మన భారతీయ ఋషులు మనకందించిన జ్ఞానం…తెలుసుకోండి..తెలియజేయండి. అగస్త్య మహర్షి రచించిన అగస్త్య సంహితలోని ఈ మంత్రంలో ఎలక్ట్రిక్ సెల్ (విద్యుద్ఘటము) యొక్క వర్ణన ఎలా ఉందో చూడండి.
సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్క్రతమ్ ఛాదయే చ్ఛిఖిగ్రీవేన చార్రాదబి: కాష్ఠపాంసుబి: దస్తాలోష్టో నిధాతవ్వ: పారదాచ్ఛాది దస్తత: సంయోగా జ్జాయతే తేజో మిత్రావరుణ సౙగతమ్.
దీని భావం : ఒక మట్టి కుండను తీసుకోవాలి. దానిలో రాగి పలక పెట్టాలి. మరియు శిఖి గ్రీవాన్ని వేయాలి. తర్వాత మధ్యలో తడిసిన రంపపు పొట్టు వేయాలి. పైన పాదరసం మరియు యశదము(zinc) వేయాలి. తర్వాత తీగె లను కలపాలి. అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి వస్తుంది. ఇందులో శిఖిగ్రీవ మనగా నెమలి యొక్క మెడ రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ ఈ విధంగా తయారు చేసిన సెల్ ను డిజిటల్ మల్టీమీటర్ తో కొలిస్తే ఓపెన్ సర్క్యూట్ వోల్డేజ్ 1.38 వోల్టలు మరియు షార్ట్ సర్క్యూట్ కరెంట్ 23 మిల్లీ ఆంపర్స్ ఉన్నది.
దీనిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో డా.ఎమ్.సి.సహస్రబుద్దే హోలే గారి ఆధ్వర్యంలో తయారు చేసి విజయం సాధించారు. ఇది కదా నా భరత విజ్ఞాన గనిలో మరో కలికితురాయి. విదేశస్తులు వచ్చిన తర్వాతే నా భారతదేశానికి విజ్ఞానం తెలిసిందనే వాళ్ళు చూడండి. నా హైందవ విజ్ఞానం.