Suryaa.co.in

Andhra Pradesh

భీమవరం నుండి బీజేపీ ఎన్నికల శంఖారావం

-వారసత్వ నాయకత్వానికి బీజేపీ లో తావు లేదు
-తల లేని మొండెం లా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ
-మేము జనసేన తో పొత్తులో ఉన్నాం
-పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తుంది
-ఫిబ్రవరి 20 నుండి 29 వరకూ ప్రజా పోరు యాత్ర
-ప.గో.జిల్లా..భీమవరం లో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ -ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
-కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షురాలు
-జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు
-పురందేశ్వరి కి భారీ ర్యాలీగా ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
-భీమవరం నుండి 25 పార్లమెంట్ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించి, శంఖం ఊది ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల నగారా మోగించాం అంటూ కార్యకర్తల హర్షధ్వానాలు మద్య ప్రకటించారు. శంఖం పూరించడంతో ఎన్నికల నగారా మోగించాం. ఒకేసారి 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం అదృష్టం. వారసత్వ నాయకత్వానికి బీజేపీ లో తావు లేదు. తండ్రి తరువాత కొడుకు అనేలా ఇతర రాజకీయ పార్టీల్లో ఉంటుంది. బీజేపీ లో కష్టపడ్డ కార్యకర్తకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది.

2014 కి ముందు స్కామ్ ల పర్వం దేశంలో కొనసాగింది. 2014 తర్వాత దేశంలో స్కీం లు మాత్రమే ప్రజలు చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో బీజేపీ 350 ఎంపీ సీట్లు గెలవనుందని విశ్లేషకులు చెబుతున్నారు. తల లేని మొండెం లా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఎన్ని ఇళ్ళు కట్టి పేదలకు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. స్టిక్కర్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మిగిలిపోతుంది. బిల్లులు రాక ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ని దూరం పెడుతున్నాయి.

పొత్తులు కేంద్రం నిర్ణయిస్తుంది, మేము జనసేన తో పొత్తులో ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలన, విద్వేషపూరిత పాలన చేస్తుంది. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమై, ఆలయాలు కూడా ధ్వంసం చేస్తున్నారు ఏపీలో ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు పెట్టి, జైలులో పెడుతున్నారు. సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీ కి లేదు. ప్రజాకంఠక పాలన పై గళం విప్పాల్సిన బాధ్యత ప్రతీ బీజేపీ కార్యకర్త తీసుకోవాలి. రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితి.

తెలుగుదేశం, వైసీపీ లు కేంద్రం సహకరించడంలేదని చెబుతున్నాయి.డిపిఆర్ ఇవ్వకముందే రూ.2,500 కోట్లు రాజధాని కి కేంద్రం ఇచ్చింది. నర్సాపురం వశిష్ఠ వారధి కి కేంద్రం రూ.400 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తుంది.

టీడీపీ హయాంలో మూడేళ్లు జాప్యం, వైసీపీ లో రివర్స్ టెండరింగ్ వల్లనే పోలవరం దెబ్బతింది.కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అంటున్నారు.ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేశాక, ప్యాకేజ్ కు ఓకే చెప్పారు నాటి తెలుగుదేశం ప్రభుత్వం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ లు మూడు పార్టీలు బీజేపీ పై నిందలు వేస్తున్నాయి.

పల్లెకు పోదాం ఫిబ్రవరి 9, 10, 11 న బీజేపీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 20 నుండి 29 వరకూ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తాం. ప్రతీ కార్యకర్త చేతిలో బీజేపీ జెండా, గుండె లో ఏపీ అభివృద్ధి అజెండా ఉండాలి. కేంద్రం చేసే ప్రతీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలి. ఏపీ లో బీజేపీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు తాతా జీ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, దంతులూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE