Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి

-మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రకాశంజిల్లా చరిత్రలో నేడు మరుపురాని ఘట్టం…సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన దినం.
ఒంగోలుగిత్తల పౌరుషాన్ని జిల్లాకార్యకర్తలు, పార్టీ అభిమానులు చూపారు.మహానాడు జరక్కుండా చేసిన ప్రయత్నాలను చీల్చిచెండాడుతూ, సభకు తరలివచ్చి న ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి పౌరుష, ప్రతాపాలకు,పట్టుదలకు ప్రతిరూపం.<a href=”https://imgbb.com/”><img src=”” alt=”270522gh-main37a” border=”0″></a>

పేదవాడి గుండెచప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు.మహానుభావుడి జయంతిని, 40వసంతాల తెలుగుదేశం వేడుకల్ని ఒకేసారి జరుపు కుంటున్నాం.రాక్షస పాలనలో ప్రజలంతా భయభయంగా బతుకుతున్నారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం ప్రభుత్వ పెద్దల సహాయసహకారాలతో దోపిడీ వనరుగా మారింది. రైతులకు కనీసం ఉచితంగా ఒక్కస్ప్రేయర్ ఇవ్వలేనిదిక్కుమాలిన ప్రభుత్వంలో ఉన్నాము.

చంద్రబాబు జలసిరిపేరుతో లక్షలఎకరాలు సస్యశ్యామలం చేశారు.ఈ ముఖ్యమంత్రి వచ్చాక రైతులమోటార్లకుమీటర్లు పెడుతూ, ఉచిత విద్యుత్ ని ఉత్తుత్తి విద్యుత్ గా మార్చాడు. ఏ సభలో అయితే మననాయకుడిని అవమానించారో, ఆ సభను గౌరవసభగా మార్చి, తిరిగి మన నాయకుడిని అక్కడికి పంపేవరకు ప్రకాశంజిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ ప్రభంజనమే వీయాలి. చంద్రబాబు అధికారంలోఉన్నా, ప్రతిపక్షంలోఉన్నా భావితరాలకోసమే పనిచేశా రు.నారా లోకేశ్ ఆధ్వర్యంలో తెలుగుదేశంసైనికులు కదనోత్సాహంతో పోరాడి, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి.

LEAVE A RESPONSE