Suryaa.co.in

Political News

ఉద్యోగస్తుల్లారా! కళ్ళు తెరుచుకోండి

– ఎదురు తిరగండి… పోరాడండి… సాధించుకోండి
ఎన్నికల ముందు పాదయాత్రలో ఉద్యోగస్తుల గురించి వాళ్ల హక్కులు గురించి ,కాంట్రాక్టు ఉద్యోగుల గురించి నన్ను అధికారంలోకి తెండి వారం రోజుల లోపల మీ హక్కులన్ననిటిని తీరుస్తానని, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ చేస్తానని జగన్ మోహన్ రెడ్డి బీరాలు పలికారు.
పిఆర్సి, ఫిట్మెంట్ ,డి ఏ , ఐ ఆర్ లాంటి మీ హక్కులను అమలు చేయమని మీరు డిమాండ్ చేస్తుంటే ఈరోజు పీఆర్సీ అమలు చేస్తే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు పలుకుతున్నారు. మిగతావి ఎలాగూ ఉండనే ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి టెక్నికల్ గా తెలియక పాదయాత్ర సందర్భంగా చెప్పారని సమర్థించుకుంటున్నారు.
గతంలో ఉద్యోగస్తుల యూనియన్లు ఉద్యోగస్తుల ఓటర్ల ఎన్నికతో ఎన్నుకోబడినవి వుండేవి. ఉదా:ఎన్జీవో, రెవిన్యూ ,పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు ,మున్సిపాలిటీ తదితర ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ అసోసియేషన్లు ఉండేవి. ఆ అసోసియేషన్లకు నగర, మండల, జిల్లా, రాష్ట్ర అసోసియేషన్ ఉండేవి వారు రాష్ట్ర ఎన్జీవో కమిటీని ఎన్నుకునే వారు. దానికి చట్టబద్ధత ఉండేది. వారు అధికారికంగా సమ్మె నోటీసు ఇచ్చుటకు కానీ, చర్చలు జరుపుటకు కానీ చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం చేసుకునే వారు.
ప్రస్తుతం ఎన్నుకోబడిన అసోసియేషన్స్ లేక ఎవరికి వారు జాయింట్ యాక్షన్ కమిటీల పేర్లు పెట్టుకొని ప్రభుత్వ చంకలో ఉండిపోయారు.అవీ 3 ,4 అయ్యాయి వాటిల్లో కులాలు కూడా వచ్చేశాయి జాయింట్ యాక్షన్ కమిటీ లు సజ్జల రామకృష్ణా రెడ్డితో నేను ముందంటే నేను ముందని వాళ్ల వ్యక్తిగత స్వార్థం కోసం రిటైర్మెంట్ దగ్గర పడుతుంది కాబట్టి రాజకీయ పదవులు ఆశించి సామాన్య ఉద్యోగలను అన్యాయం చేస్తున్నారు. 3 నెలల క్రితం ఈ ఉద్యోగ సంఘాలు వారి సమస్యలు చర్చించుటకు మాట్లాడుకుంటుంటే సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గర నుండి ఫోన్ వస్తే ఆ యూనియన్ నాయకుడు ఒకాయన ఎంత ఒంగిపోయి, వణికిపోయి మాట్లాడాడో మనం వీడియోలో,సోషల్ మీడియాలో చూసాం. ఇటువంటి వాళ్లా హక్కులను కాపాడేది.
పిఆర్సి అనౌన్స్ చేయంది చర్చలకే పోము అని మాట్లాడిన నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచిందే మహా భాగ్యమని పరిగెత్తుకుంటూ పోయారు మరి దీనిని ఏమనుకోవాలి?2019 సాధారణ ఎన్నికలలో

జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఉద్యోగస్తులంతా వారికి అనుకూలంగా ఓటు వేశామని వారే చెప్పుకున్నారు. ఇప్పుడు వారు దొంగకు తేలు కుట్టినట్లు గా,ఏమీ మాట్లాడలేక, వాళ్ల హక్కులు కాపాడుకోలేక ,సతమతమై పోతున్నారు.
నిజంగా నిజాయితీగా మీకు సమస్యలు పరిష్కారం కావాలని వుంటే మీరు వ్యక్తిగత స్వార్థం పక్కనపెట్టి పదవులు ఆశించకుండా సాధారణ ఉద్యోగిని దృష్టిలో పెట్టుకొని, కాంట్రాక్ట్ కార్మికులను కలుపుకొని పోరాటం చేయంది మీ సమస్యలు పరిష్కారం కానే కావు.
ప్రభుత్వం మిమ్ములను ప్రజలలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి ప్రజావ్యతిరేక, చట్టవ్యతిరేక , అప్రజాస్వామిక పనిలో ( ఐఏఎస్ ఆఫీసర్ నుండి సామాన్య గుమస్తా వరకు) మీదే సింహభాగం అవుతుంది . ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు చట్టవ్యతిరేక పనులన్నిటికీ ఎవరి స్థాయిలో వారు శిక్ష అనుభవించక తప్పదు తెలుసుకోండి. ఎదురు తిరగండి. పోరాడండి. సాధించు కోండి
రాబోయే ఎన్నికల్లో నిజాయితీగా చెప్పిన మాట మీద నిలబడి ఉద్యోగస్తులకు గాని, ప్రజలకు గాని పనిచేసే పార్టీ బిజెపి + జనసేన. ఆ అభ్యర్థులను ఎన్నుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహాయం చేయండి.మీరు బాగుపడతారు .రాష్ట్రం బాగుపడుతుంది . తద్వారా దేశం బాగుపడుతుంది.

– కరణం భాస్కర్
బిజెపి
నెల్లూరు
మొబైల్ నెంబర్ 7386128877.

LEAVE A RESPONSE