపు ఆ వృద్ధునితో ముచ్చటించారు. ఆ వృద్ధుని కళ్లల్లో ఆనందానికి అవధులు లేవు.
అదేవిధంగా దారిమధ్యలో మరో వృద్ధురాలు లేవలేని స్థితిలో ఉండి భువనమ్మను చూడాలని కుటుంబ సభ్యుల వద్ద పట్టుపట్టడంతో వారు రోడ్డుప్రక్కన ఓ కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి భువనమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని గమనించిన భువనమ్మ వెంటనే ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లారు..ఆ వృద్ధురాలు భువనమ్మను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించి…బాగున్నావా అమ్మ అని పలకరించారు.
భువనమ్మ ఆ వృద్ధురాలితో మాట్లాడుతూ…బాగున్నాను అమ్మ…మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం జాగ్రత్త అని కాసేపు ముచ్చటించారు. ఆ వృద్ధురాలి కళ్లల్లో ఆనందం వెలకట్టలేనిది..వర్ణించలేనిది. కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్న భువనమ్మ…తనకోసం ఎదురుచూసేవారిని కూడా గమనించి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు..