Suryaa.co.in

Andhra Pradesh

తగ్గేదే లేదు…

-ఉత్సాహంగా టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్రలు
-వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు
-మినీ మేనిఫెస్టోపై ప్రజలకు వివరించిన నేతలు

టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రారంభమైన భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్రలు రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం కాకినాడ, గుంటూరు, చిత్తూరు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జరిగిన బస్సు యాత్రల్లో ఆయా ప్రాంతాల నాయకులు పాల్గొని మినీ మేనిఫెస్టోలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

జోన్‌ 2లో..
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర సోమవారం జోన్‌-2 పరిధిలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించారు. ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో
ఎర్రవరం నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. సిరిపురంలో అంబేద్కర్‌, చినశంకర్లపూడిలో ఎన్టీఆర్‌, ఉత్తరకంచిలో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ హయాంలో వేసిన ఉత్తర కంచి- ఒమ్మంగి రోడ్‌, వైసీపీ హయాంలో అభివృద్ధికి నోచుకోని ఒమ్మంగి- శరభ వరం రోడ్డు, శరభవరంలో నిరుపయోగంగా ఉన్న జగన్‌ హౌస్‌ సైట్స్‌, శరభవరంలో ప్రారంభం కాని రైతు భరోసా కేంద్రం వద్ద సత్యప్రభ, తదితరులు సెల్ఫీలు దిగారు. అనంతరం శరభవరంలో సత్యప్రభ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో ముఖ్య అతిధిగా శాసనమండలి మాజీ వైస్‌ ఛైర్మన్‌, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం మినీ మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. టీడీపీ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ పాలనలో రద్దు చేశారని విమర్శించారు. జగన్‌ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నారని ఆరోపించారు.

ఇప్పుడు టీడీపీ మినీ మేనిఫెస్టో రాగానే ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా టీడీపీికి ఉందన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగానే మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినీ మేనిఫెస్టోలో హామీలిచ్చామని చెప్పారు. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిరదని, తిరిగి రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబును సీిఎంను చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పరిపాలనలో ఘోరంగా విఫలమైన జగన్‌ రెడ్డి వచ్చే ఎన్నికలలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రతి బూలింగ్‌ బూతులో మన ఓట్లు మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ పథకాలకు వైసీపీ రంగులు వేసుకోవడం మినహా జగన్‌ హయాంలో సాధించింది ఏమీ లేదని విమర్శించారు. సంపూర్ణ మద్యనిషేధం చేయిస్తామని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి ఇప్పటికి లక్ష కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపు లేదన్నారు.

అందుకే చంద్రబాబు మినీ మేనిఫెస్టోతో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టిడిపిని గెలిపించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్తిపాడులో వరుపుల రాజా కలలుగన్న అభివృద్ధిని సాధించేందుకు, సంక్షేమ పథకాలు అమలు చేసుకునేందుకు ఆయన సతీమణి వరుపుల సత్యప్రభను గెలిపించాలని సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కెేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ దళితులు నా మేనమామలని చెప్పి మభ్యపెట్టి ఓట్లేయించుకున్న జగన్‌ అధికారంలోకి రాగానే దళితుల పైనే వేధింపులు మొదలు పెట్టారని మండిపడ్డారు. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చి వాడని ముద్రవేసి చంపేశారని, అక్రమ ఇసుక రవాణా గురించి ప్రశ్నించిన పాపానికి వరప్రసాద్‌ అనే యువకుడికి శిరోముండనం చేశారని, ఇలా చెప్పుకుంటూపోతే దళితులపై వైసీపీ పాలకుల హత్యలు, అత్యాచారాలకు అంతు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలలో దళితులు గుణపాఠం చెప్పాలని జవహర్‌ కోరారు. వైసీపీ పాలనలో పేదలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మతం పేరిట సమాజాన్ని విడదీయాలని జగన్‌ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. జగన్‌ నలుచెరగులా రెడ్డిగార్ల పెత్తనమేనని, అతనికి సామాజిక స్పృహ లేదని ఆరోపించారు. వరుపుల రాజా మన మధ్య లేకున్నా టీడీపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని జవహర్‌ తెలిపారు.

కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఈ దేశంలో శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అన్న ఎన్టీఆర్‌ కూడు, గూడు, గుడ్డ అందిస్తే, చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమం పంచారని చెప్పారు.

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వందలాది మంది పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్లే వరుపుల రాజా తనువు చాలించారని చెప్పారు. 2019లో జగనన్న ఏదో ఉద్ధరించేస్తారని తాను కూడా వైసీపీ కోసం పని చేశానని, కానీ ఇప్పుడు భ్రమలు వీడి టీడీపీ కోసం పని చేయడానికి వచ్చానని తెలిపారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరిస్తాడనుకోవడం అవివేకమని విమర్శించారు.

అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్‌ కోడికత్తి డ్రామాలు, గొడ్డలితో బాబాయిని చంపి గగ్గోలు పెట్టిన జగన్‌ అధికారం దక్కించుకున్నాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. స్వర్గీయ వరుపుల రాజా ఆత్మశాంతి కోసం సత్యప్రభను గెలిపించాలని రాజేష్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ నాలుగేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని తెలిపారు. వైసీపీ అప్పులు చేసి రాష్ట్ర పాలన సాగిస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తారని వివరించారు.

యువత, మహిళలు, రైతులు, బీసీిలు.. ఇలా అందరి సంక్షేమానికి చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో వరాలు ప్రకటించారని రమణబాబు తెలిపారు. ఈ సభలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్‌ సుంకర పావని, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు కటకంశెట్టి ప్రభాకర్‌, విఎస్‌ఎన్‌ రాజు, టీడీపీి జోన్‌-2 మీడియా కోఆర్డినేటర్‌ బోళ్ళ సతీష్‌ బాబు, కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, నాయకులు మోది నారాయణస్వామి, భాస్కరరావు, పత్తి రామారావు తదితరులు పాల్గొన్నారు.

జోన్‌ 3లో
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ మొహమ్మద్‌ నసీర్‌ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం, ఏటుకూరు సెంటర్లో శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి బస్సు యాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికారు. కొత్తపేటలో టీడీపీ హయాంలో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ని తొలగించడాన్ని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్‌ నిర్వహించారు.

ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద తెదేపా హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్‌ వద్ద సెల్ఫీ ఛాలెంజ్‌ నిర్వహించారు. బస్టాండ్‌ వద్దకు వచ్చి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. పాత గుంటూరులో తెదేపా హయాంలో నిర్మించిన మోడరన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద, బీఆర్‌ స్టేడియం వద్ద తెదేపా హయాంలో నిర్మించిన బీసీి హాస్టల్‌ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. పాత గుంటూరులో ఎన్‌.ఎస్‌ రామయ్య మండపంలో వర్తక వాణిజ్య సంఘ నాయకులతో చర్చా గోష్టి కార్యక్రమం నిర్వహించారు.

పాత గుంటూరు, నందివెలుగు రోడ్డులో తెదేపా హయాంలో ప్రారంభించిన బ్రిడ్జిని చూపిస్తూ, ఎన్టీఆర్‌ మానస సరోవరం పార్కుని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. రచ్చబండ జరిగే ఎల్‌.ఆర్‌ కాలనీ రోడ్‌, వినాయక టెంపుల్‌ సెంటర్‌కు భారీ వాహన ర్యాలీతో చేరుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో సుమారు 1500 మంది ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ .. తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ హయాంలో చేపట్టామన్నారు. టీడీపీ హయాంలో పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ని మోడరన్‌ పోలీస్‌ స్టేషన్‌ గా తీర్చిదిద్దారు. కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ ని పడగొట్టి నాలుగేళ్లు దాటింది… ఇంతవరకు కొత్త భవనం పనులు మొదలు పెట్టలేదన్నారు. తెదేపా హయాంలో బీసీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌ 90 శాతం పూర్తవ్వగా… మిగిలిన 10 శాతం పనులు కూడా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు.

భవిష్యత్తుకు భరోసాకు అర్ధం జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడమే, వైకాపా పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు, మైనార్టీల అభివృద్ధి కోసం చంద్రబాబు అనేక పధకాలు అమలు చేశారు, మైనార్టీల పథకాలన్నీ జగన్‌రెడ్డి రద్దు చేసారన్నారు. రంజాన్‌ తోఫా, మసీదుల మరమ్మత్తు, దుల్హన్‌ పధకం, విదేశీ విద్య, షాదీఖానాల అభివృద్ధి ఇలా అనేక పధకాలు జగన్‌ రెడ్డి రద్దు చేసారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోని వివరించడం కోసమే భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌, యరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ ఇంచార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, బాపట్ల నియోజకవర్గ ఇంచార్జ్‌ వేగేసన నరేంద్ర వర్మ, నరసరావుపేట ఇంచార్జ్‌ చదలవాడ అరవిందబాబు, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు గూడపాటి శ్రీనివాస్‌, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిట్టాబత్తిన చిట్టిబాబు, దాసరి రాజా మాష్టారు, మానుకొండ శివప్రసాద్‌, మద్దిరాల ఇమ్మానుయేల్‌, కలపటపు బుచ్చిరామ్‌ ప్రసాద్‌, కూచిపూడి విజయ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌, జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు మన్నవ వంశీ కృష్ణ, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు షేక్‌ జానీ బేగం, కార్పొరేటర్లు యల్లావుల అశోక్‌ యాదవ్‌, ముప్పవరపు భారతి, పోతురాజు సమత, ఈరంటీ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జోన్‌ 4లో..
భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర జోన్‌ ` 4 లోని చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం, యర్రావారిపాళెం, చిన్నగొట్టికల్లు మండలాల్లో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది.
భాకరాపేటలో జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తలకోన సిద్దేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సాయబులపల్లికు యాత్ర చేరుకుంది. మసీద్‌లో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం చిన్నగొట్టికల్లు మండలం, రంగన్నగారిగడ్డ గ్రామానికి చేరుకుంది. రంగన్నగారిగడ్డ గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ జన్మభూమి, అమరావతి, హైటెక్‌ సిటీ, స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ల సృష్టి కర్త మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జోన్‌ 4 భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర ఇక్కడికి విచ్చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.450 ఉండేది. అందులో మళ్లీ సబ్సిడీ కూడా వచ్చేది. ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1250కి చేరింది. సబ్సిడీ కూడా ఎత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల రేషన్‌, కేంద్ర ప్రభుత్వం మరో 5 కిలోల రేషన్‌ బియ్యాన్ని ఇవ్వాలి. కానీ 5 కిలోల మాత్రమే ఇచ్చి మరో 5 కిలోల మద్యం ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల కోసం మహిళాశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేస్తుంది. అలాగే ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. 18 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వనుంది. యువనిధి పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.3వేలు ఇస్తాం. అలాగే 20 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ప్రతిఏటా రైతులకు 20వేలు ఇస్తాం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తాం.

వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లలో 8సార్లు కరెంటు చార్జీలు పెంచడమే కాకుండా సర్‌ చార్జీల పేరుతో దోచేస్తోంది. పింఛన్‌ను 200 నుంచి వెయ్యి, వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే. పేదలను ధనవంతులు చేసే మహత్తర కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. మినీ మేనిఫెస్టోలోని పథకాలే కాకుండా దసరాకు మరిన్ని పథకాలు ప్రకటిస్తారన్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మొదట 5ఏళ్లు రూలింగ్‌లో లేమన్నారు. ఈ 4ఏళ్లలో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలి. 2014లో గెలిచిన తర్వాత 2018లో ఎన్నికల ముందు వచ్చి స్వీట్స్‌, వాచీలు, చీరలు పంచారు. ఎంపీటీసీ ఎలక్షన్స్‌లో వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు చూసి అధినేత చంద్రబాబు ఆదేశాలతో పోటీ నుంచి విరమించుకున్నాం. సర్పంచ్‌ పదవులకు వేలం పెట్టిన విషయం కూడా తెలిసిందే.

మళ్లీ ఎలక్షన్స్‌ వస్తున్నాయి. చెవిరెడ్డి దగ్గర నుంచి చీరలు, జాకెట్లు, వాచీలతో పాటు లక్ష్మీ డాలర్‌ కూడా వస్తుంది. ఓటుకు 5 నుంచి 10 వేలు ఇస్తారు. అన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. ఆ సొమ్ము అంతా ప్రజల డబ్బే. 2024లో గెలిచిన 6 నెలల్లో వెనుకబడిన ప్రాంతాలైన యర్రావారిపాళెం, చిన్నగొట్టికల్లు మండలాల్లో టమోటా, మామిడి పంట కోసం కోల్డ్‌ స్టోరేజ్‌లు తెస్తానన్నారు. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి… పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి.

కొందరు వైసీపీ నాయకులు టీడీపీ లోకి రావాలని చూస్తున్నారు. అందరినీ స్వాగతిస్తాం. అందరినీ గౌరవిస్తాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పనపాక లక్ష్మి, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఇన్చార్జీలు బొజ్జల సుధీర్‌ రెడ్డి, గాలి భానుప్రకాష్‌ నాయుడు, మురళీ, లెనిన్‌ , నరసింహ ప్రసాద్‌, మాజీ తుడా ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

జోన్‌ -5లో
భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర కార్యక్రమం గుంతకల్‌ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆర్‌. జితేందర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పామిడి మండల కేంద్రం నుండి ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు యాత్రకు స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పూర్తయి అధ్వాన్నస్థితికి చేరుకున్న టిడ్కో ఇళ్ళను నాయకుల బృందం సందర్శించి సెల్ఫీ దిగారు. మధ్యాహ్నం 12.15 గంటలకు టిడ్కో ఇళ్ళ వద్ద నుంచి ర్యాలీగా యాత్ర పామిడిలో సాగింది.

మధ్యాహ్నం 1.00 గంటలకు గుత్తి పట్టణానికి చేరుకుంది. అనంతరం రాల్యీగా యాత్ర సాగింది. గుత్తి పట్టణంలో తెదేపా ప్రభుత్వహయాంలో ప్రారంభమై ఆగిపోయిన మెగా వాటర్‌ ప్రాజెక్టును సందర్శించి సెల్ఫీ దిగారు.

మధ్యాహ్నం 1.55 గంటలకు గుత్తి పట్టణ సమీపంలో దాదాపుగా పూర్తికావచ్చి అధ్వాన్నస్థితికి చేరుకున్న టిడ్కో ఇళ్ళను నాయకుల బృందం సందర్శించి సెల్ఫీ దిగారు. మధ్యాహ్నం 2.50 గంటలకు యాత్ర బృందం పాతకొత్తచెరువుకు చేరుకుంది. అక్కడి ప్రజలు, కార్యకర్తలు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం తెదేపా సూపర్‌` 6 పథకాలను ప్రజలకు వివరించారు. భోజన విరామం అనంతరం యాత్ర ముందుకు సాగింది.

సాయంత్రం 4.10 గంటలకు గుంతకల్‌ పట్టణ సమీపంలోని తిమ్మాపురం గ్రామం వద్ద స్థానిక వైసీపీి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అక్రమంగా తవ్వి డంప్‌ చేసిన ఎర్ర మట్టి దిబ్బలను సందర్శించి నాయకుల బృందం సెల్ఫీ దిగింది. సాయంత్రం 4.30 గంటలకు గుంతకల్‌ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాలిటెక్నికక్‌ కళాశాల ప్రాంతాన్ని సందర్శించి సెల్ఫీ దిగారు. సాయంత్రం 5.00 గంటలకు పాత గుంతకల్లులో వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం మస్తాన్‌వలి దర్గాలో ప్రార్థనలు, స్థానిక బీరప్ప సర్కిల్‌ వద్ద కనకదాసు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. సాయంత్రం 5.40 గంటలకు గుంతకల్‌ పట్టణంలో వృధాగా ఉన్న మైనార్టీ కళాశాల, హాస్టల్‌ భవనాలను నాయకుల బృందం సందర్శించి సెల్ఫీ దిగారు.

సాయంత్రం 6.20 నిమిషాలకు గుంతకల్‌ పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో యాత్ర బృందం పాల్గొంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు పథకాలను జిల్లా నాయకులు ప్రజలకు వివరించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం 7.55 నిమిషాలకు కసాపురం రోడ్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆర్‌. జితేందర్‌గౌడ్‌తో పాటు అనంతపుంం పార్లమెంటు అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీకే పార్థసారధి, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కోట్ల సుజాతమ్మ, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వైకుంఠం ప్రభాకరచౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు గోవర్ధనరెడ్డి, ఏపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కరణం రామమోహన్‌, జి. ఆదెన్న, ఏపి రాష్ట్ర బోయ ఫెడరేషన్‌ కన్వీనర్‌ పూల నాగరాజు, ఏపి రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజయ్‌కుమర్‌, జి. వెంకటశివుడు యాదవ్‌, దేవళ్ళ మురళి, కమతం కాటమయ్య, కురుబ శివబాల, అనంతపుంం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జి. శ్రీధర్‌ చౌదరి, జిల్లా సీనియర్‌ నాయకుడు కెేసీ హరి, రాష్ట్ర బీసీి సెల్‌ అధికార ప్రతినిధి ఆర్‌. పవన్‌కుమార్‌ గౌడ్‌, అనంతపురం పార్లమెంటు డాక్టర్‌ సెల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ జె. గౌస్‌ మోద్దీన్‌, మాజీ మేయర్‌ స్వరూప, వందల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE