Suryaa.co.in

Telangana

ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు?

– కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా?
– టీచర్లు ఉన్నది స్కూల్లో పాఠాలు చెప్పడానికా లేక సర్కారు పనులన్నీ చేయడానికా?
– బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు.

ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు? కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా? అది కూడా మూడు వారాల పాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్సి ఎస్టీల పిల్లలు చదువుతారు కాబట్టి మీరు ఒక పూట బడులు కూడా మూసేస్తారా? పేదలంటే ఇంత నిర్లక్షమా?

అయినా టీచర్లు ఉన్నది స్కూల్లో పాఠాలు చెప్పడానికా లేక సర్కారు పనులన్నీ చేయడానికా? లక్షల మంది నిరుద్యోగులు పనుల్లేక అల్లాడుతున్నారు. వాళ్ళతో చేపించుకోవచ్చు కదా మీ సర్వేలు? అంటూ మండిపడ్డారు.

సామాజిక న్యాయం చెయ్యడానికి తప్పనిసరిగా కులగనన జరగాలని. కానీ, అందుకు ఇతర డిపార్ట్మెంట్ లను వాడుకోవాలని సూచించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఒక్కరోజులోనే రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే చేశారని. కానీ, ఈ ప్రభుత్వం బీసీ ల అంశాన్ని రాజకీయం చేసి కాలయాపన చెయ్యడం కోసమే ఈ తంతు నడిపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE