Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీకి మంగళం పాడేస్తున్నారు

తిరుపతిలోని కవులు కళాకారులు మేధావులు వెంటనే స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి తెలుగు సంస్కృత అకాడమీ తిరుపతిలోనే కొనసాగించాలి.

ఏపీ,తెలంగాణ అధికార భాష తెలుగు సుమారు 9 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది, ప్రపంచంలో అత్యధికలు మాట్లాడే భాషలో తెలుగు ఒకటి అన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. తెలుగు భాష,సంస్కృతి, అభివృద్ధి,తెలుగు భాషలో పాఠ్యాంశాల తయారీ, ప్రచురణ,తెలుగు సాహిత్యం పట్ల అవగాహన పెంచి ప్రోత్సహించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేయడం జరిగింది దీని కారణంగా అనేక పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రస్తుత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించి శ్రీ లక్ష్మీపార్వతి గారిని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ గా నియమించడం జరిగింది.

తిరుపతిలో తెలుగు భాష, సంస్కృతిని అకాడమీతో కలిపి “తెలుగు సంస్కృత అకాడమీ” పేరిట రాష్ట్ర స్థాయి సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.తెలుగు అకాడమీలో ఏపీలో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి తిరుపతి, అనంతపురం,గుంటూరు, విజయవాడ,విశాఖపట్నం నగరాలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి వీటిలో అనేకమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

తిరుపతి కి విద్యాపరంగా, వైద్య పరంగా ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, సాంస్కృత యూనివర్సిటీ, ఐఐటి, ఐసర్ తదితర విద్యాసంస్థలతో పాటు టీటీడీ ప్రభుత్వ వైద్యశాలలతో తిరుపతి పరపతి పెరిగింది.

తిరుపతి ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అలాంటి తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తామని ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా అద్దె భవనంలో అకాడమీ కార్యాలయం కొనసాగుతుంది.

తిరుపతి తెలుగు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు అవసరమయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ లాంటి 17 రకాల పుస్తకాలను ముద్రించబోతున్నట్లు అట్టహాసంగా ప్రకటించడం జరిగింది.

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తెలుగు భాష ఉత్సవాలు చేపట్టారు, అందులో భాగస్వాములైన తెలుగు పరిరక్షణ సమితి, తెలుగు భాషా వికాస వేదిక, మానస వికాస వేదిక తదితర సంస్థలు తెలుగు సాంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాయన్నారు.

తిరుపతి గంగమ్మ జాతరను సైతం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

తిరుపతి లోని కవులు కళాకారులు మేధావులు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు వారోత్సవాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే తెలుగు భాష కార్యక్రమాలలో భాగస్వాములై విజయవంతం చేశారు.

తెలుగు సంస్కృతి అకాడమీని విజయవాడకు తరలిస్తున్నారాన్న వార్తపై చైర్మన్ లక్ష్మీపార్వతి ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది, అలాగే స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కవులను కళాకారులను మేధావులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి “తెలుగు సంస్కృతి అకాడమీని” తిరుపతిలో కొనసాగించేలా ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

నవీన్ కుమార్ రెడ్డి ,రాయలసీమ పోరాట సమితి కన్వీనర్

 

 

LEAVE A RESPONSE